ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ముందుగా ఊహించినట్లుగానే, ఎగ్జిట్ పోల్స్ చాలావరకు ఆమ్ ఆద్మీ పార్టీయే మంచి ఫలితాలను సాధిస్తుందని, ఢిల్లీ ఎన్నికల విజయం బీహార్ పై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందని ఆప్ నేతలు అభిప్రాయపడుతున్నారు.
అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మంగళవారం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు తన మ్యానిఫెస్టోను పోలింగ్ కు నాలుగు రోజులే ఉండగా, ఢిల్లీ వాసులకు మరోసారి తాయిలాలు ప్రకటించింది. మేనిఫెస్టోలో నాణ్యమైన విద్య, ఆరోగ్యం, స్వచ్ఛమైన నీరు, 24 గంటల విద్యుత్తును అందజేస్తామని ఢిల్లీ ప్రజలకు హామీ ఇచ్చింది.
ఢిల్లీ నగరంలోని షాహీన్ బాగ్ వద్ద పౌరసత్వ సవరణ చట్టంపై నిరంతర నిరసనలపై భారతీయ జనతా పార్టీ నాయకులు పదేపదే ఆమ్ ఆద్మీ పై చేస్తున్న ఆరోపణలను ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తిప్పికొట్టారు. తరుచుగా ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనలపై బీజేపీపై మండిపడ్డారు.
ఢిల్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో సొంత పార్టీల్లో టికెట్స్ లభించని నేతలు.. మరో పార్టీ తరపున టికెట్ కోసమో.. లేక సొంత పార్టీ అభ్యర్థిని ఓడించడం కోసమో మరో పార్టీలోకి జంప్ అవుతున్న ఘటనలు నిత్యం వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా శనివారం నాడు కూడా అటువంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది.
ఢిల్లీలోని జేఎన్‌యూ క్యాంపస్‌లో హింసతో పాటు ఇరాన్-అమెరికా మధ్య జరుగుతున్న ప్రచ్చన్న యుద్ధం వరకు ప్రపంచం నలుమూలల చోటుచేసుకుంటున్న అనేక ముఖ్యమైన ఘటనలు, కీలక పరిణామాలు, ఈ క్షణం వరకు ఎక్కడ, ఏం జరుగుతుందో తెలిపే ముఖ్యాంశాల సమాహారమే ఈ సూపర్ ఫాస్ట్ 100 న్యూస్.
ఢిల్లీలోని జేఎన్‌యూ క్యాంపస్‌లో చెలరేగిన హింస వెనుకు ఎవరున్నారు ? ఈ హింస వెనుక ఎవరి కుట్ర దాగి ఉంది ? ఎవరి ప్రోద్బలంతో దుండగులు ఈ దాడులకు పాల్పడ్డారు ? అసలు దుండగులు యూనివర్శిటీ సెక్యురిటీ సిబ్బందికి, పోలీసులకు చిక్కకుండా హాకీ స్టిక్స్, కర్రలు తీసుకుని క్యాంపస్‌లోకి ఎలా వెళ్లగలిగారు ? లేదంటే క్యాంపస్‌లో ఉన్న హాకీ స్టిక్స్, కర్రలతో దుండగులు దాడికి పాల్పడ్డారా ? ఒకవేళ అదే నిజమైతే.. దుండగులు దాడికి ఉపయోగించిన కర్రలు, హాకీ స్టిక్స్ క్యాంపస్‌లోకి ఎలా వచ్చాయి ? ఎవరు తీసుకొచ్చారు ? ఇవే కాదు.. అంతుచిక్కని ఇంకెన్నో సందేహాలకు సమాధానం వెతికే ప్రయత్నమే ''జేఎన్‌యూ హింస వెనుక ఎవరున్నారు ?''.
ఢిల్లీలోని జేఎన్‌యూ క్యాంపస్‌లో హింసతో పాటు ఇరాన్-అమెరికా మధ్య జరుగుతున్న ప్రచ్చన్న యుద్ధం వరకు ప్రపంచం నలుమూలల చోటుచేసుకుంటున్న అనేక ముఖ్యమైన ఘటనలు, కీలక పరిణామాలు, ఈ క్షణం వరకు ఎక్కడ, ఏం జరుగుతుందో తెలిపే ముఖ్యాంశాల సమాహారమే ఈ సూపర్ ఫాస్ట్ 100 న్యూస్.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై ముఖ్యమైన తేదీలను వెల్లడించిన కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ సునీల్ అరోరా. ఫిబ్రవరి 8న ఒకే విడతలో పోలింగ్ నిర్వహించి.. పిబ్రవరి 11న ఫలితాలు వెల్లడించనున్నట్టు ప్రకటించిన సీఇసీ. జనవరి 14న ఢిల్లీ ఎన్నికలపై నోటిఫికేషన్ వెలువడనుండగా.. జనవరి 21న నామినేషన్స్ దాఖలుకు తుది గడువు విధించినట్టు సీఈసి స్పష్టంచేసింది. జనవరి 22న నామినేషన్స్ పరిశీలన చేపట్టనుండగా జనవరి 24న నామినేషన్స్ ఉపసంహరణకు ఆఖరి గడువు విధించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.