Revanth Reddy: అమరావతిపై రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. 'పోలిక అసలు వద్దు'

Revanth Reddy Hot Comments On Amaravati: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతితో పోలిక అసలు వద్దని రేవంత్‌ రెడ్డి ప్రకటించి కలకలం రేపారు. హైదరాబాద్‌ అమరావతితో కాదు ప్రపంచంతో పోటీ పడుతామని ప్రకటించడం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jan 12, 2025, 03:11 PM IST
Revanth Reddy: అమరావతిపై రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. 'పోలిక అసలు వద్దు'

CH Vidya Sagar Rao: దేశం మొత్తం గర్వపడేలా హైదరాద్‌ను ముందుకు తీసుకుపోవాలే అని.. అమరావతితో పోటీ.. పోలిక వద్దని రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌ అభివృద్ధికి సహకరించాలని బీజేపీ నాయకులను ఆయన కోరారు. ప్రభుత్వం అంటే పాలకపక్షం.. ప్రతిపక్షం కలిసి ఉంటాయని పేర్కొన్నారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు తర్వాత తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎవరినైనా కలుస్తానని ప్రకటించారు.

Also Read: Cheetah Tension: హైదరాబాద్‌లో చిరుతపులి హల్‌చల్‌.. భయాందోళనలో స్థానికులు

మాజీ గవర్నర్‌ విద్యాసాగర్‌ రావు రచించిన ఉనకి పుస్తకావిష్కరణ సభలో రేవంత్‌ రెడ్డి పాల్గొని కీలక ప్రసంగం చేశారు. హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణా హోటల్‌లో సోమవారం జరిగిన సభలో రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. 'విద్యార్ధి రాజకీయాలను ప్రోత్సహించాలి. హైదరాబాద్ నగరం విశ్వనగరంగా ఎదగాలి' అని తెలిపారు. అమరావతితో పోటీ పోలిక వద్దని పేర్కొన్నారు. నేడు యూనివర్సిటీలు 
ఉనికి కోల్పోయేలా ఉన్నాయి. యూనివర్సిటీలకు తిరిగి పూర్వ వైభవం రావాలి' అని వివరించారు.

Also Read: Liquor: మందుబాబులకు బంపర్‌ వార్త.. త్వరలోనే కొత్త మద్యం బ్రాండ్లు

తెలంగాణ ఉద్యమానికి ఉస్మానియా,కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు కారణమని రేవంత్‌ రెడ్డి గుర్తుచేశారు. విద్యార్థి దశలో చైతన్యం లేకపోవడంతోనే పార్టీ ఫిరాయింపులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. విద్యార్థి రాజకీయాలు లేకపోతే చైతన్యం కోల్పోతామని ప్రకటించారు. గోదావరి జలాల కోసం విద్యాసాగర్ రావు పాదయాత్ర చేశారని గుర్తు తెచ్చుకున్నారు. గోదావరి జలాలు తెలంగాణకు వినియోగించుకోవాలంటే విద్యాసాగర్ రావు అనుభవం అవసరమని పేర్కొన్నారు.

'ఎన్నికలప్పుడే రాజకీయాలు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎవరినైనా కలుస్తా. నాకు ఎలాంటి భేషజాలు లేవు' అని రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ విశ్వనగరంలా మారాలంటే రీజినల్ రింగ్ రోడ్డు కావాలని తెలిపారు. హైదరాబాద్‌కు రీజినల్ రింగ్ రైల్ కావాలని ప్రధాని మోదీని అడిగినట్లు చెప్పారు. ఆటో మొబైల్ ఇండస్ట్రీని తెలంగాణకు తీసుకు రావాలని తాము అనుకుంటున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రపంచంతో పోటీ పడాలని పేర్కొన్నారు. తెలంగాణకు మెట్రో రైలు అనుమతులు ఇవ్వాలని కోరారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News