Bus Conductor Attack on Retired IAS Officer in Jaipur: బస్సుల్లో ప్రయాణిస్తున్నప్పుడు.. కొత్త ప్రదేశాలకు వెళ్తున్నప్పుడు.. ఆ స్టేజీ వచ్చాక చెప్పమని చాలా మంది కండక్టర్ కు ముందుగానే చేస్తుంటారు. చాలా మంది కండక్టర్ లు ప్రతి స్టాప్ రాక ముందే బస్సులోని ప్రయాణికుల్ని అలర్ట్ చేస్తుంటారు.ఈ క్రమంలో కొందరు మాత్రం టికెట్ తీసుకునే వారకు ఉండి.. ఆ తర్వాత తమ ఫోన్ లో బిజీగా అయిపోతుంటారు. దీంతో కొత్త ప్రదేశాలల్లోకి వెళ్లిన ప్రయాణికులు ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఈక్రమంలో రాజస్థాన్ లోని జైపూర్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
Jaipur, Rajasthan
75 years old Retired IAS Officer RL Meena Vs Bus Conductor
Reason of Dispute: Rs. 10 extra fare.pic.twitter.com/Bc2ablqpx2— NCMIndia Council For Men Affairs (@NCMIndiaa) January 12, 2025
రాజస్థాన్ జైపూర్‌కు చెందిన 75 ఏళ్ల రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆర్ఎల్. మీనా ఒక బస్సు ఎక్కారు. ఆయన టికెట్ తీసుకున్నప్పుడే.. ఆగ్రా రోడ్డులోని కనోటా బస్టాండులో దిగాలనుకుంటున్నానని.. ఆ స్టాపు రాగానే తనకు చెప్పాలని కండక్టర్ ఘన్‌శ్యామ్ శర్మను చెప్పారు. కానీ కండక్టర్ మాత్రం.. తన పనుల్లో పడి మర్చిపోయాడు. ఆయన దిగాల్సిన స్టాప్ దాటిపోయింది. దీంతో మరో స్టాప్ లోకి రిటైర్ట్ ఐఏఎస్ దిగేందుకు ప్రయత్నించారు. దీంతో పది రూపాయలు ఎక్స్ ట్రా ఇవ్వాలని కండక్టర్ గొడవకు దిగాడు...ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కోపంలో.. ఆర్ఎల్ మీన కండక్టర్ పై చేయి చేసుకున్నాడు.
మరోపైపు కండక్టర్ కూడా.. కనీసం ఏజ్ లో పెద్దవాడు అని కూడాచూడకుండా.. పిచ్చి కొట్టుడు కొట్టాడు. దీంతో అక్కడున్న వారంతా ఈ ఘటనను తమ ఫోన్ లలో రికార్డు చేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
దీనిపై రిటైర్ట్ ఐఏఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఈ వీడియోకాస్త వైరల్ కావడంతో.. జైపూర్ సిటీ ట్రాన్స్ పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ వద్దకు వెళ్లగా.. కండక్టర్ ఘన్‌శ్యామ్‌ను సస్పెండ్ చేశారు. దీనిపై నెటిజన్ లు కండక్టర్ ను ఏకీపారేస్తు కామెంట్లు చేస్తున్నారు. పెద్దాయనను కొట్టినందుకు మాత్రం సరైన పనిష్మెంట్ దొరికిందని కండక్టర్ పై ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter