SLBC Tunnel: టన్నెల్‌ చివరి వరకు వెళ్లిన ఆర్మీ రెస్క్యూ టీమ్‌.. 'ఆ 8 మంది చనిపోయి ఉంటారు'..

SLBC Tunnel Big Update: శ్రీశైలం టన్నెల్లో చిక్కుకున్న 8 మంది కార్మికుల ప్రాణాలపై ఆశలు వదులుకున్నారు అధికారులు. అయితే టీబీఎం మిషన్ చుట్టూ బురద కురుకుపోవడంతో వాళ్లు చనిపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. నిన్న ఆర్మీ రెస్క్యూ టీమ్‌ టన్నెల్‌ చివరి వరకు వెళ్లి చూడగా ప్రమాద స్థలంలో మట్టి, బురద తప్ప మనుషుల జాడ ఎక్కడా కనిపించలేదు. ఈ నేపథ్యంలో వారు ఇప్పటికే చనిపోయి ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. 

Written by - Renuka Godugu | Last Updated : Feb 27, 2025, 06:55 AM IST
SLBC Tunnel: టన్నెల్‌ చివరి వరకు వెళ్లిన ఆర్మీ రెస్క్యూ టీమ్‌.. 'ఆ 8 మంది చనిపోయి ఉంటారు'..

SLBC Tunnel Big Update: శనివారం 8 మంది కార్మికులు SLBC టన్నెల్‌లో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. ఉదయం 8 గంటల సమయంలో ప్రాజెక్టు పనుల్లో భాగంగా వారు టన్నెల్లో పనులు చేపడుతుండగా ఒక్కసారిగా టన్నెల్‌ పైభాగం కుప్పకూలడంతో ఎనిమిది మంది కార్మికులు అక్కడికక్కడే చిక్కుకున్నారు.. అయితే ఇన్ని రోజులుగా వారి జాడ మాత్రం తెలియలేదు. ఫోన్ సిగ్నల్స్ కూడా అందటం లేదు. ఇప్పటికే ఎస్డీఆర్‌ఎఫ్‌, ఎన్డీఆర్‌ఎఫ్‌ తో పాటు ర్యాట్‌ హోల్‌ మైనర్స్‌, స్నీప్పర్‌ డాగ్స్‌ సహాయం తీసుకుని కూడా ప్రయత్నాలు చేశారు.. అయినా ఆ కార్మికుల జాడ కనిపెట్టలేకపోతున్నారు.

ఎన్ని బృందాలుగా వెళ్లిన చివరి వరకు చేరుకోలేక పోయారు. అయితే నిన్న మాత్రం ఆర్మీ రెస్క్యూ టీమ్‌  టన్నెల్‌ చివర వరకు వెళ్లి చూడగా ప్రమాద స్థలంలో మట్టి, బురద తప్ప మనుషుల జాడ కనిపించలేదు.. అక్కడ అత్యంత భయానక పరిస్థితులు ఉన్నట్లు తెలిపారు. శిథిలాలు తొలగిస్తే టన్నెల్‌ మళ్లీ కుప్పకూలే ప్రమాదం ఉందని కూడా అంచనా వేస్తున్నారు.

ఘటన జరిగిన సమయం నుంచి హైడ్రా కమిషనర్ రంగనాథ్‌తోపాటు ప్రముఖులు అంత అక్కడే మకాం వేసుకొని ఉన్నారు. ఎలాగైనా కార్మికులను ప్రాణాలు కాపాడాలని శాయశక్తుల ప్రయత్నిస్తూనే ఉన్నారు.. ఈ నేపథ్యంలో ఎన్డీఆర్‌ఎఫ్, స్నీప్పర్ డాగ్, ర్యాట్‌ హోల్ మైనర్స్‌ సహాయంతో కూడా తీవ్ర ప్రయత్నాలు చేశారు. కుదరకపోవడంతో ఆర్మీని రంగంలోకి దించారు. ఆర్మీ రెస్క్యూ టీం నిన్న టన్నెల్‌ చివరి వరకు వెళ్లగలిగింది. ఇక రిస్క్యూ పనులు మరింత వేగవంతం చేశామని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి నిన్న మీడియా సమావేశంలో తెలిపారు. 200 మీటర్ల మేరకు మట్టి, నీరు కలిసి బురద పేరుకుపోవడంతో కార్మికులను బయటకు తీయడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. పూర్తిస్థాయిలో నీటిని కూడా తీసివేసే పనుల్లో ఉన్నారు. టన్నెల్‌లో చిక్కుకుపోయిన వారిని కాపాడటమే లక్ష్యంగా ప్రభుత్వం ఉందని అన్నారు. భారీగా నీరు బురద నిలిచిపోవడంతో వారిని కాపాడలేక ఇబ్బంది అడ్డంకులు వస్తున్నాయన్నారు 

ఇదీ చదవండి: Anjeer: అంజీర్‌ పండును 2 ఇలా వాడితే.. ఏ పార్లర్‌కు వెళ్లాల్సిన పనిలేదు..

SLBC టన్నెల్ ద్వారా నల్గొండ ఆ చుట్టుపక్కల ఉన్న జిల్లాలకు తాగు, సాగునీటిని అందించే క్రమంలో ప్రాజెక్టులు చేపట్టారు. ఇక ప్రమాదం  సమయంలో టన్నెల్‌లో ఉన్న కార్మికులు ఎక్కువ శాతం ఇతర రాష్ట్రాలకు చెందినవారుగా గుర్తించారు. 

ఇదీ చదవండి: పాడవ్వకూడదని అల్లం వెల్లులి పేస్ట్ ఫ్రిజ్‌లో స్టోర్‌ చేస్తున్నారా? ఇవి తెలుసుకోండి..

శనివారం ఉదయం టన్నెల్లోకి వెళ్లిన కార్మికులు మిషన్ ఆన్ చేయడంతో నీరు భారీగా లీక్ కావడంతో మట్టి కుంగింది. ఆపరేటర్ ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టడంతో మరింత మంది కార్మికులను బయటికి అప్రమత్తమై పంపించేశారు. ప్రమాదం జరిగిన వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి పరిస్థితి ఆరా తీశారు. పూర్తిస్థాయిలో సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎప్పటికప్పుడు పరిస్థితులను ఆరా తీస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఉత్తంకుమార్ రెడ్డి SLBC వద్దకు చేరుకున్నారు. దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఇక టన్నెల్‌లో 14వ కిలోమీటర్ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News