Zoo Park - Aramghar Flyover: హైదరాబాద్ పాతబస్తీ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు కనెక్ట్ చేసే జూ పార్క్ టూ ఆరంఘర్ చౌరస్తా వరకు నిర్మించిన ఫ్లై ఓవర్ ఈ రోజు సాయంత్రం 4గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభిస్తారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు హైవేకు ఉన్న ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు ఆరాంఘర్ నుంచి జూపార్కు వరకు 4.08 కిలోమీటర్ల పొడవునా ఫ్లై ఓవర్ నిర్మించారు. దీనికి దాదాపు రూ. 800 కోట్ల రూపాయలు వెచ్చించింది బల్దియా. స్థల నష్టపరిహారంతో పాటు కట్టడానికి కలిపి మొత్తంగా ఈ ఫ్లై ఓవర్ నిర్మాణానికి ఈ మేరకు ఖర్చు అయినట్టు సమాచారం.
భాగ్య నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ దృష్టిలో పెట్టుకొని ఈ ఫ్లైఓవర్ ను నిర్మించారు. హైదరాబాద్ లో ట్రాఫిక్ నిత్యం పెరుగుతూనే ఉంది. ప్రజలు కూడా ఎంతో విలువైన సమయం మొత్తం రోడ్డుపైనే గడిపేస్తున్నారు. గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడటమే కాకుండా కోట్లాది రూపాయల ఇంధనం, విలువైన సమయం వృథా అవుతోంది. నగరంలోని ముఖ్యప్రాంతాల్లో ట్రాఫిక్ క్రమబద్దీకరించేందుకు జీహెచ్‌ఎంసీ వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టింది.
అందులో భాగంగా ఫ్లై ఓవర్ లు, ఆర్వోబీ, ఆర్ యూబీ లను నిర్మిస్తూ ట్రాఫిక్ ఇక్కట్లను దూరం చేస్తూ వస్తోంది. బహదూర్ పుర - ఆరాంఘర్ చౌరాస్తా వరకు ఉన్న పైవంతెన పీవీ ఎక్స్‌ప్రెస్ ఫ్లైఓవర్ తర్వాత నగరంలో రెండో అతిపెద్ద వంతెన. దీనిని ఆరు లేన్లతో119 పిల్లర్లతో 4.08 కిలోమీటర్ల మేర చేపట్టిన అతి పొడవైన ఫ్లై ఓవర్ ఇది.
పాతనగరంలో ఇప్పటికే పలు ఫ్లై ఓవర్లు అందుబాటులోకి వచ్చి ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికింది. ఓవైసీ ఫ్లై ఓవర్, అబ్దుల్ కలాం ఫ్లై ఓవర్, చాంద్రాయణ గుట్ట ఫ్లై ఓవర్ అందుబాటులోకి తీసుకురాగా..ఆరాంఘర్-జూపార్కు ఫ్లై ఓవర్‌తో శంషాబాద్ విమానాశ్రయం వరకు ప్రయాణం సాఫీగా సాగనున్నది. ఆరాంఘర్, శాస్త్రిపురం, కాలా పత్తర్, శివరాంపల్లి, హసన్‌నగర్ జంక్షన్లలో ట్రాఫిక్ రద్దీకి శాశ్వత రిష్కారం లభించనున్నది. నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు రవాణా మెరుగుపరచడమే కాకుండా సిగ్నల్ ఫ్రీ రవాణా వ్యవస్థ కు ఈ ఫ్లైఓవర్స్ దోహద పడనున్నది. అటు కందికల్ గేట్ ఆర్ఓబీ, ఉప్పుగూడ ఆర్ యూబీ వంటి రైల్వే శాఖ, తెలంగాణ ప్రభుత్వం సమన్వయంతో పూర్తై పాతబస్తీలో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టగలిగారు. త్వరలో చంచల్ గూడ - సంతోష్ నగర్ స్టీల్ వంతెన త్వరలో అందుబాటులో రానుంది.
ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..
ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భారీగా పెరిగిన శోభిత ఆస్తులు.. ఎవరి ఎక్స్ పెక్ట్ చేయరు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.