షాహీన్ బాఘ్ నిరసనకారులపై కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఘాటుగా స్పందించారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా షాహీన్ బాఘ్‌లో జరుగుతున్న ఆందోళనలు ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ పనేనని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఆరోపించారు. ''షాహీన్ బాఘ్ నిరసనల వెనుక ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీల కుట్ర ఉంది'' అని కేంద్ర మంత్రి జవదేకర్ ఆరోపించారు.
ఢిల్లీ ఎన్నికల పోలింగ్ సమయం దగ్గరపడుతుండటంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల మధ్య సోషల్ మీడియాలో మాటకు మాట పెరిగిపోయింది. ఉచిత వై-ఫై, విద్యార్థుల భద్రతకై పాఠశాలల్లో సీసీటీవి కెమెరాల ఆప్ ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలపై విమర్శించారు.
దేశవ్యాప్తంగా చోటుచేసుకున్న ఘటనల ఆధారంగా పది తాజా ముఖ్యాంశాలను ఒక్క చోట చేర్చి అందించే ప్రయత్నమే ఈ టాప్ 10 జాతీయ వార్తలు. దేశంలో ఎక్కడేం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఇదిగో ఈ వీడియోపై ఓ లుక్కేయండి మరి.
ఢిల్లీలో మహిళలకు ఇదివరకే ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తోన్న కేజ్రీవాల్ సర్కార్.. తమను మరోసారి ఎన్నుకుంటే విద్యార్థులకు కూడా ఆ సౌకర్యాన్ని అందిస్తామని కార్డులో తెలిపారు.
ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు పోటీగా న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారా అన్న ప్రశ్నకు ఆశా దేవి పై విధంగా స్పందించారు.
గత ఐదేళ్లలో ఆమ్ ఆద్మీ పార్టీ పాలన వైఫల్యాలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారి 10 ప్రశ్నలు సంధించారు. మీడియా సమావేశంలో మనోజ్ తివారి మాట్లాడుతూ..
ఢిల్లీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వ్యూహం సిద్ధం చేశారు. సక్సెస్‌కు మారు పేరుగా ఉన్న ప్రశాంత్ కిశోర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రశాంత్ కిశోర్‌కు చెందిన ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ I-PACతో ఒప్పందం ఖరారైంది.
ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ ప్రాంతంలో ఓ దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ నేత నవీన్ కుమార్‌ను ఇటీవలి కాలంలో కొందరు దుండగులు కిడ్నాప్ చేసి హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
ఇటీవల కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దేశంలో దాదాపు కేంద్రానికి వ్యతిరేకంగా పనిచేస్తోన్న రాజకీయ పార్టీలన్నీ ఏకమైన సంగతి తెలిసిందే. ఎన్నికల అనంతరం కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రమాణస్వీకారోత్సవం వేదికపై ఒక్కచోటకు చేరిన ప్రతిపక్షాలను చూస్తే 2019 లోక్ సభ ఎన్నికల్లోనూ ఎన్డీఏను ఎదుర్కునేందుకు ఈ పార్టీలన్నీ ఏకమవుతాయా అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అలా ఏకమైన ప్రతిపక్ష పార్టీలతో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సైతం చేయి కలపడంతో 2019 లోక్ సభ ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమితో అరవింద్ కేజ్రీవాల్ చేయి కలుపుతారా అనే చర్చ కూడా జరిగింది.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రాజ్యసభ సీట్లు అమ్ముకున్నారని పలువురు ఆప్ కార్యకర్తలు బహిరంగంగానే తమ అసహనాన్ని వెల్లగక్కడంతో పరిస్థితి వివాదంగా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.