ICMR Diet Chart: ఇటీవలి కాలంలో అధిక బరువు ప్రధాన సమస్యగా మారిపోయింది. బరువు నియంత్రించడం అనేది ఓ సవాలుగా మారిపోతోంది. వ్యాయామం, డైటింగ్ ఇలా వివిధ రకాలుగా ప్రయత్నించినా విఫలమౌతుంటారు. కొంతమందైతే వ్యాయామం చేయలేని పరిస్థితి ఉంటుంది.
Weight Loss Tips: ఆరోగ్యం అనేది ఎప్పుడూ ఆ మనిషి ఫిట్‌నెస్‌పై ఆధారపడి ఉంటుంది. హెల్తీ వెయిట్ ఉంటేనే ఆరోగ్యం బాగుంటుంది. బరువు నియంత్రణ ఉండాలి గానీ క్రమపద్ధతిలో ఉండాలి. అందుకే బరువు నియంత్రణ ఎలా ఉండాలనే అంశంపై ICMR కొన్ని కీలక సూచనలు చేసింది. ఆ వివరాలు మీ కోసం..
ICMR Guidelines On Reuse Oil: చాలా మంది వంట నూనెను పొదుపుగా వాడతారు, ఒకసారి వాడిన నూనెను వృథా చేయకుండా మళ్లీ వాడతారు. కానీ, వైద్య నిపుణులు ఇలా చేయడం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు.
Tea - Coffee Side Effects: ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (NIN) టీ , కాఫీ విషయంలో సరికొత్తగా 17 కొత్త మార్గదర్శకాలను జారీ చేశాయి. టీ, కాఫీ వినియోగం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నియంత్రించాలి అని వారు సలహా ఇస్తున్నారు.
Nipah Virus: దేశంలో ఇప్పుడు నిఫా వైరస్ కలకలం రేపుతోంది. కరోనా వైరస్ భయాందోళనలు తగ్గి అంతా ఊపిరిపీల్చుకుంటున్న తరుణంలో నిఫా వైరస్ కేరళ తీరాన్ని భయపెడుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Omicron Detection Kits: ప్రపంచాన్ని ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ భయం వెంటాడుతోంది. అటు ఇండియాలో రోజురోజుకూ ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్‌ను వెంటనే గుర్తించేందుకు వీలుగా కొత్తగా ఒమిక్రాన్ డిటెక్షన్ కిట్స్ అందుబాటులో వస్తున్నాయి.
Omicron cases in India: కర్ణాటకలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదవడం భారతీయులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. భారత్‌లో ఒమిక్రాన్ కేసులు బయటపడటం ఇదే తొలిసారి. అది కూడా ఆ రెండు కేసులూ కర్ణాటకలోనే గుర్తించడంతో భారత సర్కారుతో పాటు కర్ణాటక ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది.
Covid19 Vaccines: కరోనా వ్యాక్సినేషన్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. దేశంలో ఇప్పుడున్న వ్యాక్సిన్లకు తోడుగా మరో నాలుగు వ్యాక్సిన్లు సిద్ధంగా ఉన్నాయని తెలిపింది.
ICMR: దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. మరోవైపు డెల్టా వేరియంట్ భయపెడుతోంది. ఈ క్రమంలో వ్యాక్సినేషన్‌కు సంబంధించి ఐసీఎంఆర్ కీలక ప్రకటన చేసింది.
Delta Plus variant of Covid-19: కొత్త వేరియంట్స్ డెల్టా మరియు డెల్టా ప్లస్ కోవిడ్19 వేరియంట్ గురించి శాస్త్రీయ వివరాలు లేనప్పటికీ అది వేగంగా వ్యాప్తి చెందుతుందని, వ్యాక్సిన్ సామర్థ్యాన్ని తగ్గిస్తుందని నిర్ధారణకు రావడం మంచిది కాదన్నారు.
Vaccine for Children: చిన్నారులకు కరోనా వ్యాక్సిన్ విషయంలో ఇంకా అస్పష్టత నెలకొంది. చిన్నారులకు వ్యాక్సిన్ ఇవ్వడం మరింత ఆలస్యం కావచ్చని తెలుస్తోంది. ఈ విషయంలో మరింత డేటా అవసరమని భావించడమే దీనికి కారణం.
ICMR: కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టినా థర్డ్‌వేవ్ ముప్పు భయపెడుతోంది. అదే సమయంలో డెల్టా ప్లస్ వేరియంట్ ఆందోళన కల్గిస్తోంది. దేశంలో అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు ఈ వేరియంట్లపై ఎంతవరకూ పనిచేస్తాయనేది సందేహాస్పదంగా మారింది.
ICMR Recruitment 2021: జూన్ 25వ తేదీలోగా అభ్యర్థులు రీసెర్చ్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ కన్సల్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR Jobs 2021) పేర్కొంది. ప్రాజెక్ట్ రీసెర్చ్ అసిస్టెంట్-2 పోస్టులకు 40 ఏళ్లు, ప్రాజెక్ట్ రీసెర్చ్ అసోసియేట్-3 పోస్టులకు 40 ఏళ్లు, ప్రాజెక్ట్ కన్సల్టెంట్ (నాన్ మెడికల్ విభాగం) 70 ఏళ్లు గరిష్ట పరిమితిగా నిర్ణయించారు.
Remdesivir Injection: కరోనా చికిత్సలో కీలకంగా ఉపయోగిస్తూ..దేశవ్యాప్తంగా కొరత ఏర్పడి చర్చనీయాంశమైన డ్రగ్ రెమ్‌డెసివిర్. నిన్నటి వరకూ రెమ్‌డెసివిర్ పంపిణీ బాథ్యత కేంద్ర ప్రభుత్వానిదే. ఇప్పుడు మాత్రం బాథ్యతల్నించి తప్పుకుంది.
Krishnapatnam Medicine: దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన కృష్ణపట్నం ఆనందయ్య మందుకు ఇప్పుడు శాస్త్రీయత కల్పించే దిశగా ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. అన్నీ సానుకూలంగా జరిగితే ప్రభుత్వమే ఆనందయ్య మందు పంపిణీ చేపట్టే అవకాశాలు కన్పిస్తున్నాయి.
DIPCOVAN kit price, uses, testing process:న్యూఢిల్లీ: కరోనాపై పోరులో రక్షణ శాఖ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO) దూసుకుపోతోంది. ఇటవలే కరోనా రోగుల కోసం 2డీజీ డ్రగ్‌ను రిలీజ్ చేసిన డీఆర్డీఓ.. తాజాగా సులువుగా, పెద్దగా ఖర్చు లేకుండా కరోనా పరీక్షలు నిర్వహించేందుకు కరోనా యాంటీబాడీలను గుర్తించే టెస్ట్ కిట్‌ను రూపొందించిన సంగతి తెలిసిందే.
AP COVID-19, krishnapatnam ayurvedic medicine updates : అమరావతి: ఏపీలో కరోనా విజృంభిస్తూనే ఉంది. శుక్రవారం ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన కొవిడ్-19 హెల్త్ బులెటిన్ ప్రకారం అంతకు ముందు గడచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 92,231 కరోనా పరీక్షలు నిర్వహించగా 20,937 మందికి కరోనా సోకినట్టు తేలింది. మరోవైపు క్రిష్ణపట్నం కరోనా ఆయుర్వేదం మందు శాంపిల్స్‌ని ఏపీ సర్కారు ఐసీఎంఆర్ (ICMR)కి పంపించి పరిశోధన చేయిస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.