TSRTC Merger: టీఎస్సార్టీసీ ప్రభుత్వంలో విలీనం, తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయం

TSRTC Merger: తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ విషయంలో ఏపీ ప్రభుత్వాన్ని అనుసరిస్తోంది. టీఎస్సార్టీసీను ప్రభుత్వంలో విలీనం చేసేందుకు నిర్ణయించింది. కేబినెట్‌లో ఇంకా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 31, 2023, 09:13 PM IST
TSRTC Merger: టీఎస్సార్టీసీ ప్రభుత్వంలో విలీనం, తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయం

TSRTC Merger: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులకు కేబినెట్ గుడ్‌న్యూస్ అందించింది.  రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలనే నిర్ణయం తీసుకుంది. మరోవైపు వరద బాధితులకు తక్షణ సహాయంగా 500 కోట్లు విడుదల చేసింది. తెలంగాణ కేబినెట్ పూర్తి నిర్ణయాలు ఇలా ఉన్నాయి..

తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన దాదాపు 6 గంటలు సాగిన కేబినెట్ భేటీలో కీలకమైన అంశాలపై నిర్ణయాలు జరిగాయి. ఇక నుంచి తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులని కేబినెట్ నిర్ణయించింది. విలీన ప్రక్రియకు సంబంధించిన విధి విధానాలకు నిర్ణయించేందుకు ఓ కమిటీ ఏర్పాటు కానుంది. విలీన ప్రక్రియ ద్వారా ప్రభుత్వంలో 43, 373 మంది ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు కానున్నారు. ఉద్యోగులుగా గుర్తింపుపై మార్గదర్శకాల్ని రూపొందించేందుకు సబ్ కమిటీ ఏర్పాటు కానుంది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ మేరకు బిల్లు ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం.

తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో  విలీనం చేసే నిర్ణయంతోపాటు రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న పంటల నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని చేపట్టాల్సిన కార్యక్రమాలపై కేబినెట్ భేటీలో చర్చించారు. వర్షాల అనంతరం దెబ్బతిన్న రోడల్కు పూర్తిస్థాయిలో మరమ్మత్తులు చేపట్టనున్నారు. కేబినెట్ భేటీలో మొత్తం 50 అంశాలపై చర్చ జరిగింది. రోడ్ల పునరుద్ధరణకు సంబంధించిన తీసుకోవల్సిన చర్యల్ని చర్చించారు. 

రానున్న 3-4 ఏళ్లలో మెట్రో రైలును భారీగా విస్తరించాలని కేబినెట్ నిర్ణయించింది. రాయదుర్గం-విమానాశ్రయం వరకూ మెట్రో రైలు టెండర్ ప్రక్రియ అమల్లో ఉంది. ఇక జేబీఎస్ బస్డాండ్ నుంచి తూంకుంట వరకూ డబుల్ డెక్కర్ మెట్రో నిర్మాణం కానుంది. మరోవైపు ప్యాట్నీ టు కండ్రకోయ వరకు మెట్రో విస్తరించనుంది. పాతబస్తీ మెట్రోను సైతం సమగ్రంగా పూర్తి చేస్తామని తెలంగాణ కేబినెట్ తెలిపింది. మియాపూర్ నుంచి లక్డీకాపూల్, ఎల్బీనగర్ నుంచి పెద అంబర్‌పేట్, ఉప్పల్ నుంచి బీబీ నగర్ వరకూ మెట్రో విస్తరణ చేయనున్నారు. 

వరదలకు తెగిన రోడ్లు కల్వర్టుల మరమ్మత్తులకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వరదల కారణంగా మరణించిన 40 మందికి పరిహారం అందించాలని కేబినెట్ నిర్ణయించింది. వరదల సమయంలో విద్యుత్ ధర్మాన్ని అద్బుతంగా నిర్వర్తించిన ఇద్దరికి సన్మానం చేయాలని తెలంగాణ కేబినెట్‌లో నిర్ణయమైంది. 

Also read: Weather Updates Today: రాష్ట్రంలో రేపు భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News