Swarna Andhra Swachha Andhra: ఆంధ్రప్రదేశ్‌లోనే ప్రత్యేక ప్రాంతం రాయలసీమ. ఆ సీమలో కడప జిల్లా అత్యంత ముఖ్యమైనది. కడప జిల్లా అంటేనే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుర్తుకు వస్తారు. మాజీ సీఎం వైఎస్ జగన్ అడ్డాగా పేరుపొందిన కడప జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన చేయనుండడం చర్చనీయాంశంగా మారింది. మరోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఉమ్మడి కడప జిల్లా పర్యటనకు వస్తుండడంతో సీమ రాజకీయాలు రంజుగా మారనున్నాయి.
Also Read: Vizag Steel Plant: ఆంధ్రప్రదేశ్‌కు భారీ కానుక.. విశాఖ స్టీల్‌కు రూ.11,440 కోట్ల ఆర్థిక ప్యాకేజీ
అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనపై పూర్తి దృష్టిని కేంద్రీకరించారు. వివిధ శాఖలపై సమీక్ష చేస్తూనే అన్ని రంగాల పనులు చకచకా అయ్యేలా చేస్తున్నారు. ఈ క్రమంలోనే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కోసం ప్రతిష్టాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. 'స్వర్ణాంధ్ర.. స్వచ్ఛ ఆంధ్ర' అనే పేరిట స్వచ్ఛ కార్యక్రమాలు చేపట్టనుంది. ఈ కార్యక్రమాన్ని ఈనెల 18వ తేదీ నుంచి ప్రారంభించనుంది.
Also Read: YS Sharmila: 'సూపర్ సిక్స్ ఇవ్వలేక.. ఆడలేక మద్దెల దరువన్నట్టు చంద్రబాబు తీరు'
'స్వర్ణాంధ్ర.. స్వచ్ఛ ఆంధ్ర' కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు కడప జిల్లాను ఎంచుకోవడం ఆసక్తికరంగా మారింది. మైదుకూరులో 'స్వర్ణాంధ్ర.. స్వచ్ఛ ఆంధ్ర' కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. సీఎం పర్యటన సందర్భంగా మైదుకూరులో ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ఆధ్వర్యంలో జిల్లాలోని రెవెన్యూ, మునిసిపల్, వివిధ శాఖల అధికారులు సీఎం పర్యటన ఏర్పాట్లు చేస్తున్నారు. సభావేధిక ఏర్పాట్లతోపాటు కార్యక్రమ వివరాల ప్రకారం ఏర్పాట్లలో ఆయా శాఖల అధికారులు చర్యలు చేపడుతున్నారు.
రాజోలు ఆనకట్ట పూర్తిచేస్తాం
సీఎం పర్యటన ఏర్పాట్లను మైదుకూరు టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ పర్యవేక్షించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. 'మైదుకూరు సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తాం. సీఎం సహకారంతో మైదుకూరు మున్సిపాలిటీ రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాం' అని తెలిపార. మైదుకూరు నియోజకవర్గంలోని రైతుల చిరకాల కోరిక రాజోలు ఆనకట్ట ప్రాముఖ్యాన్ని చంద్రబాబుకు వివరిస్తా. మైదుకూరు రైతుల పాలిట కల్పతరువు అయిన రాజోలు ఆనకట్ట నిర్మాణానికి కృషి చేస్తాం' అని ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ తెలిపారు.
వైసీపీ ఆనవాళ్లు లేకుండా..
గత ఎన్నికల్లో రాయలసీమతోపాటు కడప జిల్లాలో పూర్తిగా రాజకీయాలు మారిపోయాయి. కడప జిల్లాలో మరింత బలపడేందుకు తెలుగుదేశం పార్టీ దృష్టి సారించింది. రానున్న స్థానిక ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఈ పర్యటనను వినియోగించుకోవాలని ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. ఇప్పటికే చెల్లాచెదురైనా వైఎస్సార్సీపీని భవిష్యత్‌లో లేవకుండా ఉండేలా ఈ పర్యటనను వినియోగించుకునేందుకు టీడీపీ ప్రణాళికలు వేస్తోంది. ఈ క్రమంలోనే చంద్రబాబు మైదుకూరు పర్యటన ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.