Happy Bhogi Wishes In Telugu: భోగి, సంక్రాంతి పండుగలకు ఒక రోజు ముందు వచ్చే పండుగ. ఇది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, కొత్త ఆరంభానికి నాంది. పాత సంవత్సరానికి వీడ్కోలు పలికి, కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించే ఈ పండుగ చాలా ప్రత్యేకమైనది. ఈ రోజున మీ ప్రియమైనవారికి తెలుగులో భోగి శుభాకాంక్షలు తెలపండి ఇలా...
భోగి మంటలో మీ కష్టాలు అన్నీ కాలిపోయి, జీవితం సుఖంగా సాగాలని కోరుకుంటూ.. హ్యాపీ భోగి శుభాకాంక్షలు!
భోగి పండుగ అంటే కేవలం పాత వస్తువులను కాల్చడమే కాదు, మన మనసులోని పాత ఆలోచనలను కూడా కాల్చివేయడమే.. భోగి పండుగ శుభాకాంక్షలు!
ఆనందాల భోగి నాడు మీరు చేపట్టే కార్యక్రమాలన్నీ విజయవంతం అవ్వాలని కోరుకుంటూ.. మీకు 2025 భోగి శుభాకాంక్షలు
ఈ భోగి మీ జీవితంలో భోగ భాగ్యాలను తీసుకురావాలని కోరుకుంటూ.... భోగి పండుగ శుభాకాంక్షలు!
ఈ భోగి పండుగ మీ ఇంట సంబరాల కాంతిని తీసుకురావాలని కోరుకుంటూ అందరికీ భోగి శుభాకాంక్షలు 2025!
మామిడి తోరణాలతో.. ముత్యాల ముగ్గులతో మీ ఇల్లు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ... భోగి శుభాకాంక్షలు 2025!
ఈ భోగి మీకు భోగభాగ్యాలను, సుఖసంతోషాలను అందించాలని ... మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి శుభాకాంక్షలు!
ఈ భోగి మీ ఇంట కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటూ 2025 భోగి పండుగ శుభాకాంక్షలు!
భోగి వెలుగు మిమ్మల్ని ఉజ్వల భవిష్యత్తు వైపు నడిపించాలని 2025 భోగి శుభాకాంక్షలు !
ఈ ప్రత్యేక పండుగ అందరికీ మంచి ఆరోగ్యం, శ్రేయస్సు చేకూరాలని కోరుకుంటూ.. భోగి శుభాకాంక్షలు !