Viral Video: డాకు మహా రాజ్ మాస్‌జాతర.. పొట్టెలును బలిస్తు.. బాలయ్య ఫ్లెక్సీపై మద్యం పోస్తు అభిమానుల రచ్చ.. వీడియో వైరల్..

Daaku maharaaj mass celebrations: డాకు మహారాజ్ మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదలై మాస్ జాతరకు కారణమైంది. ఈ నేపథ్యంలో అభిమానులు... థియేటర్ లలో పొట్టెలును బలిస్తు, బాలయ్య ఫ్లెక్సీపై లిక్కర్ తో అభిషేకం చేస్తు తమ అభిమానం చాటు కూంటున్నారు. ఈ వీడియోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.

Written by - Inamdar Paresh | Last Updated : Jan 12, 2025, 05:21 PM IST
  • డాకు మహారాజ్ రచ్చ రంబోలా..
  • పూనకాలతో బాలయ్య ఊగిపోతున్న అభిమానులు..
Viral Video: డాకు మహా రాజ్ మాస్‌జాతర.. పొట్టెలును బలిస్తు.. బాలయ్య ఫ్లెక్సీపై మద్యం పోస్తు  అభిమానుల రచ్చ.. వీడియో వైరల్..

Balakrishna Fans sacrifice a sheep and pouring alcohol flexy: గాడ్ ఆఫ్ ది మాసెస్.. నందమూరి నటసింహాం బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'డాకు మహారాజ్' ప్రపంచ వ్యాప్తంగా నేడు విడుదలైంది.ఈ మూవీ సంక్రాంతికి ముందే జనాల్లో ఒక జోష్ నింపిందని చెప్పుకొవచ్చు. ఏపీలో ఇప్పటికే ఈ మూవీకి బెనిఫిట్ షోలకు సర్కారు పర్మిషన్ ఇచ్చింది. అయితే..  థియేటర్ లలో  బాలయ్య అభిమానులు హల్ చల్ చేస్తున్నారు. బాలయ్య.. మూవీ రిలీజ్ అది కూడా ఫస్ట్ డే ..  అంటే థియేటర్లలో మాస్ జాతర మాములుగా ఉండదనే విషయం తెలిసిందే.

 

 అయితే.. ప్రస్తుతం బాలయ్య అభిమానులు థియేటర్ లలో.. డ్యాన్స్ లు చేస్తు హల్ చల్ చేస్తున్నారు. తాజాగా.. ఒక థియేటర్ లో అభిమానులు... పొట్టెలను బలిచ్చారు. ఫ్యాన్స్ అరుపులు కేకల మధ్య పొట్టెలును బలిచ్చి.. దాని రక్తంతో బాలయ్యకు విజయ తిలకం దిద్ది తమ అభిమానం చాటుకున్నారు.

మరికొన్ని చోట్ల బాలయ్య ఫ్లెక్సీపై.. లిక్కర్ తో అభిషేకం చేస్తు కూడా హల్ చల్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ క్రమంలో బాలయ్య.. డాకుమహారాజ్  మూవీకి బాబీ దర్శకత్వం వహించగా.. తమన్ సంగీతం అందించారు. ఈ మూవీ ఇప్పటికే మాస్ తో పాటు , క్లాస్ ఆడియన్స్ అభిమానం కూడా చూరగొన్నట్లు తెలుస్తొంది.

 

ఈ మూవీ కూడా సూపర్ డూపర్ హిట్ లిస్ట్ లో చేరిపొవడం పక్కా.. అని బాలయ్య అభిమానులు పూనకాలతో ఊగిపోతు చెప్తున్నారు.  ఇదిలా ఉండగా.. పొట్టెలును బలివ్వడంపై మాత్రం కొంత మంది జంతు ప్రేమికులు తప్పుపడుతున్నట్లు తెలుస్తొంది. ఇలాంటి అతి చేయోద్దని కూడా అభిమానులకు సెటైర్ లు వేస్తున్నారు. మొత్తానికి డాకు మహారాజ్.. రిలీజ్ సంబరాలు మాత్రం.. ప్రపంచ వ్యాప్తంగా దుమ్మురేపుతున్నాయని చెప్పుకొవచ్చు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News