Mosquito Repellent Apps: దోమల బెడదకు చెక్ చెప్పే మస్కిటో కిల్లర్ మొబైల్ యాప్స్...

Mosquito Repellent Apps: అసలే వానా కాలం.. దోమల బెడద చాలా ఎక్కువగా ఉంటుంది.. దోమల బారి నుంచి బయటపడేందుకు ఇప్పుడు కొన్ని రకాల మొబైల్ యాప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఆ యాప్స్ ఏంటి.. అవి ఎంతమేర ఎఫెక్టివ్‌గా పనిచేయగలవనేది ఇక్కడ తెలుసుకోండి..

Written by - Srinivas Mittapalli | Last Updated : Aug 9, 2022, 03:12 PM IST
  • వానా కాలంలో దోమల బెడదతో బాధపడుతున్నారా
  • మస్కిటో కాయిల్స్, ఆలౌట్ వంటివి వాడుతున్నారా
  • దోమలను తరిమికొట్టే యాప్స్ కూడా ఉన్నాయని మీకు తెలుసా
Mosquito Repellent Apps: దోమల బెడదకు చెక్ చెప్పే మస్కిటో కిల్లర్ మొబైల్ యాప్స్...

Mosquito Repellent Apps: వానా కాలం కావడంతో ప్రస్తుతం దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సహజంగానే వానలు మొదలయ్యాయంటే దోమల బెడద ఎక్కువవుతుంది. దోమకాటుతో టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధుల బారినపడే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ వానా కాలంలో దోమల బారినపడకుండా ఉండేందుకు చాలామంది మస్కిటో కాయిల్స్, ఆలౌట్ వంటివి ఉపయోగిస్తుంటారు. అయితే ఇవి మాత్రమే కాదు.. దోమలను తరిమికొట్టేందుకు కొన్ని రకాల మొబైల్ యాప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ యాప్స్‌ను యాక్టివేట్ చేయడం ద్వారా వాటి నుంచి విడుదలయ్యే ఫ్రీక్వెన్సీ సౌండ్ దోమలను తరిమికొట్టేలా చేస్తుంది.

దోమలను తరిమికొట్టే యాప్స్ :

గూగుల్ ప్లే స్టోర్‌లో మస్కిటో కిల్లర్, మస్కిటో సౌండ్, ఫ్రీక్వెన్సీ జనరేటర్ తదితర యాప్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ యాప్స్‌కి మిలియన్ల సంఖ్యలో డౌన్‌లోడ్స్ ఉన్నాయి. వీటిని స్మార్ట్ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసి ఆన్ చేయడం ద్వారా దోమలను తరిమికొట్టే అల్ట్రా సోనిక్ సౌండ్ ఫ్రీక్వెన్సీని ఉత్పత్తి చేస్తాయి. ఆ సౌండ్ మనకు వినిపించదు. కానీ దోమలను తరిమికొట్టేందుకు ఉపయోగపడుతుంది.

ఇవి నిజంగా దోమలను తరిమికొట్టగలవా..?

ఈ యాప్స్ నిజంగా దోమలను తరిమికొట్టగలవా అంటే అవునని చెప్పడం కష్టం.ఎందుకంటే ఈ యాప్స్‌కి మిక్స్డ్ రివ్యూస్ ఉన్నాయి. కొంతమంది బాగానే పనిచేస్తున్నాయని చెబితే.. అసలు వీటితే ఏ యూజ్ లేదని చెప్పేవారూ ఉన్నారు. గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న ఈ యాప్స్‌ని ప్రయత్నించి చూస్తే అసలు పనిచేస్తాయా లేదా అనేది తెలుసుకోవచ్చు.

Also Read: Optical Illusion: మీ ఐక్యూకి ఇది ఛాలెంజ్.. 30 సెకన్లలో ఈ చిత్రంలో దాగున్న పిల్లిని గుర్తుపట్టండి..

Also Read: Bihar Political Crisis: ఊహించిందే జరిగింది.. ఎన్డీఏకి నితీశ్ గుడ్‌బై.. ఈ సాయంత్రం సీఎం పదవికి రాజీనామా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News