Jr NTR request to Rajamouli: రాజమౌళికి ఎన్టీఆర్ స్పెషల్ రిక్వెస్ట్

దర్శకధీరుడు జక్కన్నకు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ( Jr Ntr ) ఓ స్పెషల్ రిక్వెస్ట్ చేసినట్టు ఫిలింనగర్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అదేంటంటే.. ప్రస్తుతం రాజమౌళి ( SS Rajamouli ) తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీలో తనపై చిత్రీకరిస్తున్న సన్నివేశాలకు సంబంధించిన షూటింగ్ పార్ట్‌ని త్వరగా పూర్తి చేయాల్సిందిగా తారక్ కోరినట్టు టాక్.

Last Updated : Nov 1, 2020, 09:30 PM IST
Jr NTR request to Rajamouli: రాజమౌళికి ఎన్టీఆర్ స్పెషల్ రిక్వెస్ట్

దర్శకధీరుడు జక్కన్నకు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ( Jr Ntr ) ఓ స్పెషల్ రిక్వెస్ట్ చేసినట్టు ఫిలింనగర్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అదేంటంటే.. ప్రస్తుతం రాజమౌళి ( SS Rajamouli ) తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీలో తనపై చిత్రీకరిస్తున్న సన్నివేశాలకు సంబంధించిన షూటింగ్ పార్ట్‌ని త్వరగా పూర్తి చేయాల్సిందిగా తారక్ కోరినట్టు టాక్. ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ ( RRR movie shooting ) పూర్తి కాగానే త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ సినిమా చేయాల్సి ఉంది. ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమా ప్రీ ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉంది. Also read : Bigg Boss Telugu 4: ఆ ముగ్గురు టాప్ 5 కంటెస్టెంట్స్: నోయల్

మరోవైపు వీలు చిక్కినప్పుడల్లా ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ జరుగుతూనే ఉన్నప్పటికీ.. రాజమౌళి సినిమా షూటింగ్ అంటే అది అంత త్వరగా పూర్తయ్యేది కాదనే పేరు ఎలాగూ ఉండనే ఉంది. దీనికితోడు కరోనావైరస్ లాక్ డౌన్ ( Coronavirus ) కారణంగా షూటింగ్ ఇంకొంత ఆలస్యం అవుతూ వచ్చింది. అందుకే వీలైనంత త్వరగా తన షూటింగ్ పార్ట్ పూర్తయ్యేలా చూడాల్సిందిగా తారక్ దర్శకుడు రాజమౌళిని కోరాడట. 

ఇదిలావుంటే, మరోవైపు ఆర్ఆర్ఆర్ సినిమాలో రామరాజు ( Ramaraju in RRR ) పాత్ర పోషిస్తున్న మెగాపవర్ స్టార్ రాంచరణ్ ( Ram Charan ) సైతం చిరంజీవి నటిస్తున్న ఆచార్య మూవీ షూటింగ్‌కి ( Acharya movie shooting ) హాజరు కావాల్సి ఉంది. ఆచార్య మూవీలో రాంచరణ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. చెర్రీ ఆచార్య షూటింగ్‌కి హాజరు కావాల్సి ఉంది కనుక అదే సమయంలో భీమ్ ( Bheem in RRR ) పాత్రపై షూటింగ్ పూర్తి చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. తారక్ ( Tarak ) కోరుకుంటున్నది కూడా అదే కనుక ఒక విధంగా ఇది ఆయనకి కలిసొచ్చే అంశం కానుంది. Also read : Bigg Boss 4 Telugu: అవినాష్, అమ్మ రాజశేఖర్‌లపై ఫైర్ అయిన నోయల్

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x