School Girl Gang Rape: హైస్కూల్ విద్యార్థినిపై ముగ్గురు టీచర్లు అత్యాచారానికి పాల్పడిన హేయమైన ఘటన తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో వెలుగుచూసింది. జల్లాలోని ఓ ఉన్నత పాఠశాలకు చెందిన ముగ్గురు కీచక టీచర్లు చేసిన అఘాయిత్యమిది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన తమిళనాట కలకలం రేపుతోంది.
ఓ విద్యార్థినిపై టీచర్లు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన రాష్ట్రంలో ఆందోళన కల్గిస్తోంది. ప్రభుత్వ పాఠశాలలో మైనర్ విద్యార్థినిపై అదే స్కూలుకు చెందిన ముగ్గురు ఉపాధ్యాయులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ విద్యార్ధిని గర్భం దాల్చడంతో తల్లిదండ్రులు స్కూల్ మాన్పించి అబార్షన్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న స్కూల్ ప్రధానోపాధ్యాయుడు పోలీసులకు ఫిర్యాదు చేయించడంతో పాటు శిశు సంక్షేమ అధికారుల్ని ఆశ్రయించారు. ప్రస్తుతం బాధితురాలు కృష్ణగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
నిందితులైన ముగ్గురు టీచర్లు చిన్నస్వామి (57), ఆర్ముగం ( 45), ప్రకాశ్ (37)లను పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.
Also read: Delhi Exit Polls 2025: ఢిల్లీలో ఈసారి అధికారం ఎవరికి, ఎగ్జిట్ పోల్స్ వర్సెస్ కేకే సర్వే, ఎందుకీ తేడా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి