Budget 2025 Expectations: కేంద్ర బడ్జెట్ 225లో ట్యాక్స్ పేయర్లు ఆశిస్తున్న 10 మార్పులు ఇవే

Budget 2025 Expectations: దేశమంతా ఎదురుచూస్తున్న బడ్జెట్ 2025 మరో రెండ్రోజుల్లో ఉంది. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై చాలామంది చాలా ఆశలు పెట్టుకున్నారు. అదే విధంగా ట్యాక్స్ పేయర్ల నుంచి కూడా చాలా అంచనాలున్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 29, 2025, 09:59 AM IST
Budget 2025 Expectations: కేంద్ర బడ్జెట్ 225లో ట్యాక్స్ పేయర్లు ఆశిస్తున్న 10 మార్పులు ఇవే

Budget 2025 Expectations: కేంద్ర బడ్జెట్ 2025లో చేయాల్సిన మార్పులు, చేర్పులు, మినహాయింపుల విషయంలో ఇప్పటికే కేంద్ర ఆర్ధిక శాఖకు నిపుణుల నుంచి చాలా ప్రతిపాదనలు, సిఫార్సులు అందాయి. ముఖ్యంగా ఇన్‌కంటాక్స్‌కు సంబంధించి చాలా ఆశలున్నాయి. వ్యక్తిగత ఇన్‌కంటాక్స్ మినహాయింపులపై ట్యాక్స్ పేయర్లు 10 కీలకమైన మార్పులు కోరుకుంటున్నారు. అవేంటో తెలుసుకుందాం.

ఫిబ్రవరి 1 కేంద్ర బడ్జెట్‌‌లో అన్ని రంగాలు, అన్ని కేటగిరీ ప్రజల నుంచి అంచనాలు ఉన్నట్టే వ్యక్తిగత ఆదాయపు పన్ను, ఎలక్ట్రిక్ వాహనాలపై ట్యాక్స్, క్రిప్టో, హౌసింగ్ ప్రయోజనాలు, సేవింగ్ ఇన్సెంటివ్‌లలో మార్పులు చేయాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. ఇన్‌కంటాక్స్ పాలసీలో కీలక మార్పులు ఉండవచ్చని భావిస్తున్నారు. ట్యాక్స్‌పేయర్లకు ఉపశమనం కల్గించేలా నిపుణులు కొన్ని సిఫార్సులు చేశారు. మరి ఈ సిఫార్సుల్ని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏ మేరకు పరిగణలో తీసుకుంటారో చూడాలి. ఈసారి బడ్జెట్ నుంచి ట్యాక్స్‌పేయర్ల అంచనాలు ఇలా ఉన్నాయి.

ఇన్‌కంటాక్స్ స్లాబ్‌లో మార్పు కోరుకుంటున్నారు. మధ్యతరగతి ట్యాక్స్‌పేయర్లకు రిలీఫ్ అందించేందుకు వ్యక్తిగత ఇన్‌కంటాక్స్ విషయంలో 4 లక్షలకు పరిమితి పెంచాలని ఆశిస్తున్నారు. ఇక ఓవరాల్ ట్యాక్స్ స్లాబ్ పరిమితిని 10 లక్షలు చేయాలని కోరుతున్నారు. ఇక హోమ్ లోన్ ప్రయోజనాలను న్యూ ట్యాక్స్ రెజీమ్‌కు కూడా వర్తింపచేయాలని కోరుతున్నారు. సెక్షన్ 24 బి ప్రకారం ఇంటి రుణాలపై చెల్లించే వడ్డీ విషయంలో ప్రస్తుతం 2 లక్షలుగా ఉన్న పరిమితిని 3 లక్షలకు పెంచాలని ఆశిస్తున్నారు. 

ఇక నేషనల్ పెన్షన్ సిస్టమ్‌లో ట్యాక్స్ డిడక్షన్ లిమిట్‌ను 50 వేల రూపాయల నుంచి 1 లక్షకు పెంచాలనే ప్రతిపాదన ఉంది. అది అమలైతే ట్యాక్స్ పేయర్లకు చాలా ప్రయోజనం కలగనుంది. ఇక టైప్ 2 నగరాల్లో హెచ్ఆర్ఏ మినహాయింపును 50 శాతం చేయాలని ట్యాక్స్‌పేయర్లు భావిస్తున్నారు. సెక్షన్ 80 డి ప్రకారం హెల్త్ ఇన్సూరెన్స్‌‌లో వ్యక్తిగత ట్యాక్స్ పేయర్లకు ట్యాక్స్ డిడక్షన్ పరిమితిని 50 వేలకు, సీనియర్ సిటిజన్లకు 1 లక్ష రూపాయలు చేయాలనే ప్రతిపాదన ఉంది. 

ఇవి కాకుండా సెక్షన్ 80సి పరిమితి పెంపు, సీనియర్ల సిటిజన్లకు కనీస మినహాయింపు పెంచడం, పెట్టుబడి లాభాలపై ట్యాక్స్ మినహాయింపులు ఆశిస్తున్నారు. మరి ట్యాక్స్‌పేయర్ల నుంచి వ్యక్తమౌతున్న అంచనాలకు నిర్మలమ్మ పద్దు ఏ విధంగా సమాధానం ఇస్తుందో చూడాలి

Also read: Public Holidays: విద్యార్ధులు, ఉద్యోగులకు గుడ్‌న్యూస్, ఆ 3 రోజులు పబ్లిక్ హాలిడేస్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News