7th Pay Commission: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి రాయితీ, ఇన్సెంటివ్ ప్యాకేజ్ మరో మూడేళ్లు పొడిగించడమైంది. ముఖ్యంగా కాశ్మీర్ లోయలో పనిచేసే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కీలకమైన అప్‌డేట్ ఇది. ఈ ఇన్సెంటివ్ ఎవరెవరికి వర్తిస్తుంది, ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యంగా కాశ్మీర్ లోయ ప్రాంతంలో పనిచేసేవారికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రాయితీతో కూడిన ప్యాకేజ్ అందిస్తోంది. ఈ ప్యాకేజ్‌ను గత ఏడాది 2024 ఆగస్టు 1న మరో మూడేళ్లకు పొడిగించింది. ఈ ప్యాకేజ్ అన్ని మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలకు వర్తిస్తుంది. ఈ లోయలో భాగంగా అనంత్ నాగ్, బారాముల్లా, బుడ్గాం, కుప్వారా పుల్వామా, శ్రీనగర్, కుల్గామ్, సోపియాన్, గందేర్బల్, బందిపోరాలో పనిచేసే ఉద్యోగులకు వర్తిస్తుంది. ఈ ప్యాకేజ్ ప్రకారం ఉద్యోగులు తమ కుటుంబసభ్యుల్ని ప్రభుత్వ ఖర్చులపై ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. దీనికి సంబంధించి 80 శాతం టీఏ కూడా అందుతుంది. ఒకవేళ కుటుంబసభ్యుల్ని తీసుకెళ్లకపోతే రోజుకు 141 రూపాయల చొప్పున ప్రత్యేక అలవెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు.
అదే విధంగా లోయలో ఉండే పెన్షనర్లకు సైతం ప్రయోజనం కలగనుంది. ప్రభుత్వ బ్యాంకులు లేదా ఆఫీసుల నుంచి నెలలవారీ పెన్షన్ పొందలేనివారికి వ్యాలీకు బయట అందించనున్నారు.
Also read: Dearness Allowance: ప్రభుత్వ ఉద్యోగులకు జాక్‌పాట్.. 7 శాతం కరువు భత్యం పెంపు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి