Fire accident near ex cm ys jagan house tadepalli: ఆంధ్ర ప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ ఇంటికి సమీపంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని జగన్ నివాసం వద్ద రోడ్డు పక్కన ఉన్న గార్డెన్లో బుధవారం మంటలు వ్యాపించాయి. బుధవారం రాత్రి 9 గంటల సమయంలో భారీగా మంటలు ఎగిసిపడినట్లు వైసీపీ నేతలు వెల్లడించారు.
వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వగా ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఇదిలా ఉండగా.. జగన్ ఇంటికి సమీపంలో ఇటీవల అల్లరి మూకలు రెచ్చిపోతున్నారని, రాళ్ల దాడులు చేస్తు, భయాందోళనలు కల్గించేలా తిరుగుతున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అంతే కాకుండా.. ఒక మాజీ సీఎంకు భద్రతలో ఇంతలోపమా.. అంటూ మండిపడుతున్నారు.
వైయస్ జగన్ గారి ఇంటి వద్ద అగ్నిప్రమాదం. సాయంత్రం మరియు రాత్రి మంటలు ఎగసిపడ్డాయి.@ysjagan గారి భద్రతపై ప్రజలు, వైయస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. pic.twitter.com/tst2y6stCq
— YSR Congress Party (@YSRCParty) February 5, 2025
మాజీ సీఎంను హత్యకు ఏమైన కుట్రలుచేస్తున్నారా.. అన్న కోణంలో కూడా వైసీపీ శ్రేణులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో లడ్డు వివాదం అప్పుడు బీజేవైఎం శ్రేణులు జగన్ ఇంటి వద్ద రచ్చ చేశారు. ఆ తర్వాత నారా లోకేష్ జన్మదినం నేపథ్యంలో కొంత మంది టీడీపీ కార్యకర్తలు హరన్ లు మోగిస్తు, మాజీ సీఎం ఇంటికి సమీపంలో న్యూసెన్స్ చేశారు. ఇప్పుడు ఈ విధంగా అగ్ని ప్రమాదం టెన్షన్ కల్గించేదిగా మారిందని వైసీపీ నేతలు సీరియస్ అవుతున్నారు.
అగ్ని ప్రమాదంకు చెందిన వీడియోను వైసీపీ తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో పోస్ట్ చేశారు. మరోవైపు జగన్ ఇటీవల తాడేపల్లిలోని విజయవాడ నగరపాలక సంస్థ వైసీపీ కార్పొరేట్లు, ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో జగన్ వచ్చే 30 ఏళ్లు వైసీపీ ప్రభుత్వం అధికారంలోనే ఉంటుందని జోస్యం చెప్పారు. ఇక మీద జగన్ 2.0 మరో లెవల్ లో ఉంటుందన్నారు.
వైసీపీని ఎంతలా అణగదొక్కేందుకు ప్రయత్నిస్తే.. అంతే ఉవ్వెత్తున ఎగిసి పడుతుందన్నారు. గతంలో తమ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు మేలుచేసేందుకు ప్రయారిటీ ఇచ్చామన్నారు. కొంత మేరకు కార్యకర్తలతో సమయం ఇవ్వలేకపోయామని అన్నారు. కానీ ఇప్పుడు కార్యకర్తలు పడ్డ కష్టాలు చూశామని, వారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు.
అక్రమంగా కేసులు పెడితే.. ప్రైవేటుగా కేసులు పెట్టి న్యాయపోరాటం చేస్తామన్నారు. మరోవైపు జగన్ కూటమిపై ఘాటు వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల్లోనే అగ్ని ప్రమాదం చోటు చేసుకొవడం పలు అనుమానాలకు తావిస్తుందని వైసీపీ శ్రేణులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter