KTR Challenges to CM Revanth Reddy: లోక్‌సభ ఎన్నికలకు ముందు తెలంగాణ రాజకీయాలు మళ్లీ వేడుక్కుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్లో నడుస్తోంది. కేటీఆర్ మగడైతే పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటైనా గెలవాలని కేటీఆర్‌కు రేవంత్ రెడ్డి ఇటీవల సవాల్ విసరగా.. కేటీఆర్ స్పందించి ప్రతి సవాల్ విసిరారు. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేస్తానని.. రేవంత్ సీఎం పదవికి రాజీనామా చేసి తనపై పోటీ చేయాలని ఛాలెంజ్ చేశారు. ఇద్దరం మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానంలో తేల్చుకుందామన్నారు. గెలిచిన ప్రతిసారి మగవాడిని.. ఓడితే కాదంటావా.. అని ఫైర్ అయ్యారు. కొడంగల్‌లో ఓడిపోయినప్పుడు మగడివి కాదా.. అని నిలదీశారు.
మగాడివి అయితే రైతులకు 2 లక్షల రుణ మాఫీ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఆడబిడ్డలకు 2500 ఇవ్వాలని.. ఇచ్చిన 420 హమీలు అమలు చేయాలన్నారు. ఆడవాళ్లు రాజకీయాల్లో గెలవవద్దా అని అడిగారు. రేవంత్ రెడ్డికి ఇన్ పిరియారిటీ కాంప్లెక్స్ ఉందని.. కొండగల్, జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో పోటీ చేసి.. సవాల్ విసరి పారిపోయిండని ఎద్దేవా చేశారు. ఆయన మాటకు విలువ ఏం ఉందన్నారు.
"రేవంత్‌కు దమ్ముంటే సీఎం పదవికి రాజీనామా చేయండి.. మల్కాజ్ గిరిలో పోటీ చేద్దాం.. అదే ఆయన సిట్టింగ్ సీటే కదా.. దమ్ముంటే పోటీకి రావాలి.. నేను సిరిసిల్లాలో ఎమ్మెల్యే పదవి రాజీనామా చేస్తా.. దమ్ముంటే రేవంత్ సీఏం పదవికి రాజీనామా పోటీకి రావాలి. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. మరి నాది మేనేజ్మెంట్ కోటా అయితే.. రాహుల్, ప్రియంకాలది ఏం కోటా..? రేవంత్‌ది పేమేంట్ కోటా.. మణిక్యం ఠాకూర్‌కి డబ్బులిచ్చి పదవులు తెచ్చుకున్న పేమేంట్ కోటా." అని కేటీఆర్ ఘాటు విమర్శలు చేశారు.
పేమెంట్ కోటాలో సీటు తెచ్చుకున్నందుకే రేవంత్.. ఢిల్లీకి పేమేంట్ చేయాలని ఆయన అన్నారు. బిల్డర్లను, వ్యాపారులను బెదిరించాలి.. ఢిల్లీకి కప్పం కట్టాలి, బ్యాగులు మోయాలన్నారు. అందుకే భవన నిర్మాణ అనుమతులు ఆపేశారన్నారు. ఎన్ని అనుమతులు ఇచ్చారో చెప్పాలని అడిగారు. త్వరలో బిల్డర్లు, వ్యాపారులు రేవంత్ సెస్‌పైన రోడ్డు ఎక్కుతారని అన్నారు. ఆయన నేనే సీఎం అని అన్ని సార్లు చెప్పుకుంటున్నారు.. ఆయనకు అయననే సీఎం అన్న నమ్మకం లేదా..? అని ప్రశ్నించారు.
"సాగునీటి ప్రాజెక్టుల్లో మేడిగడ్డ ప్రమాదం మెదటిది కాదు.. గతంలో అనేక ప్రాజెక్టులకు రిపేర్లు వచ్చాయి.. కానీ వాటి అప్పటి ప్రభుత్వాలు మరమ్మతులు చేసి కాపాడాయి.. కానీ ప్రాజెక్టులను వదిలిపేట్టలేదు. ఇలాంటివి జరిగినప్పుడు ప్రభుత్వాలు వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి. రిపేర్లపైన, ఇంజనీరింగ్ పరిష్కారాల దిశగా కార్యచరణ ఉండాలి. ఇప్పటికైనా ఎన్డీ డీఎస్ఏ కనీసం ఒక్క శాంసాంపిల్ తీసుకున్నదా..? మరి రిపోర్టు ఎప్పుడో వస్తుందో ఉత్తమ్ చెప్పాలి. అప్పటి మా ప్రభుత్వం సమాచారం, నివేదికలు ఇవ్వకుంటే మరి సమగ్రమైన రిపోర్టు ఎన్డీఎస్ఎ ఎలా ఇచ్చిందో చెప్పాలి. బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర సంస్ధలపై కాంగ్రెస్ మంత్రి ఉత్తమ్‌కు అంతా నమ్మకం ఎందుకు..? కేవలం తమకు అనుకూలంగా ఉన్నందుకేనా..? ఉత్తమ్ గారు ఉన్న సమస్య ఎంటో తెలుసుకుని పరిష్కారానికి ప్రయత్నం చేయాలి. ఆయన బ్యారేజీకి, రిజర్వాయర్‌కు తేడా తేలియదు. తెలుకోవాలి. మా సలహలు వద్దంటే నిపుణుల కమిటీ వేయండి.. నాలుగు నెలల్లో కాఫర్ డ్యామ్ కట్టి మరమ్మతులు చేయండి.." అని కేటీఆర్ హితవు పలికారు.
Also Read: PPF Investment: రోజుకు 400 రూపాయలు పెట్టుబడితో 1 కోటి రూపాయలు తీసుకోవచ్చు
Also Read: Zee News-Matrize Survey: ఏపీలో ఈసారి అధికారం ఆ పార్టీదే, సంచలన సర్వే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter