Snake found in toddy bottle video: సాధారణంగా చాలా మందికి లిక్కర్ లేదా కల్లు తాగే అలవాటు ఉంటుంది. ముఖ్యంగా కూలీ పనులకు వెళ్లేవారు ప్రతిరోజు కూడా కల్లుతుంటారు. కొంత మంది యువత ఉదయాన్నే మంచి కల్లు తాగేందుకు ఈత చెట్ల దగ్గరకు వెళ్తుంటారు. కల్లు తాగితే... ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. అయితే.. ఇటీవల చాలా చోట్ల కల్లీ కల్లు ఘటనలు వార్తలలో ఉంటున్నాయి. కల్తీ కల్లు తాగడం వల్ల చాలా మంది మరణిస్తున్నారు.
అంతే కాకుండా.. వైన్ బాటిళ్లలో గతంలో పురుగుల ఆనవాళ్లు దొరికిన ఘటనలు వార్తలలో నిలిచాయి. ఇక హోటల్స్, రెస్టారెంట్ లలోని ఫుడ్ లలో.. బొద్దింకలు, పురుగులు, బ్లేడ్ లు, ఎలుకలు వచ్చిన ఆనావాళ్లకు చెందిన అనేక వీడియో లు ఇటీవల వార్తలలో నిలిచాయి. తాజాగా.. నాగర్ కర్నూల్ లోని బిజినే పల్లి మండలం లట్టు పల్లిలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
కల్లు సీసాలో కట్ల పాము కలకలం
కల్లు దుకాణాన్ని ధ్వంసం చేసిన స్థానికులు
నాగర్ కర్నూల్ - బిజినేపల్లి మండలం లట్టుపల్లిలో.. ఓ వ్యక్తి కల్లు తాగుతుండగా సీసాలో కనిపించిన కట్ల పాము పిల్ల
వెంటనే సీసాను పడేయడంతో తప్పిన ప్రాణాపాయం
ఈ ఘటనతో ఆగ్రహం చెంది కల్లు దుకాణాన్ని ధ్వంసం చేసిన… pic.twitter.com/JTzIZBd4RZ
— Telugu Scribe (@TeluguScribe) January 17, 2025
ఒక వ్యక్తి కల్లు తాగేందుకు కల్లు దుకాణంకు వెళ్లాడు. అక్కడ సీసాను తీసుకుని పక్కకు వెళ్లారు. అయితే.. సీసాలో ఏదో వెరైటీగా పాము అవశేషం కన్పించడంతో.. వెంటనే సీసాలోకి కల్లును కింద పడేశారు. ఆ తర్వాత అందులో చనిపోయిన కట్ల పాము పిల్ల ఉన్నట్లు గుర్తించాడు.
ఈ నేపథ్యంలో ఆ కల్లు దుకాణం యజమానికి దీనిపై ప్రశ్నించగా.. నెగ్లీజెన్సీగా సమాధానం చెప్పాడు. దీంతో కోపంలో అక్కడికి గ్రామస్థులు, చుట్టుపక్కల వారు చేరుకుని... కల్లు దుకాణంలోని సరుకును ధ్వంసం చేశారు.
Read more: Viral Video: ఒంటి నిండా భారీ విషసర్పాలు.. కుంభమేళలో హల్ చల్ చేస్తున్న అఘోరీ.. వీడియో వైరల్..
ఈ ఘటనతో ప్రస్తుతం దుమారంగా మారింది. ఈ క్రమంలో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. అయితే.. కల్లు దుకాణంలో కట్ల పాము వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter