Ram Charan Unfollow: సినీ పరిశ్రమలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కుటుంబాల మధ్య విబేధాలు కొనసాగుతున్న నేపథ్యంలో హీరో రామ్ చరణ్ చేసిన పని సంచలనం రేపుతోంది. తన బావ మరిది, హీరో అల్లు అర్జున్‌ను అన్‌ఫాలో చేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో కావడంతో సినీ పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కొన్నాళ్లుగా అల్లు వర్సెస్ కొణిదెల కుటుంబం అనే రీతిలో విభేదాలు కొనసాగగా తాజాగా అవి మరింత తీవ్రమయ్యాయని తెలుస్తోంది.
Also Read: Radhika Ambani: డ్యాన్స్‌తో దుమ్మురేపిన రాధికా మర్చంట్.. నెట్టింట్లో వీడియో వైరల్
మెగా, అల్లు కుటుంబాల మధ్య దూరం పెరుగుతోందా? అంటే అవుననే తెలుస్తోంది. ఈ రెండు కుటుంబాల మధ్య కొంతకాలంగా విభేదాలు జరగుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. గతేడాది జరిగిన ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతుగా నిలిచారు. అప్పటి నుంచి మెగా, అల్లు కుటుంబాల మధ్య విబేధాలు ఏర్పడ్డాయి. అప్పటి నుంచి ఆ విభేదాలు కొనసాగుతున్నాయి. ఇటీవల విడుదలైన పుష్ప 2 సినిమాకు, ఆ సినిమా విడుదల తర్వాత అల్లు అర్జున్ కుటుంబం ఎదుర్కొన్న ఇబ్బందులకు మెగా కుటుంబం మద్దతుగా నిలవలేదు. పరిశ్రమ మొత్తం మద్దతుగా నిలిచిన మెగా కాంపౌండ్ ఒక స్టేట్‌మెంట్ రాలేదు. పాజిటివ్‌గా రాకపోయినా పర్లేదు కానీ నెగటివ్‌గా మెగా కుటుంబం నుంచి వచ్చిన నటీనటులు స్పందించారు. అల్లు అర్జున్ మామయ్య, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ 'పుష్ప 2' సినిమాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Also Read: Allu Arjun Mama: హీరో అల్లు అర్జున్‌కు మరో షాక్.. 'మామ' చంద్రశేఖర్ రెడ్డి ఇల్లు కూల్చివేత?
అల్లు అర్జున్ మద్దతు ప్రకటించిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి ఓడిపోవడంతో మెగా అభిమానులకు అల్లు అర్జున్ లక్ష్యంగా మారారు. నిత్యం అల్లు అర్జున్‌ను లక్ష్యంగా చేసుకుని మెగా అభిమానులు ట్రోల్స్, విమర్శలు చేస్తున్నారు. అంతర్గతంగా ఆ కుటుంబాల మధ్య తీవ్రంగా పడడం లేదని చర్చ జరుగుతోంది. అల్లు అర్జున్ నటించిన 'పుష్ప-2' సినిమా సమయంలో కూడా ఆయనకు వ్యతిరేకంగా టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలు, మెగా అభిమానులు మాట్లాడారు.
మెగా కుటుంబానికి క్షమాపణలు చెబితేనే 'పుష్ప-2' సినిమాను ఏపీలో విడుదల చేస్తామని చిరు, పవన్, రామ్ చరణ్ ఫ్యాన్స్ హెచ్చరించిన విషయం తెలిసిందే. వారిని మెగా హీరోలు నియంత్రించలేదు. 'పుష్ప-2' సినిమా పాన్ వరల్డ్ హిట్ కొట్టినప్పటికీ మెగా కాంపౌండ్ నటీనటులు ఎవరూ కూడా స్పందించలేదు. రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ ఎవరూ కూడా అల్లు అర్జున్ అరెస్ట్ గురించి స్పందించలేదు.
ఇలా విబేధాలు కొనసాగుతున్న సమయంలోనే రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' అట్టర్ ఫ్లాప్‌తో మెగా అభిమానులు నిరాశలో ఉన్నారు. ఈ సమయంలో ఆ సినిమా ఘోర పరాజయంపై అల్లు అరవింద్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించడం మెగా అభిమానులకు, ఆ కుటుంబానికి గిట్టలేదు. తమ కుటుంబానికి వ్యతిరేకంగా మారారని నిర్ణయించుకున్న రామ్ చరణ్ తన బావమరిది అల్లు అర్జున్ అన్‌ఫాలో చేశారు. సోషల్ మీడియాలో అల్లు అర్జున్‌ను అన్‌ఫాలో చేయడంతో ఇరు కుటుంబాల మధ్య తీవ్రస్థాయిలో విబేధాలు కొనసాగుతున్నాయని.. ఈ రెండు కుటుంబాలు విడిపోయాయని చర్చ జరుగుతోంది. అయితే రామ్ చరణ్ భార్య ఉపాసన మాత్రం అల్లు అర్జున్‌ను ఫాలో అవుతుండడం గమనార్హం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter