దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై బీజేపీ ధీమాగా ఉంది. తమ పార్టీదే విజయమని, బీజేపీ 55 స్థానాల్లో విజయం సాధించినా ఆశ్చర్యం అక్కర్లేదని మనోజ్ తివారీ వ్యాఖ్యానించారు.
శనివారం సాయంత్రం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఓటింగ్ ముగిసిన కొన్ని గంటల తరువాత, అన్ని ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను కౌంటింగ్ కేంద్రాలకు తీసుకెళ్లారు. ఢిల్లీ పోలీసులతో పాటు సాయుధ పారా మిలటరీ కమాండోల సమక్షంలో తరలించి భద్రపర్చారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కు ప్రయోజనం చేకూర్చవని పాటియాలా ఎంపీ ప్రినీత్ కౌర్ అన్నారు. ఢిల్లీలో మరోసారి ఆప్ అధికారంలోకి వస్తుందని చెప్పారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ముందుగా ఊహించినట్లుగానే, ఎగ్జిట్ పోల్స్ చాలావరకు ఆమ్ ఆద్మీ పార్టీయే మంచి ఫలితాలను సాధిస్తుందని, ఢిల్లీ ఎన్నికల విజయం బీహార్ పై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందని ఆప్ నేతలు అభిప్రాయపడుతున్నారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో అన్ని ప్రధాన ఎగ్జిట్ పోల్స్ సంస్థలు ప్రస్తుత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సౌకర్యవంతమైన మెజారిటీ సాధిస్తారని అంచనా వేశాయి. గత ఐదేళ్ళలో ఆప్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సాధించిన విజయాలపై సాగించిన ఎన్నికల ప్రచారానికి అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వం వహించారు.
70 నియోజక వర్గాలకు ఎన్నికలు జరుగుతున్న ఢిల్లీలోని, గ్రేటర్ కైలాష్ అసెంబ్లీ నియోజకవర్గంలో 110 సంవత్సరాల అతి పెద్ద వయస్కురాలైన ఓటరు కలితరా మండల్ శనివారం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ శనివారం ట్వీట్ చేశారు. మహిళలు అధిక సంఖ్యలో వచ్చి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయాలని కోరారు. స్మృతి ఇరానీ తన ట్విట్టర్ లో పేర్కొంటూ.. ఢిల్లీ మహిళలు ఎంతో చైతన్య వంతులని, ఎవరికి ఓటు వేయాలో తమను తాము నిర్ణయించుకునేంత సామర్థ్యం ఉన్న మహిళలలని ఆమె అన్నారు.
మహిళలు ఇంటి బాధ్యత ఎంత బాగా నిర్వహిస్తారో, నేడు ఎన్నికల బాధ్యతను కూడా అదే తీరుగా స్వీకరించాలంటూ ఢిల్లీ ఓటర్లకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు.
ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ ప్రారంభమైంది. ఢిల్లీ ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. ఓటర్లు ఎవరికి పట్టం కట్టనున్నారనేది ఆసక్తికరంగా మారింది.
నేడు ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. షాహీన్‌బాగ్ పరిధిలోని 5 పోలింగ్ కేంద్రాలను సున్నితమైన పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు.
లంచం తీసుకున్నందుకు సీబీఐ తన కార్యాలయంలో ఒక అధికారిని అరెస్టు చేయడంపై ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఈ ఉదయం వరుస ట్వీట్లు చేశారు. శనివారం ఢిల్లీ ఎన్నికలున్న తరుణంలో అర్ధరాత్రి అధికారి అరెస్టు మనీష్ సిసోడియా స్పందిస్తూ అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
మరికొన్ని గంటల్లో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండగా డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు తలనొప్పి తప్పడం లేదు. ఆయన వద్ద ఓఎస్డీగా పనిచేసే అధికారి లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు.
ఢిల్లీ ఎన్నికల్లో మాటల తూటాలు పేలుతున్నాయి. ఢిల్లీ ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ జోరుగా ప్రచారం చేస్తుండగా. . ఢిల్లీ పీఠాన్ని దక్కించుకోవాలని బీజేపీ గట్టిగా పోరాడుతోంది.
అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మంగళవారం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు తన మ్యానిఫెస్టోను పోలింగ్ కు నాలుగు రోజులే ఉండగా, ఢిల్లీ వాసులకు మరోసారి తాయిలాలు ప్రకటించింది. మేనిఫెస్టోలో నాణ్యమైన విద్య, ఆరోగ్యం, స్వచ్ఛమైన నీరు, 24 గంటల విద్యుత్తును అందజేస్తామని ఢిల్లీ ప్రజలకు హామీ ఇచ్చింది.
ఢిల్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అధికార పార్టీ ఆమ్ ఆద్మీకి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఢిల్లీ ఎన్నికల్లో మోడల్ టౌన్ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్న కపిల్ మిశ్రా.. ఆమ్ ఆద్మీ పార్టీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు.
Delhi Assembly Polls | ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఓ హామీ అరవింద్ కేజ్రీవాల్‌ను చిక్కుల్లో నెట్టింది. బీజేపీ ఫిర్యాదుతో స్పందించిన ఈసీ సీఎం కేజ్రీవాల్‌కు నోటీసులు జారీ చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.