Director trinadha rao controversy comments on actress anshu video: మజాకా మూవీ టీజర్ రిలీజ్ ఈవెంట్ తాజాగా జరిగింది. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ త్రినాధ రావు హీరోయిన్ అన్షుపై షాకింగ్ కామెంట్స్ చేశారు. గతంలో మన్మథుడు సినిమాలో నటించిన ఆ హీరోయిన్ లడ్డుగా ఉండేదని వేదిక మీద అన్నారు. అంతేకాకుండా.. కత్తిలా ఉండేదని కూడా కాంట్రవర్సీగా మాట్లాడారు. ఈ క్రమంలో హీరోయిన్ అన్షు. అక్కడే ఉన్న రీతువర్మ కాస్తంతా ఇబ్బంది పడినట్లు తెలుస్తొంది.
అంతటితో ఆగకుండా.. ఆమె కోసమే మళ్లీ మళ్లీ మన్మథుడు సినిమా చూసేవాళ్లమని చెప్పారు. తెలుగు వాళ్లకు సన్నగా ఉంటే నచ్చరని.. అన్ని బాగా సైజుల్లో పెంచాలని తాను సలహా ఇచ్చానని కూడా వేదిక మీద చెప్పారు. దీంతో నటి చాలా ఇబ్బందిగా ఫీలయ్యారు.
Director Trinath Rao Nakkina Speech about Heroine #Anshu! #Mazaka pic.twitter.com/3Aca6yPaYj
— Rajesh Manne (@rajeshmanne1) January 12, 2025
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవతుంది. దీంతో నెటిజన్లు దీనిపై ఫైర్ అవుతున్నారు. హీరోయిన్లను నోటికొచ్చినట్లు మాట్లాడటమేంటని.. డైరెక్టర్ ను త్రినాధరావును ఏకీపారేస్తున్నారు. ఇదిలా ఉండగా.. మజాకా మూవీలో.. సందీప్ కిషన్ హీరోగా చేస్తున్నారు.
త్రినాథరావు తెరకెక్కిస్తున్న సినిమా మజాకా.. రీతు వర్మ, మన్మథుడు ఫెమ్ అన్షు, రావు రమేష్ లు నటిస్తున్నారు... సంక్రాంతి కానుకగా.. ఈ మూవీ టీజర్ ఈరోజు విడుదల చేశారు. ఈమూవీ.. ఫిబ్రవరి 21న అభిమానుల ముందుకు రానుంది. ఇంతలోనే.. డైరెక్టర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో రచ్చకు దారితీశాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter