Gold Rate Today: దేశంలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో గత కొంతకాలంగా బంగారం ధరలు విపరీతంగా పెరిగిన విషయం తెలిసిందే. సంక్షోభ సమయంలో సురక్షిత పెట్టుబడి సాధనంగా ఉన్న బంగారంపై పెట్టుబడులు పెరిగాయి. ఈ క్రమంలోనే ధరలు కూడా అలాగే పెరిగాయి. ఇటీవల ఫిబ్రవరి 25న బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్టాలను తాకాయి. అయితే అక్కడి నుంచి ప్రస్తుతం స్వల్పంగా దిగివచ్చాయి. దేశీయంగా అలాగే అంతర్జాతీయ మార్కెట్లోనూ పసిడి ధరలు తగ్గాయని చెప్పవచ్చు. నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం
అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర ప్రస్తుతం ఔన్సుకు 2916 డాలర్ల లెవల్స్ లో ట్రేడ్ అవుతోంది. కిందటి సెషన్లోనే భారీగా దిగివచ్చింది. నేడు స్వల్పంగా తగ్గింది. దానికి ముందు ఏకంగా 2960 డాలర్ల స్థాయిలో ఆల్ టైమ్ గరిష్టాలను తాకింది. ఇక స్పాట్ సిల్వర్ ధర చూసినట్లయితే ప్రస్తుత 31.92 డాలర్ల దగ్గర కొనసాగుతోంది. డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ మళ్లీ క్షీణించింది. ప్రస్తుతం రూ. 87. 20దగ్గర ఉంది.
Also Read: Weight loss: మీ వంటగదిలో ఈ 3 వస్తువులు ఉంటే చాలు..మీ ఒంట్లో కొవ్వును ఈజీగా కరిగించుకోవచ్చు
దేశీయంగా బంగారం ధరలు పరిశీలించినట్లయితే ప్రస్తుతం హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 250 తగ్గింది. దీంతో ఇప్పుడు తులం రూ. 80,500 మార్కు దగ్గర ట్రేడ్ అవుతోంది. దీనికి ముందు రోజు ఇది రూ. 80, 750 దగ్గర ఉండేది. ఇదే సమయంలో 24క్యారెట్ల బంగారం ధర రూ. 270 పతనంతో 10 గ్రాములకు రూ. 87, 820 దగ్గర ఉంది. ఇక్కడ కూడా ముందు రోజు రూ. 220 పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారెట్ల బంగారం ధర తులం రూ. 80, 650 వద్ద ఉంది. 24క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర 10 గ్రాములకు రూ. 87, 970 దగ్గర కొనసాగుతోంది.
బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి రేట్లు మాత్రం భారీగా పడిపోయాయి. ఢిల్లీలో ఒక్కరోజే రూ. 3000 తగ్గింది. ఇప్పుడు కిలో వెండి రూ. 98వేలకు దిగివచ్చింది. హైదరాబాద్ లో రూ. 2వేలు తగ్గడంతో 1.06లక్షల వద్ద కొనసాగుతోంది.
Also Read: Viral Video: ఇదెక్కడి వింత భయ్యా.. భోజన ప్లేట్ల కోసం ప్రపంచ వేదిక పై తన్నుకున్నారుగా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook