Telangana Pradesh Mahila Congress: తెలంగాణలో రేవంత్ రెడ్డిపై ప్రజలతోపాటు సొంత పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేకత వస్తోంది. అపరిపక్వ నిర్ణయాలు.. పాలనలో తప్పిదాలు.. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో తెలంగాణలోని ప్రతి వర్గం రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తుండగా.. తాజాగా సొంత పార్టీ నాయకుల నుంచే ఆగ్రహం వ్యక్తం కావడం సంచలనం రేపుతోంది. పార్టీ కార్యాలయం వేదికగా ఆ పార్టీ మహిళా నాయకులు తిరుగుబాటు ఎగురవేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డితోపాటు పీసీసీ అధ్యక్షుడికి వార్నింగ్ ఇచ్చారు. ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతోంది.
Also Read: Himanshu Rao KCR: మనవడికి వ్యవసాయం నేర్పుతున్న మాజీ సీఎం కేసీఆర్ తాతయ్య
అధికారంలోకి ఏడాది దాటిపోయినా కూడా కాంగ్రెస్ పార్టీ ఇంకా పదవుల భర్తీ చేపట్టలేదు. ఒక్క రెడ్డి వర్గానికి మినహాయించి మిగతా ముదిరాజ్, పద్మశాలి, మాలతోపాటు ఇతర వర్గాలకు పదవులు ఇవ్వలేదు. అతి ముఖ్యంగా మహిళలకు పదవులు దక్కలేదు. కొందరికే ఇవ్వగా.. మహిళా కాంగ్రెస్ నాయకులకు మాత్రం పదువులు లభించకపోవడంతో మహిళా వింగ్‌లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. మహిళా నాయకులు గాంధీ భవన్ వేదికగా కన్నీళ్లు పెట్టుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. తాజా మహిళా విభాగం అధ్యక్షురాలు సునీత రావు తిరుగుబాటు చేశారు. రేవంత్ రెడ్డితోపాటు పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌కు ఆల్టిమేటం జారీ చేశారు.
Also Read: Harish Rao: రేవంత్ రెడ్డి రాజకీయ కుట్రతో 'సంక్రాంతి' కూడా చేసుకోనివ్వరా?
హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయం గాంధీ భవన్ వేదికగా గురువారం సునీతా రావు విలేకరులతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'నామినేటెడ్ పదవులలో.. పీసీసీ కార్యవర్గంలో మహిళలకు పెద్దపీట వేస్తామని రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ మాట ఇచ్చారు. కానీ ఇప్పటివరకు ఇవ్వలేదు' అని సునీతా రావు అసహనం వ్యక్తం చేశారు. 'నామినేటెడ్ పదవుల్లో మహిళలకు సముచిత స్థానం ఇవ్వాలని కోరుతున్నామని విజ్ఞప్తి చేశారు. 'ఇస్తారనే నమ్మకం ఉంది. నమ్మకం లేకపోవతే గాంధీభవన్ మెట్ల మీద కూర్చొని కొట్లడతాం' అని హెచ్చరించారు.
'మహిళలకి పెద్దపీట వేయటే పీసీసీ కూడా అడుగుతాము' అని సునీతా రావు సంచలన ప్రకటన చేశారు. ఏకంగా టీపీసీసీ అధ్యక్ష పదవి మహిళలకు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. 'ఎమ్మెల్సీగా ఉండి పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ఎంపికయ్యారు. కనీసం మా మహిళలకి ఒక్క పదవి ఇవ్వమని అడిగాం. లేకుంటే మంత్రులను కూడా నిలదీస్తాం' అని హెచ్చరించారు. ఇప్పుడు తమకు ఇచ్చిన పదవులు అన్ని సభ్యత్వం ఆధారంగా వచ్చినవేనని.. అధికారంలోకి వచ్చాక ఎలాంటివి రాలేదని వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా కొన్నాళ్లు ఓపిక పడతామని.. స్పందన రాకుంటే కొట్లాడుడే అని సునీతా రావు ప్రకటించడం కలకలం రేపింది. మహిళ నాయకుల ప్రకటనతో కాంగ్రెస్ పార్టీలో గందరగోళం నెలకొంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.