Delhi Exit Polls 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ కేంద్రంలోని అధికార బీజేపీకు ఉత్సాహాన్నిస్తున్నాయి. ఆప్ వర్సెస్ బీజేపీ పోటీలో బీజేపీ అధికారం దక్కించుకుంటుందని అత్యధిక సర్వే సంస్థలు వెల్లడించాయి. కేకే సర్వే మాత్రం మరోసారి ఆప్‌కే ప్రజలు పట్టం కట్టారంటోంది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాతంగా ముగిసింది. రెండు మూడు నియోజకవర్గాలు మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో ఎలాంటి సమస్యలు ఎదురుకాలేదు. దేశమంతా ఎదురుచూస్తున్న ఢిల్లీ ఫలితాల కోసం 8వ తేదీ వరకు నిరీక్షించాల్సి ఉన్నా ఎగ్జిట్ పోల్స్ మాత్రం విజేత ఎవరనేది తేల్చేశాయి. సాయంత్రం 5 గంటల వరకూ ఢిల్లీ పోలింగ్ 58 శాతం నమోదు కాగా గత ఎన్నికలతో పోలిస్తే ఇది 13 శాతం అధికం. మొత్తం పోలింగ్ శాతం వస్తే అంచనాలు మరోలా ఉండవచ్చు. అయితే ఈలోగా సాయంత్రం 6.30 గంటల తరువాత అన్ని సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ప్రకటించాయి. దాదాపు అన్ని సంస్థలు ఈసారి అధికారం బీజేపీకే అంటున్నాయి. ఒకటి రెండు సంస్థలు మాత్రం ప్రజలు మరోసారి ఆప్ పార్టీకు అధికారం ఇచ్చారంటున్నాయి.
ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై ఏ సంస్థ ఏం చెబుతోంది
మ్యాట్రిజ్ సంస్థ ప్రకారం ఆప్ 32-37 స్థానాలు, బీజేపీ 35-40 స్థానాలు గెల్చుకుంటాయి. కాంగ్రెస్ పార్టీ 0-1 స్థానానికి పరిమితం కావచ్చు. పీపుల్స్ ఇన్‌సైట్ సర్వే ప్రకారం ఆప్ పార్టీకు 25-29 స్థానాలు, బీజేపీకు 40-44 స్థానాలు రావచ్చు. కాంగ్రెస్ 0-1 స్థానం గెల్చుకుంటుంది. ఇక రిపబ్లిక్ పీ మార్క్ సంస్థ ప్రకారం ఆప్ పార్టీ 21-31 స్థానాలు, బీజేపీ 39-49 స్థానాలు, కాంగ్రెస్ పార్టీ 0-1 స్థానం గెల్చుకోవచ్చు.
టైమ్స్ నౌ అయితే ఆప్ పార్టీకు 22-31 స్థానాలు, బీజేపీకు 39-45 స్థానాలు, కాంగ్రెస్ పార్టీకు 0-2 స్థానాలు వస్తోయంటోంది. పీపుల్స్ పల్స్ సంస్థ ప్రకారం ఆప్ పార్టీ 10-19 స్థానాలు, బీజేపీ 51-60 స్థానాలు గెల్చుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరవదు. చాణక్య స్ట్రాటజీస్ సంస్థ ప్రకారం బీజేపీ 39-44 స్థానాలు, ఆప్ 22-31 స్థానాలు గెల్చుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ 2-3 స్థానాల్లో విజయం సాధించవచ్చు. ఇక జేవీసీ ప్రకారం బీజేపీ 39-45 స్థానాలు, ఆప్ 22-31 స్థానాల్లో విజయం సాధించనున్నాయి. కాంగ్రెస్ పార్టీ 0-2 స్థానాలు దక్కించుకోవచ్చు.
అన్ని సర్వేలకు భిన్నంగా కేకే సర్వే
అయితే 2024 ఎన్నికల్లో కచ్చితమైన ఫలితాలతో సంచలనం రేపిన కేకే సర్వే మాత్రం ఇందుకు భిన్నంగా ఫలితాలు వస్తాయంటోంది. మరోసారి ఆప్ పార్టీకే ప్రజలు పట్టం కడుతున్నారని చెబుతోంది. ఈ సంస్థ సర్వే ప్రకారం ఆప్ పార్టీకు 39 స్థానాలు, బీజేపీకు 22 స్థానాలు, కాంగ్రెస్ పార్టీకు 9 స్థానాలు రావచ్చు.
Also read: 8th Pay Commission Salary Hike: ఉద్యోగుల జీతాలు ఎంత పెరుగుతున్నాయి. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి