Jio: క్రికెట్‌ లవర్స్‌కు జియో బంపర్‌ ఆఫర్.. ఈ ప్లాన్‌తో హాట్‌స్టార్‌ కూడా ఉచితం..

Jio Hotstar: క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్ చాంపియన్స్ ట్రోఫీ వీక్షించాలనుకునే వారికి జియో కొత్త సరికొత్త రీఛార్జ్ ప్యాక్ అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో జియో హాట్‌స్టార్‌ కూడా ఉచితంగా పొందుతారు. దీంతో అదనపు ఖర్చు లేకుండా ఉచితంగానే వీక్షించవచ్చు. ఈ ప్లాన్ పూర్తి వివరాలు తెలుసుకుందాం..
 

1 /6

జియో ఇటీవల ప్రీపెయిడ్ కొత్త రీఛార్జ్ ప్లాన్ అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో ఐసిసి మెన్స్ ఛాంపియన్ ట్రోఫీని కూడా వీక్షించవచ్చు.. ఇందులో కాంప్లిమెంటరీ యాక్సెస్‌ జియో హాట్‌స్టార్‌ ఉచితంగా పొందుతారు. జియో సినిమా ఇటీవల డిస్నీ హాట్ స్టార్ రెండు కలిసి జియో హాట్ స్టార్ గా ఏర్పడింది.  

2 /6

 ఈ నేపథ్యంలో లైవ్ మ్యాచ్ లు, టోర్నమెంట్స్, సినిమాలు, టెలివిజన్ సిరీస్, కొన్ని డాక్యుమెంటరీ, స్పోర్ట్స్ ఈవెంట్ కి సంబంధించినవి జియో హాట్‌స్టార్‌ టెలికాస్ట్ చేస్తుంది. అంతే కాకుండా ఇది అదనంగా ఈ ప్యాక్‌లో క్రికెట్ డేటా ప్యాక్ కూడా యాడ్ చేసింది  

3 /6

జియో రూ. 195 ప్లాన్.. జియో హాట్‌స్టార్‌ రీఛార్జ్ చేసుకోవాలంటే ఒక్క నెల ప్లాన్ నుంచి ఏడాది ప్లాన్ వరకు అందుబాటులో ఉంది. వీటితోపాటు జియో సబ్స్క్రైబర్లు కాంప్లిమెంటరీ సబ్స్ క్రిప్షన్ కూడా పొందుతారు. జీయో రూ. 195 వ్యాలిడిటీ ప్లాన్ తో రీచార్జ్ చేసుకుంటే జియో హాట్‌స్టార్‌ 90 రోజులపాటు అదనంగా ఖర్చు లేకుండా ఉచితంగా పొందుతారు.

4 /6

ఈ ప్యాక్ లో 15 జీబీ హైట్ స్పీడ్ ఇంటర్నెట్ డేటా కూడా పూర్తిగా ఉచితం. డేటా పూర్తి అయిన తర్వాత 64 కేబిపిఎస్ డేటా వస్తుంది. అయితే ఈ ప్లాన్ కేవలం యాడ్‌ ఆన్ ప్యాక్ మాత్రమే. అంటే ఇప్పటికే ఉన్న బేస్ ప్లాన్ కి ఇది యాడ్ చేసుకోవాలి. అప్పుడే ఈ పూర్తి బెనిఫిట్స్ పొందుతారు  

5 /6

మీ బేసిక్ ప్లాన్‌కు రూ. 149 రీఛార్జ్ చేసుకుంటే కూడా ఈ జియో హాట్‌స్టార్‌ ప్రీమియం సబ్స్క్రిప్షన్ వీక్షించే అవకాశం ఉంది.  ఇది కేవలం మొబైల్ డివైస్ మాత్రమే వర్తిస్తుంది. అయితే జియో హాట్‌స్టార్‌ సబ్‌స్క్రైబ్‌ చేసుకోవాలంటే నెలవారీ ప్రీమియం రూ. 299 నుంచి ప్రారంభం కాక ఏడాదికి రూ. 1499.  

6 /6

జియో ఈ ప్లాన్స్ మాత్రమే కాదు రూ.949 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో అపరిమిత వాయిస్ కాల్స్, ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్‌లు కూడా ఉచితం. జియో అందిస్తున్న మరో రూ.195 ప్లాన్ కేవలం 2gb డేటా హై స్పీడ్ 5జి డేటా పొందుతారు. దీంట్లో కూడా జియో హాట్‌స్టార్‌  సబ్స్క్రిప్షన్ ఉంది.