America Gold Card Visa: అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోగానే డోనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. జన్మత పౌరసత్వం రద్దుతో సంచలనం రేపిన ట్రంప్ ఇప్పుడు అమెరికా పౌరసత్వాన్ని అమ్మకానికి పెట్టారు. కొత్తగా గోల్డ్ కార్డ్ వీసా ప్రవేశపెట్టారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
డోనాల్డ్ ట్రంప్ కొత్తగా తీసుకొస్తున్న గోల్డ్ కార్డ్ వీసా అనేది ఆ దేశపు పౌరసత్వం. ఇది పూర్తిగా అంగట్లో వస్తువు ఇప్పుడు. పెట్టుబడిదారుల పౌరసత్వం ఇది. 5 మిలియన్ డాలర్లు చెల్లిస్తే చాలు గోల్డ్ కార్డ్ వీసా ఇచ్చేస్తారు. 5 మిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీ ప్రకారం 44 కోట్ల రూపాయలు. దాదాపు 35 ఏళ్ల క్రితం అమెరికాలో ప్రవేశపెట్టిన EB-5 వీసా విధానానికి ప్రత్యామ్నాయంగా ఈ గోల్డ్ కార్డ్ వీసా తీసుకొస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు. ఇలా 44 కోట్లు చెల్లించి గోల్డ్ కార్డ్ వీసా తీసుకున్న వ్యక్తులు ఇక్కడే ఇంకా సంపాదించి అమెరికా ప్రభుత్వానికి పన్నులు చెల్లించే అవకాశం ఉందనేది ట్రంప్ వాదన. ఈ తరహా పౌరసత్వం వల్ల ధనవంతులు అమెరికాకు వస్తారనేది ఆయన ఆలోచనగా ఉంది. ఈ కార్డుకు సంబంధించిన పూర్తి వివరాలు, నిబంధనలు త్వరలో వెల్లడి కానున్నాయి. ఈ తరహా కార్డుల్ని ప్రపంచవ్యాప్తంగా యూకే, గ్రీస్, మాల్దా, ఆస్ట్రేలియా, కెనడా, ఇటలీ దేశాలు మంజూరు చేస్తున్నాయి.
ఇప్పటి వరకు EB-5 వీసా అమల్లో ఉంది. ఈ విధానాన్ని 1990లో ప్రవేశపెట్టారు. 2021 సెప్టెంబర్ నుంచి 2022 సెప్టెంబర్ మధ్యకాలంలో 8 వేల మంది ఈ వీసాలు పొందారు. ఈ విధానంలో పెట్టుబడిదారులు ఎవరైనా నాన్ టార్గెటెడ్ ఎంప్లాయ్‌మెంట్ ఏరియా ప్రాజెక్టులో 1.8 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెడితే శాశ్వత నివాసితులు కావచ్చు. అంటే అమెరికా ప్రభుత్వానికి చెల్లించాల్సిన అవసరం లేదు. సంబంధిత వ్యాపారంలో పెట్టుబడి పెట్టి అందులో 10 ఉద్యోగాలు అమెరికన్లకు ఇస్తే సరిపోతుంది.
కానీ ఇప్పుడు ట్రంప్ ప్రవేశపెట్టిన కొత్త గోల్డ్ కార్డ్ వీసా విధానంలో పౌరసత్వం నేరుగా అమ్మకానికి పెట్టేసినట్టే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతుల కంటే ధనవంతులకు ఎక్కువ మేలు జరుగుతుంది. ఈ విధానం వల్ల అమెరికాకు పెట్టుబడులు వస్తాయో లేవో చెప్పలేం కానీ బాగా డబ్బుండి అమెరికాలో సెటిల్ కావాలనుకునేవారికి ప్రయోజనం కలుగుతుంది. ఎందుకంటే అమెరికా ప్రభుత్వానికి 44 కోట్లు చెల్లిస్తే చాలు. అందుకే అమ్మకానికి అమెరికా పౌరసత్వం ట్రెండ్ అవుతోంది.
Also read: 7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హోలీ నజరానా, డీఏ ప్రకటన ఎంత పెరుగుతుంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి