BJP Leader Blood Letter: ముఖ్యమంత్రికి రక్తంతో లేఖ రాసిన బీజేపీ నాయకుడు.. నెట్టింట వైరల్

BJP Leader Blood Letter to CM Yogi Adityanath: ఆయనకు అధికారుల తీరుపై కోపం వచ్చింది. ఎన్నిసార్లు వాళ్ల చుట్టు తిరిగినా పట్టించుకోకపోవడంతో రక్తంతో ఏకంగా ముఖ్యమంత్రికి లేఖ రాశారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 14, 2022, 05:04 PM IST
BJP Leader Blood Letter: ముఖ్యమంత్రికి రక్తంతో లేఖ రాసిన బీజేపీ నాయకుడు.. నెట్టింట వైరల్

BJP Leader Blood Letter to CM Yogi Adityanath: యూపీ ప్రభుత్వం జీరో టాలరెన్స్‌పై పనిచేస్తుంటే.. మరోవైపు అధికారుల్లో రోజురోజుకు అవినీతి పెరిగిపోతుందని విమర్శలు వస్తున్నాయి. బీజేపీ నాయకులు, ఇతర పార్టీల ప్రజాప్రతినిధులు పలుమార్లు హెచ్చరించినా అధికారుల తీరులో మార్పు రావడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై బహ్రైచ్‌కు చెందిన ఓ బీజేపీ నేత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు అధికారులపై ఫిర్యాదు చేస్తూ తన రక్తంతో లేఖ రాయడం సంచలనంగా మారింది.

సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు బీజేపీ వెనుకబడిన తరగతుల జిల్లా ఉపాధ్యక్షుడు, నగర్ పాలికా బహ్రైచ్ సభ్యుడు సంజయ్ జైస్వాల్ తన సొంత రక్తంతో ఫిర్యాదు లేఖ రాశారు. తన లేఖలో పరిపాలనపై తీవ్ర ఆరోపణలు చేశారు. మునిసిపల్ ఎన్నికలకు ముందు సీటు డీలిమిటేషన్‌లో పెద్ద ఎత్తున రిగ్గింగ్ జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం గురించి ఆయన అనేకసార్లు పరిపాలనా అధికారులను కలిశారు. కానీ అతని మాటను అధికారులు ఎవరూ పట్టించుకోలేదు.

దీంతో ఈ విషయమై సంజయ్ జైస్వాల్ తన రక్తంతో ముఖ్యమంత్రికి ఫిర్యాదు లేఖ రాశారు. అంతేకాదు తనకు తనకు న్యాయం చేయకుంటే తన చేతి నరం కోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించారు. అడ్మినిస్ట్రేటివ్ అధికారి అవినీతికి పాల్పడుతున్నారని.. అధికారులు తమ మాట వినడానికి కూడా సిద్ధంగా లేరన్నారు. 

భారతీయ జనతా పార్టీ తన సొంత ప్రభుత్వంలో రిగ్గింగ్‌కు వ్యతిరేకంగా ప్లకార్డులతో వీధుల్లోకి రావాల్సి ఉంటుందని సంజయ్ అన్నారు. 'అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్, ఈవో అవినీతికి పాల్పడుతున్నారని రక్తంతో లేఖ రాశాను. ఇప్పుడు ఒకటి లేదా రెండు రోజుల్లో నేను EO కార్యాలయానికి వెళ్లి నా నరం కట్ చేసుకుని వెనుకబడిన ప్రజల రక్తం అంత చెడ్డది కాదని అధికారులకు చూపిస్తాను. రెండు లక్షల రూపాయలు తీసుకుని వెనుకబడిన తరగతుల వార్డును జనరల్ సీటు చేసే ప్రయత్నం చేశారు. 

ఇది చాలా పెద్ద కుట్ర. మా వార్డులో కౌన్సిలర్లు కూడా రెండు లక్షల రూపాయలు ఇచ్చి సీటు నార్మల్‌గా మార్చుకుని ఎస్పీ ఆఫీస్ బేరర్లకు లబ్ధి చేకూర్చేందుకు ఈ పని చేశారు. నేను జిల్లా మేజిస్ట్రేట్ వద్దకు వెళ్లి నా ఫిర్యాదు లేఖ ఇచ్చాను. ఆ ఫిర్యాదు లేఖపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దానికి కారణం చెప్పాలి. ఈ విషయంలో నాకు ఎక్కడా కూడా న్యాయం జరగడం లేదు..' అంటూ ఆయన తన మనసులో బాధను వ్యక్తపరిచారు.

Also Read: T20 World Cup: టీ20 వరల్డ్ కప్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన టాప్-5 బాట్స్‌మెన్‌.. భారత్ నుంచి అతనొక్కడే..!  

Also Read: Komatireddy Rajagopal Reddy: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అరెస్ట్.. మునుగోడులో తీవ్ర ఉద్రిక్తం  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News