Aasara Pensions: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీ బాటలో పయనిస్తున్నారు. తెలంగాణ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించిన కేసీఆర్ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురించి ప్రస్తావించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Kishan Reddy warns Telangana CM KCR: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు వస్తుంటే.. ఈ కార్యక్రమాలకు హాజరయ్యేందుకు తీరికలేని దరిద్రపు ముఖ్యమంత్రి తెలంగాణకు అవసరమా? అని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి ప్రశ్నించారు.
Palamuru Project Narlapur Pump House Inauguration: పాలమూరు ఎత్తిపోతల పథకం ఉమ్మడి పాలమూరు జిల్లా దశ, దిశను మార్చే ప్రాజెక్టు కానుందని.. దశలవారీగా పాలమూరు ఎత్తిపోతల పథకం పంపులను ప్రారంభిస్తూ పాలమూరు ప్రాజెక్టును పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తాం అని తెలంగాణ సర్కారు ప్రకటించింది.
Govt hikes honorarium for priests in Telangana : తెలంగాణలో దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చే ఆలయాల్లో అర్చకులుగా పనిచేస్తోన్న పురోహితులకు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గుడ్ న్యూస్ చెప్పారు.
MLA Chennamaneni Ramesh Babu: వేములవాడ ఎమ్మెల్యే డా చెన్నమనేని రమేష్ బాబుని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ రంగ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
TSRTC Merger: తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ విషయంలో ఏపీ ప్రభుత్వాన్ని అనుసరిస్తోంది. టీఎస్సార్టీసీను ప్రభుత్వంలో విలీనం చేసేందుకు నిర్ణయించింది. కేబినెట్లో ఇంకా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
Holidays For Schools and Colleges In Telangana : హైదరాబాద్ : రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ, అతి భారీ వర్షాల నేపథ్యంలో రేపు బుధవారం, ఎల్లుండి గురువారం రెండు రోజుల పాటు తెలంగాణలోని స్కూల్స్, కాలేజీలు సహా అన్నిరకాల విద్యాసంస్థలకు సెలవులు ప్రకటిస్తూ తెలంగాణ సర్కారు ఉత్తర్వులు జారీచేసింది.
Heavy Rains in Telangana: తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం కూడా భారీ వర్షాలు ఉన్నాయనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఈ సమీక్ష చేపట్టారు.
Food Processing Units In Telangana: తెలంగాణ రైతు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, వ్యవసాయ విధానాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని సీఎం తెలిపారు. అందులో భాగంగానే ప్రస్థుతం ఉన్న రైస్ మిల్లులు యధా విధిగా కొనసాగుతూనే, అధునాతన మిల్లులు, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను స్థాపించే దిశగా కార్యాచరణ చేపడుతామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలిపారు.
CM KCR meeting with leaders from Solapur in Maharashtra: హైదరాబాద్ : మహారాష్ట్రతో తెలంగాణది ‘రోటీ బేటీ’ బంధమని, వెయ్యి కిలోమీటర్ల మేర సరిహద్దును పంచుకుంటున్న రెండు రాష్ట్రాల ప్రజల నడుమ మొదటి నుంచీ సామాజిక బాంధవ్యం, సాంస్కృతిక సారూప్యత వున్నదని, ఈ నేపథ్యంలో మహారాష్ట్ర అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని బిఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు.
PMO Invites CM KCR: బీజేపి, బీఆర్ఎస్ నేతలు ఒకరినొకరు దుమ్మెత్తిపోసుకోవడం నిత్యకృత్యమైన సంగతి తెలిసిందే. ఇరు పార్టీల నేతలు ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటూ కీలక నేతలు కూడా పెద్ద ఎత్తున వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం బీఆర్ఎస్ కంటే బీజేపీని ఎన్నుకోవాలని నరేంద్ర మోదీ ప్రజలను ఎలా కోరారో ఇటీవల చూశాం.
Podu Bhoomulu Patta Distribution to Tribals by KCR: గిరిజనుల చిరకాల కోరిక నెరవేరనుంది. పోడు భూముల పట్టాల పంపిణీకి ముహూర్తం ఫిక్స్ అయింది. జూన్ 30న ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం నుంచి సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభంకానుంది.
Revanth Reddy Questions KCR and KTR: తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముచ్చటగా మూడోసారి ప్రజల్ని నట్టేట ముంచడానికి రెడీ అయ్యారు అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మళ్లీ బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి వారిని గెలిపించి, మీరు మోసపోవద్దు అని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
Telangana CM KCR for Farmers :వరి ధాన్యాన్ని బియ్యం, నూనె వంటి పలు రకాల ఉత్పత్తులుగా మార్చే ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను జిల్లాల వారీగా ఏర్పాటు చేస్తామని, వరి ధాన్యం ఉత్పత్తిలో దేశంలో నెంబర్ వన్ స్థానానికి చేరుకున్న తెలంగాణ రైతాంగాన్ని తమ ఉత్పత్తులను విశ్వ విఫణిలో విక్రయించి మరిన్ని లాభాలు ఆర్జించే స్థాయికి చేరుస్తామని, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రకటించారు.
Telangana bjp chief bandi sanjay: తెలంగాణ రాష్ట్రముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చెక్ బౌన్సర్ సీఎం అని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఎద్దేవా చేశారు. తెలంగాణలో రైతులు బతికే పరిస్థితి లేదని కేసిఆర్ పుణ్యమా అని రైతులు బ్యాంకులలో డిఫాల్టర్లుగా నమోదయ్యారని ఆవేదన వ్యక్తంచేశారు.
Minister Harish Rao: మహాభారతంలో కౌరవుల్లాగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నేతలు ఇక్కడ గౌరవెల్లి ప్రాజెక్టును ఆపాలని ఎంతో ప్రయత్నం చేశారు. కానీ చివరకు న్యాయం గెలిచి ధర్మం నిలబడ్డట్టు మేము రైతుల కోసం, ప్రజల కోసం చేపట్టిన గౌరవెల్లి ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేశాం.
Revanth Reddy About Rythu Bandhu Scheme: రాజకీయాలనే భవిష్యత్తుగా మార్చుకుని ప్రజా సేవ చేయాలనుకునే వారికి యూత్ కాంగ్రెస్ ఒక మంచి వేదిక అని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. నాయకుడుగా మారడానికి యూత్ కాంగ్రెస్ ఒక చక్కటి వేదిక అవుతుంది అని చెప్పడానికి తెలంగాణ ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రేనే మనకు ఒక ఉదాహరణ అని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
Bandi Sanjay Kumar Comments on KCR, BJP and Congress: ఈనెల 15న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణకు రానున్న నేపథ్యంలో అమిత్ షా తెలంగాణ పర్యటనను సక్సెస్ చేయాలి అని తెలంగాణ రాష్ట్ర బీజేపి అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు.
Mallu Bhattivikramarka's open letter to KCR: రాష్ట్ర వ్యాప్తంగా వందల మంది ప్రజలపై పోలీసులు పెడుతున్న వేధింపులపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు రాసిన బహిరంగ లేఖను మీడియాకు విడుదల చేశారు.
YS Sharmila Slams BJP, BRS: బీఆర్ఎస్ పార్టీ, బీజేపి మధ్య రహస్య స్నేహం ఉందన్న వైఎస్ షర్మిల.. ఈ రెండు పార్టీల తీరు లోకం ముందు నువ్వు కొట్టినట్లు చేస్తే.. నేను ఏడ్చినట్లు చేస్తా.. అన్న చందంగా ఉంది అని ఎద్దేవా చేశారు. అంతటితో ఊరుకోని వైఎస్ షర్మిల.. ఇంతకీ మీరు నడిపే రహస్య దోస్తానం ప్రీ పోల్ ఒప్పందమా ? లేక పోస్ట్ పోల్ ఒప్పందమా ? అని సూటిగానే ప్రశ్నించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.