Revanth Reddy Security Issue: అన్ని డిపార్ట్మెంట్లలో కొందరు అధికారులు ప్రభుత్వ తాబేదార్లుగా ఉంటారు. ప్రభుత్వానికి తొత్తులుగా పని చేసే అధికారుల పేర్లను తప్పకుండా రెడ్ బుక్లో రాస్తాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అలాంటి అధికారులపై చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వం కోసం కాంగ్రెస్ నాయకులపై తప్పుడు కేసులు పెట్టే వాళ్ళని వదిలిపెట్టం అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
Revanth Reddy Challenges KCR: హైదరాబాద్ చుట్టుపక్కల కేసీఆర్ కుటుంబం బినామి పేర్లతో 10 వేల ఎకరాలు కబ్జా చేశారు. లక్ష కోట్లు వెనకేసుకున్నారు అని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. త్యాగాలు చేసి తెచ్చుకున్న తెలంగాణను కేసీఆర్ కుటుంబం దోచుకుంది అని మండిపడ్డారు. ఈ సందర్భంగా కేసీఆర్కు రేవంత్ రెడ్డి ఓ సవాల్ విసిరారు.
Rahul Gandhi Promises Rs 4000 Old Age Pension: ఇటీవల భారత్ జోడో యాత్రలో భాగంగా తెలంగాణకు వచ్చిన తాను మరోసారి ఇప్పుడు ఇలా తెలంగాణకు రావడం ఎంతో సంతోషంగా ఉంది అని ఏఐసీసీ అగ్ర నేత రాహుల్ గాంధీ అన్నారు.
Revanth Reddy Khammam Meeting Speech highlights: డిసెంబర్ 9న రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. ఆదివారం ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పాటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు సందర్భంగా నిర్వహించిన జనగర్జన సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు.
Ponguleti Srinivas Reddy: ఖమ్మం జిల్లాలో రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా బలమైన నేతగా పేరున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదివారం ఖమ్మంలో జరిగిన జనగర్జన బహిరంగ సభా వేదికపై ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.
Revanth Reddy Questions KCR and KTR: తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముచ్చటగా మూడోసారి ప్రజల్ని నట్టేట ముంచడానికి రెడీ అయ్యారు అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మళ్లీ బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి వారిని గెలిపించి, మీరు మోసపోవద్దు అని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
Minister Harish Rao Comments on Revanth Reddy: రేవంత్ రెడ్డిది వక్ర బుద్ది... వంకర మాటలు ఎక్కువ మాట్లాడుతున్నాడు. ఆయనకి ఉద్యోగాలు ఎలా భర్తీ చేస్తారు అనే విషయం కూడా తెలియకుండానే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడని చెబుతూ.. రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
Revanth Reddy About ORR Scam: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు విషయంలో ప్రభుత్వం భారీ ఎత్తున అవినీతికి పాల్పడిందని ఆరోపించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లపై పలు సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్ ఫామ్ హౌజ్లో, కేటీఆర్ విదేశాల్లో స్థిరపడినా వందల కోట్లు వచ్చిపడేలా ఆదాయ వనరులు ప్లాన్ చేశారన్నారు.
Revanth Reddy Speech: వచ్చే ఎన్నికల్లో దళితుల ఓట్లు దండుకోవడం కోసమే దళితులపై ప్రేమ కురిపిస్తున్నట్టుగా కేసీఆర్ ఈ కొత్త డ్రామాలకు తెరతీశారు. అవినీతి ఆరోపణలతో ఆనాడు దళిత ఉప ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేసిన కేసీఆర్.. మరి ఈనాడు కుంభకోణాలకు పాల్పడినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కొడుకు కేటీఆర్ ని మంత్రి పదవి నుంచి ఎందుకు బర్తరఫ్ చేయరు అని రేవంత్ రెడ్డి నిలదీశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.