BRS MLA Padi Kaushi Reddy: తమ కార్యకర్తలను కొందరు పోలీసులు వేధిస్తున్నారని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల హుజురాబాద్ లో బీఆర్ఎస్ కార్యకర్తల మీటింగ్ లో కౌశిక్ రెడ్డి పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో రచ్చగా మారింది. దీనిపై పోలీసు శాఖ తీవ్రంగా స్పందించింది.
CM Revanth Reddy On BJP-TDP Alliance: లోక్సభ ఎన్నికల్లో 400 సీట్లు గెలుస్తామనే ధైర్యం ఉంటే.. మోదీ అన్ని రాష్ట్రాల్లో పొత్తులు ఎందుకు పెట్టుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మోదీని ఇంటికి పంపించేందుకు 140 కోట్ల మంది ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు.
KTR Letter to CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. ఎల్ఆర్ఎస్ను ఎలాంటి చార్జీలు లేకుండా అమలు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో ఇచ్చిన హామీలను దృష్టిలో ఉంచుకొని ఉచితంగా ఎల్ఆర్ఎస్ను అమలు చేయాలన్నారు. గతంలో ఇచ్చిన మాటను తప్పినందుకు లేదా ప్రజలకు అబద్ధాలు చెప్పినందుకు ప్రజలను క్షమాపణ కోరాలని లేఖలో పేర్కొన్నారు.
Brs Party Meeting:కాంగ్రెస్ పార్టీలోనే మానవ బాంబులున్నాయని మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ను సొంత పార్టీ నేతలే ముంచేస్తారని వ్యాఖ్యలు చేశారు. మీరు ఇచ్చిన హమీలు నెరవేర్చేవరకు వెంటాడతామని హెచ్చరించారు.
Government Groups Exams: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్స్ ఎగ్జామ్స్ ల తేదీలను ప్రకటించింది. ఎన్నో నెలలుగా ఉత్కంఠతో ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ ల షెడ్యూల్ లను ప్రకటించింది.
Congress Party: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొందరికే రైతు బంధు అమౌంట్ అకౌంట్ లో జమఅయ్యాయి. అయితే.. సీఎం రేవంత్ రెడ్డి రైతు బంధు డబ్బులు ఇవ్వడంపై ఇప్పటికే పలుమార్లు అధికారులతో చర్చించారు. అసలు రైతు బందు పెట్టు బడి సహాయం ఎవరికి ఇస్తే సరైన న్యాయం జరుగుందనే దానిపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
Telangana: రాష్ట్రంలో త్వరలోనే రైతు కమిషన్, విద్యా కమిషన్ ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. మన విద్యా విధానం ఎలా ఉండాలో ఎడ్యుకేషన్ కమిషన్ నిర్ణయిస్తుందని తెలిపారు.
KTR Challenges to CM Revanth Reddy: రేవంత్ రెడ్డికి దమ్ముంటే సీఎం పదవికి రాజీనామా చేయాలని కేటీఆర్ సవాల్ విసిరారు. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని.. ఇద్దరం మల్కజ్గిరి నుంచి పోటీ చేద్దామన్నారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమన్నారు.
Jana Jatara Sabha in Chevella: పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీటైనా గెలవాలని మాజీ మంత్రి కేటీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. తాము అల్లాటప్పగాళ్లం కాదన్నారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ను 14 స్థానాల్లో గెలిపించాలని కోరారు. చేవెళ్లలో జరిగిన జన జాతర సభలో ముఖ్యమంత్రి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Free Electricity and RS 500 Gas Cylinder: తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. ఈ నెల 27 లేదా 29వ తేదీల్లో గృహ జ్యోతి, రూ.500లకు గ్యాస్ సిలిండర్ పథకాలను ప్రారంభించనుంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
Kodangal: కొడంగల్ ప్రజలు గుండెల్లో హత్తుకుని ఆదరించడంతోనే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇక్కడ నిలబడగలిగానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆనాడు పార్లమెంటులో నోరులేకపోయినా.. పాలమూరులో ఊరు లేకపోయినా కేసీఆర్ ను గెలిపించారని అన్నారు.
Hyderabad: తెలంగాణలో గ్రూప్ 1 ఉద్యోగాలకు తాజాగా, టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. గతేడాది గంటల నోటిఫికేషన్ రద్దు చేసిన గంటల వ్యవధిలోనే కొత్తగా మరో నోటిఫికేష్ ను విడుదల చేసింది.
BudhaVenkanna: ఆంధ్ర ప్రదేశ్ టీడీపీ నేత బుద్ధా వెంకన్న తెలంగాణ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల తెలంగాణలో బీఆర్ఎస్ నేత, బొంతు రామ్మోహన్ కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే.
Hyderabad: నీటి ప్రాజెక్టుల విషయంలో మాజీ మంత్రి హరీష్ రావు అబద్ధాలు ఆడుతుంటే ఒక్కమాటకూడా మాట్లాడట్లేదని మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు.
Congress Party:సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలోకి జోరుగా వలసలు సాగుతున్నాయి. ఇప్పటికే అనేక మంది బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు. ఇక తాజాగా, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యామిలీకి చెందిన కీలక వ్యక్తి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు సమాచారం.
Hyderabad: కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ నేతలు.. ఉరితాళ్లు కట్టుకుని వేలాడినా ప్రజలు పట్టించుకోరని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈరోజు హైదరాబాద్ ఉప్పల్ లోని ఎల్బీ స్టేడియంలో గురుకుల ఉపాధ్యాయ నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.