PM Modi Rozgar Mela: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రేపే ఉద్యోగ మేళా ప్రారంభించనున్న పీఎం మోదీ

PM Modi Rozgar Mela: దీపావళి కంటే ముందే రోజ్‌గార్ మేళా ప్రకటించి నిరుద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. రోజ్‌గార్ మేళా పేరిట కేంద్రం చేపట్టనున్న ఈ మెగా రిక్రూట్మెంట్ డ్రైవ్‌లో భాగంగా నిరుద్యోగులకు 10 లక్షల ఉద్యోగాలు అందించనున్నట్టు కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. 

Written by - Pavan | Last Updated : Oct 21, 2022, 09:14 PM IST
  • నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం
  • నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో మెగా రిక్రూట్మెంట్ డ్రైవ్
  • ఉద్యోగ మేళా సెలెక్షన్ ప్రాసెస్
PM Modi Rozgar Mela: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రేపే ఉద్యోగ మేళా ప్రారంభించనున్న పీఎం మోదీ

PM Modi Rozgar Mela: కేంద్రం ప్రకటించిన రోజ్‌గార్ మేళా మహత్కార్యానికి రేపు ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టబోతున్నారు. మొదటి దశ రిక్రూట్మెంట్ లో భాగంగా 75 వేల మందికి ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ అందివ్వనున్నారు. 

నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో కేంద్రం చేపడుతున్న ఈ మెగా రిక్రూట్మెంట్ డ్రైవ్‌ ద్వారా కేంద్ర ప్రభుత్వంలోని సుమారు 38 మంత్రిత్వ శాఖలు, ఇతర విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. 

ఉద్యోగ మేళా సెలెక్షన్ ప్రాసెస్
రోజ్‌గార్ మేళా పేరిట కేంద్రం చేపడుతున్న ఈ మెగా రిక్రూట్మెంట్ డ్రైవ్‌లో వివిధ శాఖలు, విభాగాల్లోని ఖాళీలను ఆయా శాఖల ద్వారా లేదా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ లేదా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ వంటి రిక్రూట్మెంట్ ఏజెన్సీల ద్వారా భర్తీ చేయనున్నారు. ఏయే శాఖలో, విభాగంలో ఏయే పోస్టులు, ఎన్ని సంఖ్యలో ఖాళీలు ఉన్నాయనే వివరాలను ఆయా శాఖలు, విభాగాల అధికారిక వెబ్ సైట్లో పొందుపర్చనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు అన్ని శాఖలు, విభాగాల్లోని సంబంధిత ఉన్నతాధికారులు ప్రభుత్వం మంజూరు చేసిన ఖాళీలను భర్తీ చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.

అందుతున్న ప్రాథమిక సమాచారం ప్రకారం సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్స్ పర్సనెల్, సబ్ ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్, ఎల్డీసీ, స్టెనో, పీఏ, ఇన్‌కమ్ ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్స్, ఎంటీఎస్‌తో పాటు ఇతర ఖాళీలు కేంద్రం భర్తీ చేయనున్న ఉద్యోగాల జాబితాలో ఉన్నట్టు తెలుస్తోంది. భర్తీ చేయనున్న ఖాళీల కేడర్ విషయానికొస్తే.. గ్రూప్ ఏ, గ్రూప్ బి ( గెజిటెడ్ ), గ్రూప్ బి ( నాన్ - గెజిటెడ్ ), గ్రూప్ సి లెవెల్స్ ఉన్నాయి. మరిన్ని వివరాలతో పూర్తి కథనం త్వరలోనే అప్‌డేట్ అవుతుంది.

Also Read : Indian Army helicopter Crash: అరుణాచల్ ప్రదేశ్‌లో కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్

Also Read : Punjab DA Hike: 'దీపావళి' ధమాకా ఆఫర్‌.. ప్రభుత్వ ఉద్యోగులకు 6 శాతం డీఏ!

Also Read : Pune: పూణెలో విషాదం.. సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తూ ముగ్గురు కార్మికులు మృతి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. 

Trending News