న్యూ ఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ముందుగా ఊహించినట్లుగానే, ఎగ్జిట్ పోల్స్ చాలావరకు ఆమ్ ఆద్మీ పార్టీయే మంచి ఫలితాలను సాధిస్తుందని, ఢిల్లీ ఎన్నికల విజయం బీహార్ పై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందని ఆప్ నేతలు అభిప్రాయపడుతున్నారు. రానున్న ఎనిమిది నెలల్లో బీహార్‌లో జరగబోయే ఎన్నికలపై ఆప్ పార్టీ దృష్టి సారించనుందని తెలిపారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కిషన్‌గంజ్, భాగల్పూర్, సీతామార్హి మూడు స్థానాల్లో పోటీ చేసినప్పటికీ పెద్గగా ప్రభావం చూపలేకపోయింది.
బీహార్‌లో, 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పోటీచేయలేదు. బీజేపీ వ్యతిరేక కూటమికి మద్దతు ఇచ్చింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఆప్ బీహార్‌లోని 40 స్థానాల్లో 39 స్థానాల్లో పోటీ చేసినప్పటికీ పెద్దగా ప్రభావం చూపలేదు.
ఇటీవల ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని తిరిగి వచ్చిన ఆప్ బీహార్ చీఫ్ షత్రుఘన్ సాహు, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీహార్‌లోని అన్ని స్థానాలకు స్వయంగా పోటీ చేయాలని పార్టీ నిర్ణయించిందని అన్నారు. జన సంవాద్ యాత్ర, పీపుల్స్ డైలాగ్ మార్చి ద్వారా పార్టీ ఇప్పటికే గ్రామ స్థాయిలో సంస్థాగతంగా బలోపేతం చేసే పని ప్రారంభించిందని సాహు పేర్కొన్నారు.
బీహార్ లో నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం పట్ల ప్రజలు సంతోషంగా లేనందున మార్పు కోరుకుంటున్నారని, కాగా ప్రస్తుతమున్న ఆర్జేడీ నేత తేజశ్వి ప్రసాద్ యాదవ్‌ను ప్రత్యామ్నాయంగా భావించడం లేదని అన్నారు. గత ఆర్జేడీ పాలనపై ఇప్పటికీ ప్రజల మనస్సులలో సజీవంగా ఉందని అన్నారు. బీహార్ లో ఆమ్ ఆద్మీ పార్టీయే ప్రత్యామ్నాయాన్నిచూపుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
‘జన సంవాద్ యాత్ర’ ఇప్పటికే రాష్ట్రంలోని 26 జిల్లాలను చుట్టేసిందని, మిగిలిన ప్రాంతాలను ఫిబ్రవరి 20 నుండి రెండో దశ ప్రారంభించనున్నట్లు సాహు తెలిపారు. సామాన్యుల కొరకై సమస్యలతో బీహార్‌లో ఆప్ మమేకమవ్వాలని, కూటమికై ఎవ్వరితోను చేతులు కలువబోమని అన్నారు.
అరవింద్ కేజ్రీవాల్, బీహార్ ఇన్చార్జి ఆప్ సంజయ్ సింగ్, పార్టీకి చెందిన ఇతర సీనియర్ నాయకులు, బీహార్ పర్యటన చేయనున్నట్లు తెలిపారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు నుండే సంజయ్ సింగ్, బీహార్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీహార్‌లో పార్టీని బలోపేతం చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అన్నారు.
జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..