తిరుమల నడక మార్గంలో అడుగడుగునా విరిగిపడిన భారీ వృక్షాలు, కొండ చరియలు..

 Landslides and trees uprooting due to heavy rains in Tirumala: శ్రీవారి మెట్టు (Srivari Mettu) మార్గం మొత్తం ధ్వంసమైంది. బండరాళ్లతో నిండిపోయింది. కొండల్లోని చెత్తాచెదారం, మట్టి మెట్ల మార్గం వద్ద పేరుకుపోయింది. పెద్దపెద్ద కొండరాళ్లు మెట్లపై ఒరిగాయి. శ్రీవారి మెట్టు మధ్యలో కొండచరియలు విరిగి పడటంతో వాటిని తొలగించడం కష్టతరంగా మారింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 19, 2021, 08:45 PM IST
  • తిరుపతి, తిరుమలలో గత రెండు రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలకు అస్తవ్యస్తం
  • మెట్ల మార్గంలో భారీగా విరిగిపడ్డ కొండచరియలు..
  • భక్తులకు అనుమతి రద్దు చేయడంతో తప్పిన ప్రమాదం
  • తిరుమల ఘాట్‌రోడ్డులో ఆవరించిన దట్టమైన పొగమంచు
 తిరుమల నడక మార్గంలో అడుగడుగునా విరిగిపడిన భారీ వృక్షాలు, కొండ చరియలు..

Heavy rains lash Tirupati Landslides and trees uprooting due to heavy rains in Tirumala: భారీ వర్షాల కారణంగా కొండ చరియలు విరిగిపడటంతో తిరుమల వెళ్లే ఘాట్ రోడ్లను టీటీడీ మూసివేసింది. అలాగే దట్టమైన పొగ మంచు కూడా ఘాట్ రోడ్లపై అలుముకోవడంతో రోడ్లను బంద్ చేశారు. ఘాట్ రోడ్‌లో భక్తులకు అనుమతి ఎప్పుడు ఇస్తారనే విషయం టీటీడీ (TTD) ఇంకా తెలపలేదు. ఘాట్ రోడ్డులో (Ghat Road) అనేక ప్రాంతాలలో కొండచరియలు పడిపోవడంతో వీటిని తొలగించే పనిలో టీటీడీ అధికారులు నిమగ్నమయ్యారు. 

ఇక తిరుమల నడక మార్గాల్లో భారీ వృక్షాలు, కొండ చరియలు అడుగడుగునా విరిగిపడ్డాయి. ఇక ఆగకుండా పారుతున్న వరద నీటితో తిరుపతి, తిరుమలలో (Tirupati, Tirumala) అన్ని విధాలైన రవాణా వ్యవస్థలు పూర్తిగా నిలిచిపోయాయి. విద్యుత్ సరఫరాకి కూడా తీవ్ర అంతరాయం కలిగింది. ఈ పరిస్థితులను చక్కదిద్దేందుకు మరికొన్ని రోజుల సమయం పడుతుంది.

తిరుమలలో మాడవీధులన్నీ పెద్దపెద్ద చెరువులను తలపిస్తున్నాయి. నడక మార్గాల్లో పెద్ద ఎత్తున చెట్లు కూలిపోవడంతో పాటు కొండచరియలు (Landslides) విరిగిపడుతున్నాయి. అయితే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాలను టీటీడీ మూసేవేసింది. 

Also Read : IND Vs NZ 2nd T20*: ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ LIVE SCORE UPDATES*

శ్రీవారి మెట్టు (Srivari Mettu) మార్గం మొత్తం ధ్వంసమైంది. బండరాళ్లతో నిండిపోయింది. కొండల్లోని చెత్తాచెదారం, మట్టి మెట్ల మార్గం వద్ద పేరుకుపోయింది. పెద్దపెద్ద కొండరాళ్లు మెట్లపై ఒరిగాయి. శ్రీవారి మెట్టు మధ్యలో కొండచరియలు విరిగి పడటంతో వాటిని తొలగించడం కష్టతరంగా మారింది. 

మెట్ల మార్గంలో వరద ఉద్ధృతి కారణంగా మెట్లు అన్నీ పాడయ్యాయి. భక్తులు నడిచి వెళ్ళేందుకు చేసిన ఏర్పాటన్నీ వరదలలో కొట్టుకుపోయాయి. మొత్తానికి శ్రీవారి నడక మార్గంలో భయానక దృశ్యాలు కనిపిస్తున్నాయి. మెట్లపై ఎక్కడికక్కడ కొండచరియలు, చెట్టు కొమ్మలు విరిగిపడ్డాయి. నడక మార్గంలో భక్తులను నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది.

ఇక ఇప్పట్లో శ్రీవారి మెట్టు (Srivari Mettu) మార్గంలో భక్తులకు అనుమతి ఉండకపోవచ్చంటున్నారు అధికారులు. మరమ్మతులకు కనీసం వారం రోజులు సమయం పట్టే అవకాశం ఉంది.

Also Read : చనిపోయిన పిల్ల ఏనుగును లేపేందుకు తల్లి హృదయం పాట్లు.. కన్నీళ్లు తెప్పించే వీడియో

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

 

Trending News