Omicron cases in India: కర్ణాటకలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదవడం భారతీయులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. భారత్‌లో ఒమిక్రాన్ కేసులు బయటపడటం ఇదే తొలిసారి. అది కూడా ఆ రెండు కేసులూ కర్ణాటకలోనే గుర్తించడంతో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. కర్ణాటకలో ఒమిక్రాన్ కేసులు బయటపడటంపై పౌరులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో భారత సర్కారు ఈ అంశంపై స్పందిస్తూ.. '' పౌరులు భయాందోళనకు గురికావాల్సిన అవసరం ఏమీ లేదు'' అని స్పష్టంచేసింది. అయితే, ఒమిక్రాన్ వేరియంట్ వ్యాపించకుండా సరైన అవగాహనతో నడుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఐసిఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ మీడియాకు (ICMR on Omicron cases in India) తెలిపారు.
Two cases of #Omircron detected in Karnataka so far through genome sequencing effort of INSACOG consortium of 37 laboratories established by the Ministry of Health. We need not panic, but awareness is absolutely essential. COVID apt behaviour is required: Balram Bhargava, DG ICMR pic.twitter.com/xHnQAbgvaN
— ANI (@ANI) December 2, 2021
Also read : Omicron meaning: ఒమిక్రాన్ అంటే అర్థం ఏంటి ? New variants కి ఆ పేర్లు ఎలా పెడతారు ?
ఒమిక్రాన్ కేసులుపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ మీడియాతో మాట్లాడుతూ.. ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వారిలో స్వల్ప లక్షణాలు (Omicron variant latest news updates) మాత్రమే ఉన్నట్టు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తించిన ఒమిక్రాన్ కేసులలో ఎక్కడా తీవ్రమైన వ్యాధి లక్షణాలు లేవని లవ్ అగర్వాల్ (Lav Aggarwal) స్పష్టంచేశారు. కేంద్రం చేసిన ఈ ప్రకటన కొంతలో కొంత మేరకు ఉపశమనం కలిగించేదే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
All #Omicron related cases are found to have mild symptoms so far...In all such cases in the country and across the world so far, no severe symptom has been noted. WHO has said that its emerging evidence is being studied: Lav Agarwal, Joint Secretary, Union Health Ministry pic.twitter.com/7cfCAwHRt0
— ANI (@ANI) December 2, 2021
Also read : Omicron variant symptoms: ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలేంటి, ఏ వయస్సువారికి ప్రమాదకరం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook