Tirumala: తిరుమలలో తీవ్ర విషాదం.. శ్రీవారిని దర్శించుకుని భార్యాభర్తలు ఆత్మహత్య

Wife And Husband Commits Suicide In Tirumala: పవిత్రమైన తిరుమల కొండపై ఊహించని సంఘటన చోటుచేసుకుంది. శ్రీవారి దర్శనానికి వచ్చిన భార్యాభర్తలు తిరుమలలోని తాము బస చేసిన అతిథి గృహంలో బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ సంఘటన తీవ్ర సంచలనం రేపింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Feb 7, 2025, 04:48 PM IST
Tirumala: తిరుమలలో తీవ్ర విషాదం.. శ్రీవారిని దర్శించుకుని భార్యాభర్తలు ఆత్మహత్య

Tirumala Suicide Incident: కలియుగ దైవం.. వైకుంఠవాసుడు కొలువుదీరిన తిరుమల కొండపై తీవ్ర విషాద సంఘటన చోటుచేసుకుంది. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చిన ఇద్దరు భక్తులు కొండపై ప్రాణాలు తీసుకున్నారు. భార్యాభర్తలు ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడడంతో తిరుమలలో తీవ్ర విషాదం నింపింది. ఊహించని సంఘటనతో తిరుమల ఉలిక్కిపడింది. భక్తులు ఆత్మహత్య చేసుకున్నారనే వార్త తీవ్ర సంచలనం రేపింది. బలవన్మరణానికి పాల్పడిన వారు ఇద్దరు భార్యాభర్తలుగా తెలుస్తోంది.

Also Read: Pregnant: టాయిలెట్‌లో గర్భిణికి లైంగిక వేధింపులు.. కదులుతున్న రైలు నుంచి తోసేసిన సైకో

తిరుమలలోని నందకం అతిథి గృహంలోని 203 గదిలో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారని సమాచారం రావడంతో స్థానిక పోలీసులు అక్కడకు చేరుకున్నారు. భార్యాభర్తలు ఇద్దరు ఉరేసుకుని కనిపించారు. వెంటనే వారిని కిందకు దింపగా అప్పటికే వారు మరణించారు. మృతులు భర్త శ్రీనివాసులు నాయుడు (55), భార్య అరుణ (50)గా తెలుస్తోంది. శ్రీవారి దర్శనం చేసుకున్న అనంతరం గదికి చేరుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటనకు సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. తిరుమలలో ఇలాంటి సంఘటన చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది.

Also Read: Foreign Liquor: మద్యం ప్రియులకు జాక్‌పాట్‌.. ఒకే దుకాణం మూడు బ్రాండ్ల మద్యం

భక్తితో స్వామిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు ఈ దారుణానికి పాల్పడడం విస్మయం కలిగిస్తోంది. తిరుమల చరిత్రలో గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నట్లు తిరుమల స్థానికులు గుర్తుచేసుకుంటున్నారు. అయితే మృతులు ఆత్మహత్యకు పాల్పడడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. భార్యాభర్తలే వచ్చారా? మరికెవరైనా వారి వెంట వచ్చారా? అనేది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆత్మహత్య చేసుకోవడానికి తిరుమలను ఎంచుకోవడంపై భక్తుల నుంచి భిన్న స్పందన లభిస్తోంది. ఈ సంఘటన తిరుమల భక్తులను కలవరపరుస్తోంది. భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా టీటీడీ చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News