న్యూఢిల్లీ: అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మంగళవారం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు తన మ్యానిఫెస్టోను పోలింగ్ కు నాలుగు రోజులే ఉండగా, ఢిల్లీ వాసులకు మరోసారి తాయిలాలు ప్రకటించింది. మేనిఫెస్టోలో నాణ్యమైన విద్య, ఆరోగ్యం, స్వచ్ఛమైన నీరు, 24 గంటల విద్యుత్తును అందజేస్తామని ఢిల్లీ ప్రజలకు హామీ ఇచ్చింది.
ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మాట్లాడుతూ.. దేశ రాజధానిలోని ప్రతి కుటుంబాన్ని సంపన్నంగా చేయడమే ఆమ్ ఆద్మీ పార్టీ ఆశయమని అన్నారు. 28 పాయింట్ల కార్యాచరణతో మ్యానిఫెస్టోను విడుదల చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ, ఢిల్లీలోని ప్రతి సాధారణ పౌరుడికి గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి, వారి కుటుంబాలను సంపన్నంగా మార్చడానికి తమ ప్రభుత్వం సంకల్పంతో ఉన్నామని, మనీష్ సిసోడియా విలేకరుల సమావేశంలో అన్నారు. గత ఐదేళ్ళలో హమీలన్ని నెరవేర్చామని, ప్రభుత్వం ప్రజలకు ఎలా సహాయపడుతుందో చూపించడానికి మేము ఒక నమూనాను ఢిల్లీ ప్రజల ముందుకు తెచ్చామని ఆయన అన్నారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తరువాత అధికారంలోకి వస్తే పూర్తి రాష్ట్ర హోదాతో పాటు, జన్ లోక్పాల్, ఢిల్లీ స్వరాజ్ బిల్లు వంటి దీర్ఘకాల డిమాండ్లను నెరవేర్చడానికి ఆప్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని తెలిపారు. 2015లో రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించిన జన లోక్పాల్ బిల్లును గత నాలుగేళ్లుగా కేంద్ర ప్రభుత్వం పెండింగ్లో ఉంచిందని అన్నారు. ఈ బిల్లు ఆమోదం కొరకు ఆప్ ప్రభుత్వం తన పోరాటాన్ని కొనసాగిస్తుందని సిసోడియా అన్నారు.
दिल्ली सरकार द्वारा स्कूलों में शुरू की गई हैपिनेस करिकुलम और एंटरप्रेन्योरशिप करिकुलम की सफलता के बाद देशभक्ति पाठ्यक्रम भी लाया जाएगा। : @msisodia pic.twitter.com/EjkiKjrGEj
— AAP (@AamAadmiParty) February 4, 2020
10 పాయింట్ల హామీ కార్డు, ఆప్ మ్యానిఫెస్టోలో భాగమని అన్నారు. ఢిల్లీలోని ప్రతి పౌరుడికి మంచి విద్య, వైద్య సదుపాయాలు, కాలుష్యాన్ని మూడింట ఒక వంతుకు తగ్గించడం, నగరంలోని వివిధ ప్రాంతాలలో వదులుగా ఉండే ఓవర్ హెడ్ ఎలక్ట్రికల్ వైర్లను క్లియర్ చేయడం వంటివి చేస్తామని అన్నారు. ప్రతి ఇంటికి శుభ్రమైన, స్వచ్ఛమైన నీటిని సరఫరా చేయడానికి, 24 గంటల విద్యుత్ కొనసాగుతుందని, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కొనసాగుతుందని అన్నారు.
మహిళల భద్రత కోసం ‘మొహల్లా మార్షల్స్’ అందిస్తామని, సిసిటివి కెమెరాలను వ్యవస్థాపించడం, కొత్త వీధి దీపాలను ఉంచడం వంటి ప్రాజెక్టులతో ఇది కొనసాగుతుందని పేర్కొన్నారు. ఆప్ తన 28-పాయింట్ల కార్యాచరణలో భాగంగా భోజ్పురిని రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చడానికి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతుందని అన్నారు. ఢిల్లీ ప్రభుత్వం నిర్వహిస్తున్న పాఠశాలల్లో దేశభక్తి పాఠ్యాంశాలు కూడా ప్రవేశపెట్టబడతాయని అన్నారు.
రేషన్ కార్డుల ద్వారా ఇంటింటికీ వస్తువులను డెలివరీని చేస్తామని, రాజధానిలో మార్కెట్లు 24 గంటలు తెరవడానికి పైలట్ ప్రాజెక్టును అమలు చేస్తామని తెలిపారు. తమ మ్యానిఫెస్టోలో 10 లక్షల మంది సీనియర్ సిటిజన్లకు ఉచిత తీర్థయాత్రకు పంపిస్తామని హామీ ఇచ్చారు. నగరంలో కొత్తగా పారిశుధ్య కార్మికులను నియమిస్తామని, తమ విధి నిర్వహణలో మరణించే వారి కుటుంబాలకు రూ .1 కోటి నష్ట పరిహారం అందిస్తామని తెలిపారు.
2015లో గత అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాల్లో 67 స్థానాలను గెలుచుకుని ఆప్ అధికారం కైవసం చేసుకోగా, ప్రస్తుతం తన పనితీరును పునరావృతం చేయాలని ప్రయత్నిస్తోంది. కేవలం మూడు సీట్లు గెలుచుకున్న బీజేపీ, అధికారం చేపట్టాలని తీవ్ర ప్రయత్నం చేస్తోంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..