Daaku Maharaaj OTT Date: బాలయ్య అభిమానులకు పండగ, డాకు మహారాజ్ ఓటీటీ తేదీ ఫిక్స్, ఎప్పుడంటే

Daaku Maharaaj OTT Release Date: ఓటీటీ ప్రేమికులకు ముఖ్యంగా బాలయ్య అభిమానులకు సందడి కల్గించే వార్త. బాలయ్య నటించిన సూపర్ హిట్ సినిమా డాకూ మహారాజ్ ఓటీటీలో వచ్చేస్తోంది. డేట్ ఫిక్స్ అయింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 16, 2025, 02:21 PM IST
Daaku Maharaaj OTT Date: బాలయ్య అభిమానులకు పండగ, డాకు మహారాజ్ ఓటీటీ తేదీ ఫిక్స్, ఎప్పుడంటే

Daaku Maharaaj OTT Release Date: బాలకృష్ణ అభిమానులకు గుడ్‌న్యూస్. సంక్రాంతికి విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న డాకూ మహారాజ్ ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ ఖరారైంది. ఏ ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్ కానుందో చూద్దాం.

నందమూరి బాలకృష్ణ హీరోగా కొల్లి బాబి తెరకెక్కించిన డాకూ మహారాజ్ సినిమా సంక్రాంతికి విడుదలైంది. సంక్రాంతికి విడుదలైన మూడు సినిమాల్లో ఇదొకటి. వెంకటేశ్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టగా రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ బోల్తా పడింది. ఇక బాలయ్య నటించిన డాకూ మహారాజ్ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. గేమ్ ఛేంజర్ అప్పుడే ఓటీటీలో వచ్చి వారం రోజులు అవుతోంది. ఈలోగా డాకూ మహారాజ్ డిజిటల్ హక్కుల్ని సొంతం చేసుకున్న ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. ఫిబ్రవరి 21  నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుందని తెలిపింది. అనగనగా ఒక రాజు..చెడ్డవాళ్లు అందరూ డాగు అనేవాళ్లు. కానీ మాకు మాత్రం మహారాజు అంటూ క్యాప్షన్ ఇచ్చింది. డాకూ మహారాజ్ తెలుగుతో పాటు హిందీ , తమిళం, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

మంచి నీటి కోసం ఇబ్బందులు పడుతున్న ప్రజల బాధల్ని తీర్చేందుకు వెళ్లిన ఓ సివిల్ ఇంజనీర్ కధ ఇది. తాగు నీటి కష్టాలు తీర్చేందుకు వెళ్లిన ఆ ఇంజనీర్‌ను గ్రానైట్ క్వారీలో ప్రజల్ని కూలీలుగా పని చేయించుకుంటున్న ఓ కుటుంబం అడ్డుకుంటుంది. ఈ క్రమంలో గ్రానైట్ ముసుగులో డ్రగ్స్ వ్యాపారం గురించి తెలుసుకుంటాడు. 

కొల్లి బాబి తెరకెక్కించిన ఈ సినిమాకు తమన్ సంగీతం అందించగా బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ నటించింది. ఇక విలన్ పాత్రలో బాబీ డియోల్ మరోసారి జీవించాడు. ఈ సినిమా బాక్సాఫీసులో 100 కోట్లు వసూలు చేసింది. 

Also read: Jio Hotstar Plans: జియో హాట్‌స్టార్ కొత్త యాప్, కొత్త ప్లాన్స్ ఇవీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News