Magha Purnima: రేపే శక్తివంతమైన మాఘీ పౌర్ణమి.. ఈ ఒక్కపని చేస్తే ఏడాదంతా ఇంట్లో కనక వర్షమే..!

Magha Purnima: మాఘ మాసంలో వచ్చే మాఘీ పౌర్ణమితిథి అనేది ఎంతో శక్తివంతమైనదనదని పండితులు చెబుతున్నారు. ఈ రోజు భక్తులు కొన్ని పరిహారాలు పాటిస్తే ఏడాదంత కూడా డబ్బులకు లోటు ఉండదని కూడా చెప్తుంటారు.  

Written by - Inamdar Paresh | Last Updated : Feb 11, 2025, 07:13 PM IST
  • మాఘీ పౌర్ణమి పూజా విధానం..
  • ఈ నియమాలు పాటించాలంటున్న పండితులు..
Magha Purnima: రేపే శక్తివంతమైన మాఘీ పౌర్ణమి.. ఈ ఒక్కపని చేస్తే ఏడాదంతా ఇంట్లో కనక వర్షమే..!

Maghi Purnima remedies: ప్రస్తుతం దేశ మంతట కూడా ఎక్కడ చూసిన కుంభమేళ పుణ్యస్నానాల గురించి ఎక్కువగా చర్చించుకుంటున్నారు. ఫిబ్రవరి 12న  శక్తివంతమైన మాఘీ పౌర్ణమి ఏర్పడబోతుంది. ఈ తిథి శ్రీమహా విష్ణువుకు ఎంతో  ఇష్టమైన తిథిగా చెప్తుంటారు. ఈరోజున భక్తులు కొన్ని నియమాలు పాటిస్తే వారికి జీవితంలో ధనానికి లోటు ఉండదని పండితులు చెబుతున్నారు.

ముఖ్యంగా మాఘీ పౌర్ణమి పుణ్య తిథి ఉదయం 4 గంటల నుంచి ప్రారంభమౌతుంది. అదే విధంగా ఈ తిథి మధ్యాహ్నాం వరకు కూడా ఉంది. ఈ సమయంలో భక్తులు ఉదయం నిద్రలేచి శుభ్రంగా స్నానం చేసి ఉతికిన దుస్తులు ధరించాలి. తలకు బొట్టుపెట్టుకుని దేవుడి దగ్గర దీపారాధన చేయాలి.  అంతే కాకుండా.. ఈరోజున ముఖ్యంగా తామర వత్తులతో దీపారాధన చేయాలి. ఈ మాఘీ పౌర్ణమి తిథి రోజు శ్రీ మహా విష్ణువు నీళ్లలో కొలువుంటారంట. అందుకే మీకు అందుబాటులో ఉండే.. బావులు, చెరువులు, సరస్సులలో పుణ్యస్నానాలు ఆచరించాలని పండితులు చెబుతున్నారు. 

మాఘీ పౌర్ణమి వేళ శ్రీ మహా విష్ణువు ఆలయంలో పూజకు గాను.. 5రకాల పుష్ఫాలు సమర్పించాలి. అదే విధంగా.. శివుడి గుడిలో అభిషేకం కోసం పాలు, పెరుగు, చక్కెర,నెయ్యి,  తేనె లను సమర్పించాలి. ఈ పనులు చేస్తే జీవితంలో ఏడాదంత కూడా అలాంటి వారి ఇంట్లో డబ్బులకు కొదువ ఉండదంటారు.

Read more: Lord Ganesh: వినాయకుడికి ఈ రాశి అంటే ఎలుకంత ఇష్టం.. వీళ్ల జీవితకాలంలో కష్టాలే చూడరు..

అంతే కాకుండా.. ఈ రోజున అశ్వత్థ రావి చెట్టు నీడలో నెయ్యితో దీపారాధన చేయాలి. నల్ల చీమలు, కుక్కలకు రొట్టేలు, బెల్లం తినేందుకు వేయాలి.  ఈరోజున ఉపవాసం ఉంటూ కేవలం శ్రీమహా విష్ణువును మనసారా ధ్యానిస్తు ఉండాలి. ఈ రోజున సత్యనారాయణ వ్రతం లేదా విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే అలాంటి వారికి విశేషమైన మంచిఫలితాలు కల్గుతాయని పండితులు చెబుతున్నారు.

అందుకే మాఘీ పౌర్ణమిని కుంభమేళలో కూడా పవిత్రమైన షాహీస్నానాలలో ఒకటిగా పండితులు సూచించారు. శనిదేవుడి సాడేసాతి సమస్యలతో బాధపడుతున్న వారు.. ఈ రోజున హనుమంతుడి ఆలయంలో తమలపాకులతో హారం చేసి సమర్పించాలి. అంతే కాకుండా.. హనుమంతుడి చాలీసా, శనీకి నల్లనువ్వులతో తైలాభీషేకం చేయాలి. ఇలా చేస్తే జీవితంలోని సమస్యల నుంచి బైటపడొచ్చని పండితులు చెబుతున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News