Cold Waves Alert in Telangana: కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టేశాం. చలి తీవ్రత కూడా నిన్నటి వరకు తగ్గింది అన్న తరుణంలో మళ్లీ ఈరోజు పుంజుకుంది. చలి పంజా విసురుతోంది. దీంతో రానున్న నాలుగు రోజులపాటు ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోతాయని హైదరాబాద్ వాతవరణ శాఖ హెచ్చరించింది. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
Rains Shortage Farmers Waiting For Rains: నైరుతి రుతుపవనాలు ముందే ప్రవేశించినా ఆశించిన వర్షాలు పడడం లేదు. దీంతో తెలంగాణ రైతులు ఆకాశానికేసి చూస్తున్నారు. జూలై రెండో వారం చేరుకున్నా అన్ని జిల్లాల్లో పంటకాలం ప్రారంభం కాకపోవడంతో మళ్లీ కరువు భయం అలుముకుంది.
Hyderabad Rain: కొన్ని రోజులుగా భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఎండల ప్రభావానికి సామాన్య జన జీవనమంతా అస్తవ్యస్తంగా మారిపోయింది. ఎండకు భయపడి ప్రజలు బైటకు వెళ్లేందుకు కూడా ధైర్యం చేయట్లేదు. ఈ క్రమంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది.
Heavy Rain Lashes Hyderabad: హైదరాబాద్ నగరం మరోసారి భారీ వర్షంలో తడిసి ముద్దయింది. భారీ వర్షం ధాాటికి నగరంలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో నగరం నలుమూలలా ట్రాఫిక్ జామ్ అయిన దృశ్యాలు కనిపించాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు వచ్చిచేరింది.
Heavy Rain in Hyderabad: హైదరాబాద్లో మరో గంటలో వడగళ్ల వానతో కూడిన భారీ వర్షం కురిసే ప్రమాదం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించినట్టుగానే నగరంలో భారీ వర్షం కురుస్తోంది.
Heavy Rains in Hyderabad: హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలపై వరుణుడు కరుణించాడు. ఇవాళ తెల్లవారుజామున నుంచి వివిధ ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి.
హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉదయం నుంచి ఎండలు దంచి కొట్టగా.. మధ్యాహ్నానికి మేఘాలు కమ్ముకున్నాయి. భారీ వర్ష సూచన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Rains in Telangana: వాయువ్య భారత ప్రాంతాల నుంచి తక్కువ ఎత్తులో వీస్తున్న గాలుల ప్రభావంతో తెలంగాణలో రెండు రోజుల పాటు వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.