Sanatana Dharma Parirakshana Yatra: అనారోగ్యానికి గురయిన జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కోలుకున్నారు. కోలుకున్న వెంటనే ఆధ్యాత్మిక యాత్రకు సిద్ధమయ్యారు. నాలుగు రోజుల పాటు పలు ఆలయాలను సందర్శించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆయన షెడ్యూల్ ఖరారైనట్లు జనసేన పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేరళ, తమిళనాడులోని ప్రఖ్యాత ఆలయాలను సందర్శించి 'సనాతన ధర్మ పరిరక్షణ' ఉద్యమాన్ని ఉధృతం చేసే అవకాశం ఉంది. పవన్ కల్యాణ్ చేపట్టనున్న యాత్రలు ఎన్డీయే కూటమికి బద్ధ శత్రువులైన తమిళనాడు, కేరళలో చేపట్టనుండడంతో రాజకీయంగా తీవ్ర సంచలనం రేపే అవకాశం ఉంది.
Also Read: Allu Arjun Mama: హీరో అల్లు అర్జున్‌కు మరో షాక్.. 'మామ' చంద్రశేఖర్ రెడ్డి ఇల్లు కూల్చివేత?
విశ్రాంతి అనంతరం
సనాతన ధర్మ పరిరక్షణకు తాను కృషి చేస్తానని గతంలోనే జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే కొన్ని బహిరంగ సభలు, కొన్ని కార్యక్రమాలు చేపట్టారు. ప్రస్తుతం అనారోగ్యం నుంచి కోలుకుంటున్నారు. కొంత విశ్రాంతి పొందుతున్న పవన్ కల్యాణ్ అనంతరం మళ్లీ సనాతన ధర్మ పరిరక్షణ కోసం నడుం బిగించనున్నారు. ఈ క్రమంలోనే రెండు కీలకమైన రాష్ట్రాల్లో పర్యటించడానికి సిద్ధమయ్యారు.
Also Read: Radish Juice: ముల్లంగిని ఇలా తీసుకుంటే 'కొవ్వు' కొండలా కరిగించేస్తుంది
ప్రఖ్యాత ఆలయాలు
దక్షిణ భారతదేశంలో కీలకమైన కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రఖ్యాత ఆలయాలను సందర్శించనున్నారు. 4 రోజుల పాటు అరుణాచలం, అనంత పద్మనాభ స్వామి, మధుర మీనాక్షి, పరుసరామస్వామి, అగస్థ్య జీవసమాధి కుంభేశ్వర దేవాలయం, స్వామిమలైయ్, తిరుత్తై సుబ్రమణ్యేశ్వరస్వామి, కంచి కామాక్షితో అనంత పద్మనాభ స్వామి తదితర ఆలయాలను సందర్శించనున్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి.
రాజకీయంగా రచ్చ?
ఈనెల 12వ తేదీ నుంచి పవన్ కల్యాణ్ ఆలయాల సందర్శన ఉంటుందని తెలుస్తోంది. 16వ తేదీ వరకు ఆలయాల సందర్శన కొనసాగుతుందని సమాచారం. ఆలయాల సందర్శనతోపాటు కొన్ని బహిరంగ సభల్లో కూడా పాల్గొనే అవకాశం ఉంది. పవన్ కల్యాణ్ చేపట్టిన సనాతన ధర్మ పరిరక్షణ కేరళ, తమిళనాడులో రాజకీయంగా వివాదాస్పదమయ్యేలా ఉంది. పవన్ కల్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణపై తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే పార్టీ వ్యతిరేకించింది. అక్కడి ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ పవన్ కల్యాణ్‌పై విమర్శలు చేశారు. ఇక కేరళలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఉండడంతో పవన్ కల్యాణ్ చేపట్టిన సనాతన ధర్మ పరిరక్షణ యాత్రను వ్యతిరేకించే అవకాశం ఉంది. పవన్ పర్యటనకు వ్యతిరేకంగా అక్కడి పార్టీలు, ప్రజలు నిరసన వ్యక్తం చేసేలా పరిణామాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ చేపట్టిన ఈ యాత్ర రాజకీయంగా సంచలనం రేపుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter