Chiranjeevi: రక్తదాతలకు చిరంజీవి సన్మానం.. భావోద్వేగానికి గురైన మెగాస్టార్..

Chiranjeevi: మెగా స్టార్ చిరంజీవి కేవలం నటుడిగానే కాదు.. తనని ఇంత వాడిని సమాజం కోసం రక్తదానం, నేత్ర దానం వంటి కార్యక్రమాలను చేపట్టడమే కాదు. దాన్ని సజావుగా నిర్వహిస్తూ వస్తున్నారు. సినిమా నటుడిగానే కాదు.. సామాజికంగా చేస్తోన్న సేవలకు గుర్తిస్తూ కేంద్రం ఆయన్ని పద్మభూషణ్, పద్మవిభూషణ్ వంటి అవార్డులతో గౌరవించింది. ఆ సంగతి పక్కన పెడితే.. ఆయన స్థాపించి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ నిరంతరాయంగా ఎంతో మంది ఆపదలో ఉన్న వారిని సహాయం చేస్తోంది. ఈ నేపథ్యంలో బ్లడ్ బ్యాంక్ కు రక్తదానం చేసిన దాతలను చిరు ఘనంగా సత్కరించారు.  

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 9, 2025, 10:15 AM IST
Chiranjeevi: రక్తదాతలకు చిరంజీవి సన్మానం.. భావోద్వేగానికి గురైన మెగాస్టార్..

Chiranjeevi: రక్త దానం, నేత్ర దానం అనేది నా ఒక్కడి వల్ల కాలేదు. అభిమానుల  సంకల్పం వల్లే ఈ కార్యక్రమం  నిరంతరాయంగా నడస్తూనే ఉంది.శనివారం నాడు ఆయన మెగా రక్త దాతలను సత్కరించారు. వారితో కాసేపు సరదాగా మాట్లాడారు. ఛారిటబుల్ ట్రస్ట్ విశిష్టతలు, రక్త దాతల గొప్పదనాన్ని కొనియాడారు. ఈ మేరకు నిర్వహించిన కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ‘నా చిన్ననాటి మిత్రుడు శంకర్ బ్లడ్ బ్యాంక్‌కి సీఈవోగా ఉన్నారు. మరో మిత్రడు సీజేఎస్ నాయుడు సీఎఫ్‌వోగా సేవలు అందిస్తూ వస్తున్నారు. స్వామి నాయుడు అలుపెరగని సైనికుడిలా, జీవితాన్ని  అంకితం చేస్తూ ఈ సంస్థ కోసం పనిచేస్తున్నారు. ఆయనే నా బలం. వీళ్లంతా నా వెన్నుదన్నులా ఉండటం వల్లే ఇలాంటి కార్యక్రమాలు సక్సెస్ ఫుల్ గా రన్ అవుతూనే ఉన్నాయి.  మేము సైతం అన్నట్టుగా నా అభిమానులు, సోదర సోదరీమణులు రక్త దానానికి ముందుకు రావడం ఎంతో గర్వకారణమన్నారు. రేపు మనం ఎక్కడున్నా సరే ఈ సేవా కార్యక్రమం మాత్రం ముందుకు సాగుతూనే ఉంటాయన్నారు. రక్తం పంచిన, రక్తం ఇచ్చిన నా సోదర సోదరీమణుల సహకారంతో ఈ కార్యక్రమం నిరంతరంగా సాగుతూనే ఉంటుందన్నారు.

ప్రతిఫలాన్ని ఆశించి ఏ పనిని కూడా మనం ప్రారంభించకూడదంటారు. దీని పర్యవసానాలు ఏంటి? ఇలా చేస్తే ఏం వస్తుంది? అని ఆలోచించకుండా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాను. రక్తం ఇవ్వడానికి ఒకప్పుడు చాలా భయపడేవాళ్లు. కొంత మంది డబ్బు ఆశ చూపించి రక్తం తీసుకునేవారు. ఇప్పటిలా స్వతాహాగా ముందుకు వచ్చి రక్తం ఇవ్వడం అనేది అప్పట్లో లేదు. సరైన సమయానికి రక్తం అందక ప్రాణాలు పోతోన్నాయని తెలిసి బాధ పడేవాడిని. డెలివరీ టైంలో అధిక రక్తస్రావం జరగడం, తలసేమియా, లుకేమియా, ప్లేట్ లేట్స్ లేక చాలా మంది చనిపోతోన్నారని తెలుసుకున్నాను.

నాకు ఇంత మంది అభిమానులు ఉన్నారు కదా.. వీరంతా యువకులు.. వీరిని సక్రమమైన మార్గంలో పెడితే ఎన్నో అద్భుతాలు చేయొచ్చు కదా అని అనుకున్న ఆలోచన నుంచే పుట్టింది రక్తదాన కార్యక్రమం.  అలాంటి టైంలోనే స్వామి నాయుడుని ఈ కార్యక్రమానికి అంకితం కావాలని కోరాను. రక్తం ఇవ్వమని అభిమానుల్ని కోరితే వారు ఇస్తారా? అని మొదట్లో సందేహపడ్డాను. నాతో ఫోటో దిగాలని, నన్ను కావాలని కోరుకునే వారంతా ముందు రక్తం ఇవ్వండి అని కండీషన్ పెట్టాను. ఆ టైంలో ఉత్సాహవంతమైన యువకులు రక్తం ఇచ్చారు. నాతో ఫోటో దిగారు. ఇది నిరంతరం సాగుతుందా? ఇచ్చిన వాళ్లు మళ్లీ ఇస్తారా? ఆసక్తి చూపిస్తారా? అని అనుకున్నాను. కానీ ఇప్పుడు మీలో కొన్ని పదులు, వందల సార్లు రక్తం ఇచ్చిన వారున్నారు. సేవా కార్యక్రమంలో ఉన్న ఆ మాధుర్యాన్ని మీరంతా అనుభవిస్తున్నారు.  కాబట్టే ఇన్ని సార్లు రక్తాన్ని ఇచ్చారనిపిస్తుంటుంది. నా తరువాత చరణ్ కూడా ఈ సేవా కార్యక్రమాల్ని కొనసాగించాలని అనుకుంటున్నాడు. మంచి చేస్తే తిరిగి మంచే జరుగుతుందని భావిస్తుంటాను.

ఓ సారి నేను అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు వెళ్లాను. అక్కడి నాయకులు ఒకరు నా మీద ఏవేవో మాటలు మాట్లాడారు. అలాంటి మాటలన్నీ నేను పట్టించుకునే వాడ్ని కాదు.  కానీ నన్ను అభిమానించే వాళ్లు అలా ఉండరు కదా. ఓ సారి ఆ నాయుకుడిని ఓ మహిళ చెడమడా తిట్టేశారు. ఎందుకు ఇలా తిట్టింది? అసలు ఆమె ఎవరు అనే విషయాన్ని కనుక్కోమని చెప్పాను. ఆమె నా ఫ్యాన్ కాదని అప్పుడు తెలిసింది. మరి ఎందుకు ఆయన కోసం ఆ నాయకుడిని తిట్టావు అని అడిగితే.. చిరంజీవి గారి వల్లే నా బిడ్డ ప్రాణాలు నిలబడ్డాయి. డెంగ్యూ వచ్చినప్పుడు రక్తం దొరక్క కష్టాలు పడుతుంటే.. వారి వల్లే నా బిడ్డ బతికాడు. ఆయన నాకు దేవుడితో సమానమన్నారు.

ఇదీ చదవండి:   గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!

ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..

అలాంటి వ్యక్తిని పట్టుకుని ఇష్టమొచ్చినట్టు తిడితే కోపం రాదా? అని ఆ మహిళ అన్నారు. మనం చేసిన పుణ్యం ఎక్కడికీ పోదని నాకు అప్పుడు అర్థమైంది. అందుకే పెద్దలు ధర్మో రక్షితి రక్షిత: అంటారు. మన ధర్మం మనం పాటిస్తే, మంచి పనులు చేస్తే అవే తిరిగి వస్తాయి. అందుకే మంచి పనులు చేయండి, పాజిటివ్‌గా ఆలోచించండని అందరికీ చెబుతుంటాను. నన్ను ఎంత మంది తిట్టినా, అకారణంగా ఏమైనా అన్నా కూడా నేను పట్టించుకోనన్నారు. మనసుకుని తీసుకోను. ప్రశాంతంగా ఉంటాను. మీ అందరి సహకారం వల్లే నేను ఇంత చేయగలుగుతున్నాను. రక్తదాతలే దేవుళ్లు. నేను సంధాన కర్తను మాత్రమే. ఈ పుణ్యమంతా కూడా మీదే అని చిరంజీవి మరోసారి తన పెద్దరికాన్ని చాటుకున్నారు. ఈ రోజుల్లో డబ్బును ఆశించకుండా ఎవరు ఏ పనిచేయడం లేదు. అలాంటి సమయంలో  ఫ్రీ సర్వీస్ చేసేందుకు శంకర్, నాయుడు, స్వామి నాయుడు వంటి వారు ముందుకు రావడం గర్వకారణమన్నారు.  వీళ్లందరికీ పేరు పేరునా  కృతజ్ఞతలు తెలియజేస్తన్నాను.

ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News