Yogi Adityanath playing cricket video goes viral: ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తరచుగా వార్తలలో ఉంటారు. ఇటీవల కాలంలో ఆయనను బుల్డోజన్ బాబా అని కూడా పిలుస్తున్నారు. మెయిన్ గా యూపీని క్రిమినల్స్ లేకుండా చేస్తానని కూడా ఆయన కంకణం కట్టుకున్నట్లు చెప్తుంటారు. ఎక్కడైన వేధింపులకు, అక్రమాలకు పాల్పడితే వెంటనే వారి ఇండ్లపై బుల్డోజర్ లను సైతం దింపేస్తున్నారు. తప్పుచేసిన వాళ్లకు సింహా స్వప్నంగా మారారని చెప్పుకొవచ్చు. గతంలో కొంత మంది ఒక వర్గానికి చెందిన వారు.. హిందువుల యాత్రలపై, దేవుళ్లపై రాళ్లు వేసి శాంతి భద్రతల సమస్య క్రియేట్ చేసేందుకు ప్రయత్నించారు.
#WATCH | Uttar Pradesh CM Yogi Adityanath tries his hands in cricket as he attends 'All India Advocates Cricket Tournament', in Lucknow pic.twitter.com/GFj9vD4xX5
— ANI (@ANI) October 6, 2024
అదే విధంగా అడ్డుకొవడానికి వచ్చిన పోలీసుల మీద కూడా రాళ్లను రువ్వారు. దీంతో యోగీ ఈ ఘటనలపై సీరియస్ అయ్యారు. అల్లరి మూకలకు తనదైన స్టైల్ లో ట్రీట్మెంట్ ఇచ్చారు. అంతేకాకుండా.. వారి ఇళ్లను సైతం బుల్డొజర్ లతో కూల్చేస్తు.. తప్పులు చేయాలని ఆలోచన వస్తే.. బాగుండదంటూ మాస్ వార్నింగ్ సైతం ఇచ్చారు.ఈ నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్ క్రికెట్ ఆడుతూ హల్ చల్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పూర్తి వివరాలు..
ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తాజాగా, లక్నోలోని అటల్ బిహారీ వాజ్ పేయ్ ఎకానా స్టేడియంకు వెళ్లారు. అక్కడ 36వ ఆల్ ఇండియా అడ్వకేట్స్ క్రికెట్ టోర్నమెంట్ లను ప్రారంభించారు. అంతేకాకుండా.. గ్రౌండ్ లో దిగి మరీ బ్యాట్ పట్టి మరీ క్రికెట్ ఆడుతూ హల్ చల్ చేశారు. లాయర్ లు బౌలింగ్ చేస్తుంటే..బ్యాటింగ్ చేస్తు అందరిని ఆశ్చర్యపరిచారు. అంతే కాకుండా.. అక్కడున్న వాళ్లను కూడా ఎంకరేజ్ చేశారు.
ఈ క్రమంలో యోగి క్రికెట్ ఆడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్ లు మాత్రం ఆశ్చర్యపోతున్నారు. మా యోగి బాబా.. క్రికెట్ ఆడగలదు.. క్రిమినల్స్ తో కూడా ఆడుకోగలడంటూ కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు.. ఇటీవల యోగి.. దేశంలోని అతి పిన్న వయస్కుడైన ఫిడే (ప్రపంచ చెస్ సమాఖ్య) రేటింగ్ పొందిన కుషాగ్రా అగర్వాల్‌తో కలిసి చెస్ ఆడారు.
అదే విధంగా..చెస్ ఆటలో పాటించాల్సిన ఎత్తుగడలు, వ్యూహాల గురించి చర్చించుకున్నారు. కుషాగ్ర వచ్చే నెలలో.. ఆరో ఏట అడుగుపెట్టబోతున్న ప్రస్తుతం యూకేజీ విద్యార్థిని. ఆమె అంత చిన్న వయస్సులో.. చెస్ పట్ల ఉన్న టాలెంట్ కు యోగి సైతం నోరెళ్లబెట్టినట్లు తెలుస్తోంది. కుషాగ్రకు యూపీ ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని యోగి హామీ ఇచ్చారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.