Daaku Maharaaj review: ‘డాకు మహారాజ్’ మూవీ రివ్యూ.. బాలయ్య సంక్రాంతి హిట్ కొట్టినట్టేనా..!

Daaku Maharaaj review: బాలయ్యను సంక్రాంతిని విడదీసి తీయలేము. పొంగల్ సీజన్ లో విడుదలైన బాలకృష్ణ మెజారిటీ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ఈ కోవలో 2025 సంక్రాంతి కానుకగా ‘డాకు మహారాజ్’సినిమాతో పలకరించారు. ఈ సినిమాతో నందమూరి బాలకృష్ణ సంక్రాంతి హిట్ అందుకున్నట్టేనా.. లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం

Written by - TA Kiran Kumar | Last Updated : Jan 12, 2025, 09:32 AM IST
Daaku Maharaaj review: ‘డాకు మహారాజ్’ మూవీ రివ్యూ.. బాలయ్య సంక్రాంతి హిట్ కొట్టినట్టేనా..!

మూవీ రివ్యూ: డాకు మహారాజ్ (Daaku Maharaaj)
తారాగణం: నందమూరి బాలకృష్ణ, బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా, టామ్ చాకో, సత్య,
సంగీతం: తమన్ ఎస్
సినిమాటోగ్రఫీ: విజయ్ కార్తీక్
ఎడిటర్: నిరంజన్ దేవరమానే, రూబెన్
సమర్పణ: శ్రీకర స్టూడియోస్
బ్యానర్స్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్‌
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
డైరెక్షన్: బాబీ కొల్లి
విడుదల తేది: 12-1-2025

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం  ‘డాకు మహారాజ్’. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. బాబీ కొల్లి దర్శకత్వంలో సితార ఎంటర్మైన్మెంట్స్, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్‌, శ్రీకర ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించారు. మరి సినిమాతో బాలయ్య బాక్సాఫీస్ ను బద్దలు కొట్టాడా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
 

కథ విషయానికొస్తే..

నానాజీ (బాలకృష్ణ) తన కూతురుతో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతుంటాడు. మరోవైపు మైనింగ్ కింగ్ (బాబీ డియోల్ ) అన్యాయంగా ప్రజలను దోచుకుంటూ ఉంటాడు. ఓ ఇష్యూతో బలవంత్ సింగ్ ఠాకూర్ (బాబీ డియోల్) వల్ల నానాజీ ఓ సమస్యను ఫేస్ చేస్తుంటాడు. తన కూతురిని క్రమంలో  ‘డాకు మహారాజ్’ ఎవరు..?  మధ్యలో సీతారామ్ ఎవరు..? డాకు మహారాజ్, నానాజీ ముగ్గురు వేరు వేరునా.. ఒకరేనా..? కొకైన్ కింగ్ గా బలవంత్ సింగ్ చేసిన ఆరాచకాలు ఏంటి..? దోచుకోవడానికి కాకుండా.. ప్రజలను కాపాడేందుకు  ‘డాకు మహారాజ్’  ఏం చేసాడు. శిష్ట రక్షణ కోసం కత్తి పట్టిన ‘డాకు మహారాజ్’ చివరకు దుష్ట శిక్షన ఎలా చేశాడో తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
 
కథనం, టెక్నికల్ విషయానికొస్తే..

బాబీ తన గత చిత్రాలను పరిశీలిస్తే.. చిన్న పాయింట్ చుట్టే కథ మొత్తాన్ని తిప్పడం బాబీ మార్క్ స్టైల్. గత చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ సినిమా తర్వాత బాలయ్యతో సినిమా చేస్తుండటం దానికి ‘డాకు మహారాజ్’ టైటిల్ పెట్టడంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటాయి. 1996 బ్యాక్‌డ్రాప్‌లో కథ మొదలవుతంది. తన కూతురిని కాపాడుకునేందుకు భోపాల్ సెంట్రల్ జైలు తప్పించుకుని  నుంచి మదనపల్లెకు వస్తాడు

అనగనగా ఒక రాజు ఉండేవాడు. అది కూడా రాజ్యం లేని రాజు. ఇందులో ‘డాకు మహారాజ్’ పాత్రను రాబిన్ హుడ్ తరహాలో తెరకెక్కించాడు దర్శకుడు. అంతేకాదు బాలయ్యను ఆయన అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అంతకు మించి చూపించాడు. కొన్ని సీన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయి.  బోయపాటి శ్రీనును మించి బాలయ్యలోని ప్లస్ లను తనకు తగ్గట్టు మలుచుకున్నాడు. బాలయ్య కాస్ట్యూమ్స్ విషయంలో మంచి శ్రద్ద తీసుకున్నాడు. ఆ విషయంలో మెచ్చుకోవాలి.  ఇక ఊర్వశి రౌతెలాతో బాలయ్య రొమాంటిక్ సాంగ్ వెగటు పుట్టించేలా ఉంది. ఈ చిత్రంలో  బాలయ్య.. డాకు మహారాజ్ గా.. సీతారామ్, నానాజీ గా మూడు విభిన్న పాత్రల్లో చూపించాడు. ఈ సినిమాలో పాప సెంటిమెంట్ అన్ని సినిమాల్లో చూసిందే.

ఈ సినిమాను  బాబీ.. ఓ పాయింట్ చుట్టే సినిమాను అల్లుకున్నాడు. పెద్దగా కథ లేకుండా కేవలం సీన్స్ తో ఈ సినిమాను లాగించాడు. అంతేకాదు బాలయ్య పాత సినిమాలనే మిక్సీలో వేసి రుబ్బాడు. ఒక పద్దతి పాడు లేకుండా నరకడమే పనిగా పెట్టుకున్నాడు. మాస్ ఆడియన్స్ కాకుండా కేవలం అభిమానుల కోసమే ఈ సినిమా తీసినట్టు ఉంది. ప్రతీ సీన్ నేల విడిచి సాము చేసినట్టుగా ఉంది.  ఫ్యామిలీ ఆడియన్స్ తో కలిసి ఈ సినిమా చూడటం అంత నరకం ఏది ఉండదు. కొన్ని సీన్స్ షోలేలోతో పాటు కార్తి ‘ఖాకీ’ సినిమాలు గుర్తుకు తెస్తాయి.

గుర్రం హీరోను గుర్తు పట్టే ప్రీ క్లైమాక్స్ సీన్ మాత్రం ఓ రేంజ్ లో ఉంది. మరోవైపు హీరోకు ధీటైన విలన్ పాత్రలో బాబీ డియోల్ మలుచుకున్నాడు. అక్కడక్కడ లాజిక్ లేకుండా సినిమాను లాగించాడు. తమన్ ఈ సినిమాకు అందించిన ఆర్ఆర్ మాత్రమే బాగుంది. పాటలు ఏ మంత ఆకట్టుకునేలా లేవు. ప్రేక్షకులు వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ చూసుకోవడానికి సాంగ్స్ ఉపయోగపడ్డాయి. ఈ సినిమాలో  ఎడిటర్ ఫస్టాఫ్ లో అరగంట కట్ చేసినా.. సినిమాకు పెద్దగా వచ్చినా నష్టమేమి లేదు. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు బాగున్నాయి. మొత్తంగా బాలయ్యతో రొటీన్ రివేంజ్ ఫార్ములానే తెరకెక్కించాడు.

నటీనటుల విషయానికొస్తే..

బాలకృష్ణ నటన గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. 50 యేళ్లుగా ప్రేక్షకులను అలరిస్తున్నాడంటే ఆయన నటనకు సలామ్ కొట్టాల్సిందే. ఈ సినిమాలో  డాకు మహారాజ్ గా .. సీతారామ్ గా.. సర్కార్ సీతారామ్ పాత్రల్లో ఒదిగిపోయాడు. డాకు మహారాజ్ పాత్రలో బాలయ్య ఒదిగిన తీరు అద్భుతం. బాబీ దేవోల్ తన పరిధి మేరకు విలన్ గా రాణించాడు. శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ కథ ప్రకారం వారి పాత్రలకు న్యాయం చేసారు. ఊర్వశి రౌతెలా ఏదో ఐటెం సాంగ్ కోసం పెట్టినట్టు ఉంది. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు రాణించారు.

ప్లస్ పాయింట్స్

డాకు మహారాజ్ బాలయ్య హై ఓల్టేజ్ యాక్షన్

నిర్మాణ విలువలు

తమన్ ఆర్ఆర్

మైనస్ పాయింట్స్

రొటిన్ స్టోరీ, స్క్రీన్ ప్లే

సాంగ్స్

ఫస్ట్ హాఫ్

ఎడిటింగ్

పంచ్ లైన్.. ‘డాకు మహారాజ్’..ఓన్లీ బాలయ్య అభిమానులకు మాత్రమే..

ఇదీ చదవండి: Prabhas Marriage: ప్రభాస్ మ్యారేజ్ ఫిక్స్.. డార్లింగ్ చేసుకోబోయేది ఈమెనే..!

ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News