Weather Update: ఉపరితల ఆవర్తనం.. రెండు రోజులపాటు రాష్ట్రంలో వర్షాలు ఐఎండి హెచ్చరిక..

Andhra Pradesh Weather Update: కన్యాకుమారి సమీపంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని ఐఎండి హెచ్చరించింది.. ఈ నేపథ్యంలో సరైన జాగ్రత్తలు పాటించాలని సూచించింది ఏ జిల్లాలో వర్షాలు కురిస్తాయో పూర్తి వివరాలు తెలుసుకుందాం.
 

1 /5

రెండు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. దీంతో పాటు కన్యాకుమారి సమీపంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం వల్ల ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండి హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఈ  జిల్లాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.  

2 /5

 ముఖ్యంగా తిరుపతి, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో ఇవాళ వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండి తెలిపింది. ఇక ప్రకాశం చిత్తూరు నెల్లూరులో నిన్న కూడా వర్షాలు కురిసాయి. తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత కొనసాగుతుంది. కోస్తాలో మరింత పెరిగింది.  

3 /5

 మరో రెండు రోజులపాటు ఈ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇక తెలంగాణలో కూడా చలి తీవ్రత పెరిగిపోతుంది. రానున్న మూడు రోజులు పాటు జాగ్రత్త వహించాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. సింగల్ డిజిట్ ఉష్ణోగ్రత నమోదు కావటంతో రాత్రివేళ చలి తీవ్రత మరింత పెరిగింది  

4 /5

 సంక్రాంతి పండగ పూట రాత్రి తెల్లవారుజామున చలి తీవ్రత మరింతగా ఉంటుంది. మధ్యాహ్నం సమయంలో కూడా సాధారణ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణలో ముఖ్యంగా ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో చలి తీవ్రత విపరీతంగా ఉంటుంది.  

5 /5

చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో వృద్ధులు, పిల్లలు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. వాహనాలు నడిపే వారికి కూడా జాగ్రత్తగా లైట్లు వేసుకుని వెళ్లాలని కోరింది. ముఖ్యంగా ఉదయం పూట బయటకు వెళ్లకుండా ఉండటమే మేలు. ఈ సమయంలో వాహనాల ప్రమాదాలు కూడా అధికంగా ఉంటాయి. అత్యవసర పరిస్థితుల్లోనే  తెల్లవారుజామున బయటకు రావాలి అని సూచించింది.