Madhya Pradesh wedding tragedy groom collapses on horse video: మరణం ఎప్పుడు ఎక్కటి నుంచి వస్తుందో ఎవరు చెప్పలేరు. ఇటీవల కాలంలో అనేక మంది చూస్తుండగా గుండెపోటుతో చనిపోతున్నారు. ఒకప్పుడు హర్ట్ ఎటాక్ అనేది పెద్దవారిలో ఎక్కువగా కన్పించేది. కానీ ఇప్పుడు మారిపోయిన జీవనశైలీ, ఆహారపు అలవాట్లు వల్ల చిన్న తనంలో కూడా గుండె పోటులు వస్తున్నాయి. అప్పటి వరకు డ్యాన్స్ లు చేసిన వాళ్లు గుండెపోటుతో చనిపోతున్నారను.
కొందరు ఆఫీసు పనులు చేస్తు, మరికొందరు జిమ్ లో వర్కౌట్స్ చేస్తు, ఇంకొందరు ఉల్లాసంగా మాట్లాడుతూ, డ్యాన్స్ లు చేస్తు ఉండగా.. ఒక్కసారిగా హర్ట్ ఎటాక్ తో కుప్పకూలీ పడిపోతున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం మధ్య ప్రదేశ్ లో జరిగిన షాకింగ్ ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది.
గుండెపోటుతో పెళ్లిలోనే వరుడు మృతి
మధ్యప్రదేశ్ - శ్యోపుర్ జిల్లాలో పెళ్లి ఊరేగింపులో డీజే పాటలకు డాన్స్ చేసిన పెళ్లి కొడుకు ప్రదీప్ (26) మండపానికి వెళ్లేందుకు గుర్రం ఎక్కాడు
కాసేపటికే ప్రదీప్ గుండెపోటుకు గురికావడంతో సీపీఆర్ చేసి, ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందాడని… pic.twitter.com/MYg8EEmkJn
— Telugu Scribe (@TeluguScribe) February 16, 2025
మధ్యప్రదేశ్‌లోని షియోపూర్ జిల్లాలో ఒక వరుడు తన వివాహ ఊరేగింపులో గుర్రంపై కూర్చుని స్వారీ చేస్తున్నాడు. శుక్రవారం రాత్రి షియోపూర్ పట్టణంలో 26 ఏళ్ల ప్రదీప్ జాట్, తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి గుర్రంపై వివాహ వేదికకు వెళుతుండగా ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది.
అప్పటి వరకు డ్యాన్స్ చేసిన వరుడు ఏమైందో కానీ.. ఒక్కసారిగా కుప్పకూలీపడిపోయాడు. వెంటనే బంధువులు, కుటుంబ సభ్యులు దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. వరుడ్ని పరిశీలించిన వైద్యులు గుండెపోటుతో అప్పటికే చనిపోయినట్లు వెల్లడించారు. ఈ ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది. ఈ ఘటనతో పెళ్లి బాజాలు ఇంట్లో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఈ ఘటనకు చెందిన వీడియో నెట్టంట వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మధ్య ప్రదేశ్ లోనే ఇండోర్ కు చెందిన యువతి డ్యాన్స్ చేస్తు ఒక్కసారిగా కుప్పకూలీ పడిపోయింది. ఈ ఘటన మరువక ముందే మధ్య ప్రదేశ్ లోనే పెళ్లి వేడుకలో వరుడు అదే గుండెపోటుతో చనిపోవడంతో నెటిజన్ లు సైతం ఎమోషనల్ కు గురౌతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter