Case Filed on Registration Department DIG kiran kumar: ఎవరికైన సమస్య వస్తే పోలీసుల దగ్గరకు వెళ్లి తమ ఫిర్యాదులు చేస్తుంటారు. సమాజంలో పోలీసులకు ఉన్నతమైన స్థానం ఉంది. అయితే.. ఇటీవల కొంత మంది ప్రవర్తన పోలీసు శాఖ పరువును బజారున పడేసే విధంగా ఉంటుంది. కొంత మంది ఇలాంటి పనులు చేసిన కూడా.. ఏకంగా డిపార్ట్ మెంట్ అంత ఇలాంటి వారే ఉంటారని చెడ్డపేరు తెచ్చుకుంటుంది. తాజాగా.. ఏపీలో ఒక డీఐపీ బాగోతం ప్రస్తుతం రెండు తెలుగు స్టేట్స్ లలో సంచలనంగా మారింది.
స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో నెల్లూరు డీఐజీగా కిరణ్ కుమార్ పనిచేస్తున్నారు. ఆయన గతంలో ఎల్ ఐసీలో అసిస్టెంట్ మేనేజర్‌గా పని చేస్తున్న అనసూయరాణిని కొన్నేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వారు పోస్టల్ కాలనీలో నివాసం ఉంటున్నారు. అయితే వీరి కాపురం పెళ్లి చేసుకున్న తర్వాత సజావుగానే సాగింది.కానీ క్రమంగా గొడవలు మొదలయ్యాయి. వీరికి పిల్లలు పుట్టకపోవటంతో పాపను దత్తత తీసుకున్నారు.
అదే విధంగా.. కొన్నేళ్లకు..సరోగసీ ద్వారా 2012లో బాబుకు జన్మనిచ్చినట్లు పేర్కొన్నారు. కిరణ్ కొన్నేళ్లుగా వేరే మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకుని తనను మానసికంగా వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్త పెట్టే టార్చర్ భరించలేక.. పది నెలలుగా వేర్వేరుగా ఉంటునట్లు అనసూయ వెల్లడించింది. పాప విదేశాల్లో చదువుకుంటుండగా, బాబు తనతోనే ఉంటున్నాడని ఆమె చెప్పారు.
అయితే.. ఇటీవల భర్త మరీ దారుణంగా ప్రవర్తించడంతో ఆమె అతడ్ని ప్రశ్నించింది. ఏకంగా ఇతర మహిళలతో వీడియో కాల్స్, వాట్సాప్ తో రెచ్చిపోయింది. దీంతో భర్తను నిలదీయగా..తన వద్ద డబ్బులు ఉన్నాయని.. తనిష్టమని కూడా చెప్పాడని ఆమె వాపోయింది. అంతే కాకుండా..తాను పుట్టింటికి వెళ్తానంటూ.. తనను , తన కొడుకును ఇష్టమున్నట్లు కొట్టాడని కూడా మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఏదైన ప్రశ్నిస్తే.. అట్రాసిటీ కేసులు పెడతానని భర్త వేధించేవాడని కూడా మహిళ కన్నీళ్లు పెట్టుంది. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు కిరణ్ కుమార్ పై గుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు.ఈ ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది. దీనిపై పోలీసు ఉన్నతాధికారుల కూడా సైతం.. సదరు అధికారిపై సీరియస్ గా ఉన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter