Padi kaushik Reddy: నీకు లజ్జా, మానం ఉందా..?.. దానం నాగేందర్ పై రెచ్చిపోయిన పాడి కౌశిక్ రెడ్డి.. వీడియో వైరల్..

Telangana: పాడికౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దానం నాగేందర్ కు.. దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి  గెలవాలని సవాల్ విసిరారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Written by - Inamdar Paresh | Last Updated : Aug 3, 2024, 04:00 PM IST
  • దానం వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన కౌశిక్ రెడ్డి..
  • దమ్ముంటే ఆ పనిచేయాలంటూ కూడా వ్యాఖ్యలు..
Padi kaushik Reddy: నీకు లజ్జా, మానం ఉందా..?.. దానం నాగేందర్ పై రెచ్చిపోయిన పాడి కౌశిక్ రెడ్డి.. వీడియో వైరల్..

Mla padi Kaushik reddy hot comments on mla danam nagender: తెలంగాణ అసెంబ్లీ సమావేశం చివరిరోజు షాకింగ్ పరిణామం చోటు చేసుకుంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అసెంబ్లీలో నోటికొచ్చినట్లు దురుసగా మాట్లాడారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను.. ఏక వచనంతో మాట్లాడుతూ.. మిమ్మల్ని బైట తిరగ నియ్య బిడ్డా.. తోలు తీస్తానంటూ రెచ్చిపోయారు. దీంతో అసెంబ్లీ కాస్త రసాభాసగా మారిపోయింది. సభలో దానంమాట్లాడిన మాటలపై తీవ్ర దుమారం చెలరేగింది.ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలు వెంటనే దానం నాగేందర్ తన మాటల్ని విత్ డ్రా చేసుకుని క్షమాపణచెప్పాలని కూడా డిమాండ్ చేశారు. ఆ తర్వాత అసెంబ్లీలో స్పీకర్ పొడియం ఎదుట నిరసలను చేపట్టారు. ఏకంగా బీఆర్ఎస్ నేతలంతాతమ నిరసలు తెలియజేశారు.

 

అంతటితో ఆగకుండా.. అసెంబ్లీ నుంచి బైటకు వచ్చేసి.. అమరవీరుల స్థూపం వద్ద తమ నిరసనలు తెలియజేశారు. ఇది కౌరవుల సభ అంటూ కూడా మండిపడ్డారు. ఈనేపథ్యంలో ప్రస్తుతం హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో దానం మాటలకు రివర్స్ లో కౌంటర్ ఇచ్చారు. 

పూర్తి వివరాలు..

దానం నాగేందర్ అసెంబ్లీలో వాడిన భాష పట్ల బీఆర్ఎస్ నేతలు ఖండించారు. ఈ నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. దానం కు సిగ్గు, లజ్జా ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా..బీఆర్ఎస్ గుర్తుమీద గెలిచి , పార్టీమారిండంటూ ఎద్దేవా చేశారు. దమ్ముంటే.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలంటూ కూడా డిమాండ్ చేశారు. దానంకు.. ఎమ్మెల్యే పదవి కేసీఆర్ భిక్ష అని గుర్తుచేశారు. దమ్ముంటే తమ సవాల్ ను స్వీకరించాలంటూ కూడా మాస్ వార్నింగ్ ఇచ్చారు.

Read more: Snake vs Lizard: మానిటర్ బల్లిని కసితీరా కాటు వేసిన నల్ల పాము.. షాకింగ్ వీడియో వైరల్..

ఇదిలా ఉండగా.. ప్రస్తుతం అసెంబ్లీలో దానం నాగేందర్ వాడిన భాషను రాజకీయ పండితులు ఖండిస్తున్నారు. గౌరవ ప్రదమైన సభలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడంఏంటని కూడా ఫైర్ అయ్యారు.  నిన్నటితో (జులై 2) అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ముగిశాయి. అదే విధంగా టీ షర్టు వేసుకుని పౌడర్ కొట్టుకుని తాజ్ కృష్ణలో తిరిగినట్టు, ఇండోర్ గేమ్స్ ఆడినట్టు అనుకుంటున్నట్లు అనుకుంటున్నావా.. అని హెచ్చరించారు. ఎక్కడి రమ్మన్న.. తాము సిద్ధమే అంటూ సవాల్ విసిరారు. ఇక్కడున్నది కేసీఆర్ శిష్యులని ఎవరికి భయపడే ప్రసక్తిలేదంటూ కూడా పాడి కౌశిక్ రెడ్డి ఘాటువ్యాఖ్యలు చేశారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x