Dearness Allowance: ప్రభుత్వ ఉద్యోగులకు జాక్‌పాట్.. 7 శాతం కరువు భత్యం పెంపు

Big Jackpot To Employees 7 Percent Dearness Allowance Hike: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త లభించింది. కొన్నాళ్లుగా ఎదురుచూస్తున్న కరువు భత్యం (డియర్‌నెస్‌ అలవెన్స్‌) భారీగా పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. డీఏ భారీగా పెంచడంతో వేతనాలు కూడా భారీగా పెరగనున్నాయి. ఆ వార్త విశేషాలు ఇలా ఉన్నాయి.

1 /6

ప్రభుత్వ ఉద్యోగులకు జార్ఖండ్ ప్రభుత్వం కరువు భత్యం (డియర్‌నెస్‌ అలవెన్స్‌) భారీగా పెంచేసింది. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. డీఏలో 7 శాతం పెంపును మంజూరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం విశేషం.

2 /6

డీఏ పెరుగుదల 2024 సంవత్సరం జూలై 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుంది. ఈ మేరకు మంత్రివర్గ సమావేశం అనంతరం జార్ఖండ్‌ మంత్రి కీలక ప్రకటన చేశారు. 

3 /6

మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం.. ఆరో వేతన సంఘం ప్రకారం ఉద్యోగులు ప్రస్తుత మూల వేతనంలో 246 శాతం కరువు భత్యం పొందుతారు. గత డీఏ కన్నా 239 శాతం నుంచి పెరుగుదల. 

4 /6

అదనంగా ఆరో వేతన సంఘం కింద పెన్షనర్లకు డియర్‌నెస్ అలవెన్స్ (డీఆర్) పరిహారం కూడా ఏడు శాతం పెరగడం విశేషం. గతంలో 239 శాతం నుంచి 246 శాతానికి పెరిగింది.

5 /6

ఐదో వేతన సంఘం కింద ప్రభుత్వ ఉద్యోగుల డీఏను జూలై 1 2024 నుంచి 443 శాతం నుంచి 455 శాతం వరకు నిర్ణయించినట్లు జార్ఖండ్‌ ప్రభుత్వ ప్రతినిధి వెల్లడించారు.

6 /6

డీఏ పెంపుతో పాటు మొత్తం 12 ప్రతిపాదనలను అక్కడి మంత్రివర్గం ఆమోదించింది. మహిళా కార్మికులు తమ అంగీకారంతో కర్మాగారాల్లో రాత్రి షిఫ్టులలో పని చేయడానికి అవకాశం కల్పించింది. సాయంత్రం 7 నుంచి ఉదయం 6 గంటల వరకు మహిళలు రాత్రివేళ్ల పని చేయడానికి అవకాశం దక్కింది.