Telangana: మరోవారం సింగిల్‌ డిజిట్‌ ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు ఎల్లో ఆరెంజ్ అలెర్ట్‌..!

Telangana Weather Update: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత కొనసాగుతుంది. అయితే మరో వారం రోజులపాటు ఇలాగే ఉంటుందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా తెలంగాణలో చలి తీవ్రత మరింత పెరిగింది. ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌ నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో వారం ఇలాగే కనిష్ట ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
 

1 /5

 బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడం వల్ల రాయలసీమ, కోస్తా ఆంధ్ర జిల్లాలో మోస్తారు వర్షాలు కురుస్తాయనిన్న వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా ఉపరితల ఆవర్తన ద్రోణి వల్ల చలి తీవ్రత కొనసాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో సింగిల్‌ డిజిట్‌ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.  

2 /5

 ఆదిలాబాద్, రంగారెడ్డి తదితర జిల్లాలో సింగిల్ డిజిట్‌కే ఉష్ణోగ్రతలు పరిమితం అవుతున్నాయి. ముఖ్యంగా గద్వాల జిల్లా మినహా అన్ని జిల్లాల్లో టెంపరేచర్లు 15 డిగ్రీల కంటే తక్కువగా నమోదు అవ్వడంతో జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ ఎల్లో కలర్ జారీ చేసింది.  

3 /5

 తెలంగాణలో చాలా తీవ్రత మరో వారం పాటు ఇలాగే కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఏపీలో కూడా ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత మరింత పెరిగిపోయి దట్టమైన పొగ మంచు కప్పేస్తుంది. అయితే సంక్రాంతికి ఉష్ణోగ్రతలు పనికి పడిపోవడం సాధారణం కానీ భిన్నంగా ఇంకా తగ్గడం లేదు.  

4 /5

 ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉష్ణోగ్రతలు బాగా పడిపోయాయి. ఉదయం 10:00 వరకు పొగ మంచు కప్పేస్తుంది. ముఖ్యంగా అరకు ప్రాంతంలో ఐదు డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో స్థానికులు పర్యాటకులకు ఇబ్బందికరంగా మారింది.  

5 /5

ఈ చలి నేపథ్యంలో వాతావరణ శాఖ చంటి పిల్లలు, వృద్దులకు ఆరోగ్య హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా వీళ్లు టోపీలు, చలి కోట్ల ధరించకుండా బయటకు రాకూడదని హెచ్చరించింది.  వాహనదారులు ఉదయం ప్రయాణించేవారు పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.. లేకపోతే ప్రమాదాలు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఉదయం పది గంటలకు వరకు పొగమంచు కప్పేస్తోంది.